Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవును, పాటలు, సీన్లు, ట్రెయిలర్లు చెప్పేది అదే… ‘టాక్సిక్’ అని..!!

July 23, 2026 by M S R

.

టాక్సిక్… ఇప్పుడు ఫిలిమ్ సర్కిళ్లలో బాగా చర్చనీయాంశం… కొన్ని చెప్పుకుందాం, చెప్పుకోవాలి… ఈ సినిమా నిర్మాత వెంకట్ కె నారాయణ… గుర్తొచ్చిందా, ఈరోజు విడుదలవుతున్న విజయ్ సినిమా జననాయకుడు నిర్మాత కూడా తనే… అది చాలారోజులు సెన్సార్ చిక్కుల్లో ఉండి, ఎట్టకేలకు విముక్తి పొందింది… తన మరో సినిమా టాక్సిక్ కూడా చాన్నాళ్లుగా ఆగిపోయింది, వచ్చే నెల 26న రిలీజ్ అవుతుందని ఆశిస్తున్నారు…

ఏమిటి నాయనా..? మరీ మీ టాక్సిక్ సినిమాలో ‘ఏ’ పెద్దలకు మాత్రమే బాపతు సీన్లు తప్ప ఇంకేం కనిపించడం లేదని ఎవరో అడిగితే… సేమ్, ఆ దర్శకురాలు చెప్పినట్టుగానే ‘‘మా సినిమా పేరు టాక్సిక్, ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్… అంటే పెద్దల కోసమే తీసింది కదాని బరితెగింపు బదులిచ్చాడు… నిజానికి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ట్రెయిలర్లు, రెండు పాటలు చూస్తుంటే,..

Ads

చుంబనాలు, ఆలింగనాలు, బరిబాతల బాత్‌టబ్ సీన్లు, పదే పదే హత్తుకోవడాలు, బట్టలు పదే పదే జారవిడవడం, విప్పేయడం, చీకట్లో చిందులు గట్రా… ఫుల్లుగా బోల్డ్ అండ్ ఏ మార్క్ దృశ్యాలే… అదనంగా యాక్షన్, తుపాకులు, పేలుళ్లు…

యశ్ తన కేజీఎఫ్ రాఖీ భాయ్ బాపతు హేంగోవర్ నుంచి బయటపడలేదు ఇంకా… అదే రగ్డ్ లుక్ (బవిరి గడ్డం), గ్యాంగ్‌స్టర్ నేపథ్యం, డార్క్ టోన్, భారీ యాక్షన్ ఎలివేషన్లు… రాబోయే రామాయణ సినిమాలో కూడా రావణ పాత్రధారి కదా… మొత్తం కెరీర్ అంతా నెగెటివ్ షేడ్సే తనకు సూటవుతాయని ఫిక్స్ అయినట్టున్నాడు మనిషి… అన్నట్టు ఈ సినిమాకు సహనిర్మాత, అఫ్‌కోర్స్,‌ రామాయణకు కూడా!

yash

టాక్సిక్… అవును, ఈ సినిమా టాక్సిక్ (విషప్రాయం)గానే కనిపిస్తోంది… టేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నట్టు కనిపిస్తున్నా సరే…! ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి… మలయాళీ దర్శకురాలు, గతంలో చాలా నీతులు చెప్పేది… మన సినిమాల్లో ఆడవాళ్లను కేవలం గ్లామర్ డాల్స్‌లాగా, సంభోగ వస్తువుల్లాగా చూపిస్తుంటారు, పురుషాధిక్యత కనబరుస్తుంటారు వంటి అభిప్రాయాలు వెల్లడించేది…

తీరా ఆమె టాక్సిక్ ధోరణి చూస్తే… అందరినీ మించిపోయింది దర్శకురాలు గీతూ మోహన్‌దాస్… డబుల్ స్టాండర్డ్స్… ఇదెందుకు చెప్పుకోవాలంటే… సినిమా రిలీజు లేట్ కావడానికి కారణం కియరా అద్వానీ… తనను మరీ ఓవర్ ఎక్స్‌పోజ్ చేశారనీ, హాట్, సూపర్ హాట్ సీన్లు తనకే చూడబుల్‌గా లేవని పంచాయితీ పెట్టిందట… చివరకు ఎలా డైల్యూట్ చేశారో, ఎవరెలా కన్విన్స్ చేశారో గానీ, ఇప్పటికే తక్కువేమీ లేదు… (మరి నటించినప్పుడు ఈ సోయి లేదా అమ్మడికి?)

ప్రస్తుతం రిలీజ్ చేసిన రెండు పాటలూ అలాగే ఉన్నాయి… ఇక సినిమాలో ఎలా రెచ్చిపోయిందో గీతా మోహన్‌దాస్… ఆమె ఏదో మార్మిక వివరణను ఎవరికీ అర్థం గాకుండా ఇచ్చింది… దానిపైనా సోషల్ మీడియాలో ఆమెపై విరుచుకుపడ్డారు నెటిజన్లు… కర్ణాటకలో ఈ టీజర్‌లోని కొన్ని దృశ్యాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతూ మహిళా సంఘాల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి…

టాక్సిక్

జీఎఫ్ కంటే దీన్ని మరింత స్టైలిష్‌గా, ఇంటర్నేషనల్ డ్రగ్ /క్రైమ్ మాఫియా నేపథ్యంలో, ఒక సరికొత్త ఫెయిరీ టేల్ ఫార్మాట్‌లో దర్శకురాలు మలుస్తున్నట్టు ప్రమోటర్లు ప్రచారం చేసుకుంటున్నారు… లుక్స్‌పరంగా యశ్ తన సిగ్నేచర్ మాస్ అప్పీల్‌ను ఇక్కడా కొనసాగిస్తున్నాడు…

మరో విశేషం ఏమిటంటే..? ఇది ఓ మల్టీస్టారర్… ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఎందరు ప్రముఖ తారల్ని దింపారో తెలుసా..? కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్… చివరకు యశ్ కూడా ఇందరిని దింపితే తప్ప సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాదు అనుకున్నాడా..? హతవిధీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవును, పాటలు, సీన్లు, ట్రెయిలర్లు చెప్పేది అదే… ‘టాక్సిక్’ అని..!!
  • ఫాఫం పూజా హెగ్డే ! ‘జననాయకుడి’ కథలో ఎడాపెడా కట్ కట్ !!
  • మిస్టర్ పవన్ కల్యాణ్… కోడి చెరువు కబ్జాపై మాట మీద నిలబడతావా…
  • 52 లోనూ అదే 25 … నాటి ‘గాయం’- నేటికీ అదే ప్రాయం… ఆమే ఊర్మిళ !!
  • ఏదో ఓరోజు నిజం అబద్ధాన్ని చెప్పుతో కొడుతుంది ! ఎవరన్నారు? ఎవరిని?
  • ముట్టడి పోరాటాలన్నీ మైలేజీ పోరాటాలే… ఎవ్వడూ తగ్గట్లేదు…
  • ధర్మేంద్ర ప్రధాన్… విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగినవాడే…
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా సంకేతాలు ఇవే !!
  • ఈ చట్టాలు ఎందుకూ పనికిరావు – ముళ్లు పీకాల్సింది బుల్‌డోజర్లే !!
  • జస్ట్, సెకన్ల ఆపరేషన్ – ఖేల్ ఖతం – ఉగ్రవాది హతం – 141 ప్రాణాలు సేఫ్

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions