…. ఎవరైనా మరణిస్తే… ఆయన మరణం తీరని లోటు అని సంతాప ప్రకటన చేస్తుంటారు కదా… చాలా మరణాల విషయంలో అది మర్యాదపూర్వకమైన సంతాపం కావచ్చు గాక… కానీ ఈరోజు మరణించిన కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ మరణం మాత్రం కాంగ్రెస్ పార్టీకి నిజంగానే తీరనిలోటు… అసలే అనేక కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం మరింత నష్టదాయకమే… కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఆయన కీలకమైన లీడర్…
ట్రబుల్ షూటర్… స్ట్రాటజిస్టు… సైలెంట్ ఆపరేటర్… తను పెద్దగా తెరమీద కనిపించడు… వార్తల్లో ఉండడు… వివాదాల్లోకి రాడు… అసలు తనను కలవడమే గగనం… కానీ కాంగ్రెస్ కీలక వ్యవహారాలన్నింటికీ సూత్రధారి తనే… వ్యవహారాలు చక్కబెట్టే చక్రధారి… కాంగ్రెస్ పెద్దలకు తెలుసు అహ్మద్ పటేల్ పార్టీలో ఎంతటి కీలకమో… ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి, పార్టీ కోశాధికారి… ఇదంతా అధికారికం…
ఎప్పుడో సెవెంటీస్‌లో గుజరాత్, భరూచా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం దగ్గరైన మొదలైన తన పొలిటికల్ కెరీర్… కాంగ్రెస్ కీలక పోస్టుల దాకా సాగింది… మూడుసార్లు లోకసభ సభ్యుడు… తరువాత ప్రత్యక్ష ఎన్నికల నుంచి వైదొలగి 1993 నుంచి అయిదుసార్లు రాజ్యసభ సభ్యుడే… మొన్నటికిమొన్న గుజరాత్ నుంచి తను రాజ్యసభకు ఎన్నిక గాకుండా బీజేపీ సర్వవిధాలా ప్రయత్నించింది… ఎందుకంటే..? అహ్మద్ పటేల్‌ను ఓడించి కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బ కొట్టాలని…
Ads
కానీ కర్నాటక డీకే శివకుమార్ డబ్బులు ఖర్చు పెట్టి, పార్టీ ఎమ్మెల్యేలను క్యాంపుకి తరలించి, అహ్మద్ పటేల్‌ను గెలిపించాడు… అహ్మద్ పటేల్ స్థానమేమిటో అర్థమయిందిగా…! ప్రతి పార్టీకి తెరవెనుక చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటయ్… విరాళాలు, ప్రతిసాయాలు, నియామకాలు, తొలగింపులు, ఎత్తుగడలు, సర్దుబాట్లు, బుజ్జగింపులు… ఒక్కటీ బయటికి రావద్దు… అహ్మద్ పటేల్ అందులో ఆరితేరిన వ్యక్తి… అందుకే తన మరణం ఇప్పటి స్థితిలో కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటే… 2004, 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాల వెనుక అహ్మద్ పటేల్ బుర్ర పాత్ర కూడా తీసిపారేయలేనిది…
తను కొద్దిరోజులుగా ఐసీయూలో ఉన్నాడు… కోవిడ్‌తో హాస్పిటల్లో చేరినా, తరువాత అన్ని అవయవాలూ పనిచేయడం ఆపేశాయి,,, ఇప్పటి ఆయుప్రమాణాల్లో 70 ఏళ్లు మరణించే వయస్సేమీ కాదు… కానీ ముంచుకొచ్చింది తప్పలేదు… అటు సోనియా అనారోగ్యం, ఇటు వారసత్వ సమస్యలు… సీనియర్ల తిరుగుబాట్లు… ప్రత్యర్థి పార్టీ దూకుడు… నెహ్రూ కుటుంబానికి ఏదో కష్టకాలం… సరిగ్గా ఈ కష్టకాలంలోనే ఈ విధేయుడు తను ఏమీ చేయలేకపోతున్నానే అనే అసంతృప్తితోనే ఈ లోకం వదిలివెళ్లాడు కావచ్చు…! సారీ సర్, వుయ్ మిస్ యు…
Share this Article