Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్యాకు తలబొప్పి… సిరియాపై తిరుగుబాటుదారుల పట్టు…

December 1, 2024 by M S R

.

WW3 అప్డేట్ 5… సిరియా మళ్ళీ సంక్షోభంలోకి వెళ్ళబోతున్నది!

సిరియాలోని రాజధాని డమాస్కస్ తరువాత రెండో పెద్ద నగరం అయిన అలెప్పీ తిరుగుబాటు దారుల చేతిలోకి వెళ్లిపోయింది!

Ads

వాణిజ్యపరంగా కీలకమైన అలెప్పో నగరం మూడురోజులలోనే ప్రభుత్వ తిరుగుబాటుదారుల వశం అయ్యింది!

టర్కీ సైన్యం సిరియా తిరుగుబాటు దారులకి అండగా నిలబడి దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది! బ్రిక్స్ లో చేరడానికి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన విజ్ఞప్తిని భారత్ వీటో చేస్తే, అది పుతిన్ సమర్థించాడు అనే కసితో రష్యాకు తన అవసరం ఎంతుందో చెప్పడానికే ఈ పనిచేశాడు!

సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఎదురుదాడి చేయమని ఆదేశాలు ఇచ్చినా సిరియా సైన్యం రెబెల్స్ ధాటికి తలవంచి అలెప్పోను రెబెల్స్ చేతిలో పెట్టింది!

అలెప్పో నగరంలోని సిటీ సెంటర్ లో రెబెల్స్ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు!

సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మూడురోజుల క్రితం మాస్కో వెళ్లి అక్కడే ఉన్నాడు. పుతిన్ ఖజకిస్థాన్ పర్యటనలో ఉన్నాడు.

పుతిన్ తమ మాజీ సోవియట్ యూనియన్ రిపబ్లిక్స్ తో కలిసి నాటో తరహా కూటమిని ఏర్పాటు చేసే దిశగా సుడిగాలి పర్యటన చేస్తున్న తరుణంలో సిరియా అధ్యక్షుడు మాస్కో వచ్చి పుతిన్ కోసం వేచి చూడడం అనుమానాలకు తావిస్తున్నది!

పుతిన్ స్వయానా మాజీ సోవియట్ యూనియన్ రిపబ్లిక్స్ మద్దతు కోసం తిరుగుతుంటే తనకి సహాయం చేయమని అడగడానికి బషర్ అల్ అసద్ రావడంపై రష్యా మిలటరీ బలహీనపడింది అని చెప్పుకోవచ్చు!

2015 లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తరువాత ప్రభుత్వ సైన్యం రెబెల్స్ కి మూడురోజుల్లో లొంగిపోవడం ఇదే మొదటి సారి!

సిరియా తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్ళిపోనున్నది అనడానికి తిరుగులేని సాక్ష్యాలు కనపడుతున్నాయి.

1. అలెప్పో నగరానికి ఉత్తరాన ఉన్న తల్ రిఫాట్ ( Tal Rifaat) ఎయిర్ బేస్ రష్యన్ల ఆధీనంలో ఉన్నది గత అయిదేళ్లుగా. దానిని ఖాళీ చేసి వెళ్లిపోయారు రష్యన్లు.

2. రష్యన్ టెలిగ్రాం చానెల్స్ గత రెండు రోజులుగా సిరియాలో జరుగుతున్న తిరుగుబాటు గురుంచి తీవ్రంగా చర్చిస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యూహాత్మకంగా సిరియా వార్తలకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు.

3. రెబెల్స్ అలెప్పో నగరానికి వచ్చే దారిలో రష్యన్ డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్స్ రెబెల్స్ కంట పడడం, వాళ్ళని చంపి డ్రోన్స్ తో పాటు రిమోట్ కంట్రోల్ సెంటర్ స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి ప్రతిఘటన లేకుండా.

4. డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్స్ దగ్గరలోనే రష్యన్ ఆయుధ డిపోలు ఉన్నాయి కానీ అక్కడ నామమాత్రంగా రష్యన్ సైనికులు కాపలాగా ఉన్నారు, కానీ రెబెల్స్ ను ఎదుర్కోలేక ఆయుధ డిపోలని రెబెల్స్ కి అప్పచెప్పారు!

5. ఇక రష్యకి ఉన్న ఒకే ఒక్క వేడి జలాల ( warm water port) నావీ బేస్ అయిన టార్టస్ పోర్టు ( Tartus Port) వైపు రెబెల్స్ వెళుతున్నారు. వాళ్ళ లక్ష్యం రష్యా ఆధీనంలో ఉన్న టార్టస్ పోర్టుని స్వాధీనం చేసుకోవడమే! వేడి జలాల పోర్టు అంటే…రష్యాకి ఉన్న అన్ని నావీ బేస్ లు నిత్యం మంచుతో కప్పబడిన నీటితో ఉన్నవే.

సిరియాలో ఉన్న టార్టస్ నావీ బేస్ మధ్యధరా సముద్రం ఒడ్డున ఉంది కానీ సముద్ర జలాలు గోరు వెచ్చగా ఉంటాయి. రష్యన్ నావీ తమ యుద్ద నౌకలని రిపేర్ మరియు నిర్వహణ, సిరియాలో ఉన్న తమ ఆర్మీకి కావాల్సిన సప్లైస్ ఈ పోర్టు ద్వారా చేస్తూ వస్తున్నది గత ఏడేళ్లుగా!

6. టార్టస్ నావీ బేస్ కనుక రెబెల్స్ చేతిలోకి వెళితే అది పరోక్షంగా అమెరికా ఆధీనంలోకి వెళ్ళినట్లే! ఇదే జరిగితే సిరియా రెబెల్స్ అంటే టర్కీ, అమెరికా, ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సముద్రం ద్వారా సప్లైస్ ఆగిపోతే రవాణా విమానాల ద్వారా సప్లైస్ చేయాల్సి ఉంటుంది కానీ టర్కీ మీదగా వెళితే దగ్గర కానీ ఎర్దోగాన్ ఒప్పుకోడు!

7. 2022 లో ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలటరీ ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత పుతిన్ సిరియాలో ఉన్న హెవీ మిషన్స్ తో పాటు అనుభవం ఉన్న తన సైనిక జెనెరల్స్ ను ఉక్రెయిన్ కి తరలించాడు! ప్రస్తుతం సిరియాలో ఉన్న రష్యన్ సైనికులు, జనరల్స్ పెద్దగా అనుభవం లేని వాళ్లే!

8. 2015 లో ఇదే అలెప్పో నగరాన్ని రెబెల్స్ స్వాధీనం చేసుకున్నారు కానీ రష్యన్, సిరియన్ సైన్యం కలసి పోరాడి అలెప్పో నగరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోవడానికి 6 నెలలు పట్టింది. ఇప్పుడు అదే అలెప్పోను మూడురోజుల్లో తిరిగి స్వాధీనం చేసుకున్నారు రెబెల్స్!

9. ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ పూర్తి స్థాయిలో తన మిలటరీని సిరియా పంపించే అవకాశం లేదు. పుతిన్ 20 వేల మంది ఉత్తర కొరియా సైనికులను ఉక్రెయిన్ సరిహద్దులో మొహరించాడు!

”****”””
ఎవరు ఎన్ని యుద్ధ వ్యూహాలు రచించినా అవి మహా భారత యుద్ధం నుండి తీసుకోవాల్సిందే!

10. మూడు రోజుల కిందట ఇజ్రాయెల్ హెఙబొల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. ఇంతలో కాల్పుల విరమణ దేనికోసం?

11. థియేటర్ మార్పు కోసం! హమాస్, హెఙబొల్లాలని ఎప్పుడైనా ఎదుర్కోవచ్చు. ఉక్రెయిన్ ని కాపాడుకోవాలి అంటే రష్యా దృష్టి మరల్చాలి! సిరియాలో పెద్దగా రష్యా దళాలు లేవు కాబట్టి సిరియా ఎప్పటి నుండో టార్గెట్ లో ఉంది కాబట్టి ముందు సిరియాని వశపర్చుకుంటే పుతిన్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.

12. హమాస్, హెఙబొల్లాలకి ఆయుధాలు, ఆహారం, మందులు ఇరాన్, రష్యాలు ముందు సిరియాకి పంపిస్తే సిరియా నుండి లెబనాన్ లోకి సప్లై అవుతున్నాయి!

13.సిరియా కనుక రెబెల్స్ చేతిలోకి వెళితే మిడిల్ ఈస్ట్ లో రష్యాకి ఉన్న పట్టు పోతుంది! జస్ట్ మధ్యధరా సముద్రంతో లింక్ పోతుంది!

రష్యాని ఉక్రెయిన్ తో బిజీగా ఉండేట్లు చేసి సిరియా మీద దాడి మొదలుపెట్టారు. అక్కడ అభిమన్యుడు లేడు దుర్యోధన, కర్ణులు లేరు కానీ పద్మవ్యూహం పన్నారు!

వాస్తవానికి రష్యా, ఇరాన్ ల సపోర్ట్ లేకపోయి ఉండి ఉంటే 2016 లోనే సిరియా సున్ని రెబెల్స్ చేతిలోకి వెళ్ళిపోయి ఉండేది!

పేరుకే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కానీ సిరియాని గత పదేళ్లుగా నడిపిస్తున్నది హెఙబొల్లా, రష్యన్ సైనికులు మాత్రమే!

సిరియా దేశం మొత్తం బషర్ అల్ అసద్ చేతిలో లేదు. రాజధాని డమాస్కస్ చుట్టు పక్కల ప్రాంతం, అంటే లెబనాన్ తో ఆనుకుని ఉన్న ప్రాంతం మాత్రమే అసద్ పాలనలో ఉంది. కొంత ప్రాంతం రెబెల్స్ చేతిలో, మరికొంత ప్రాంతం ISIS పాలనలో ఉన్నాయి. ISIS అనేది CIA కంట్రోల్ లో ఉంటుంది అన్నది బహిరంగ రహస్యమే!

*******
లష్కరే తోయిబా పాకిస్థాన్.
లష్కరే తోయిబా టెర్రర్ అవుట్ ఫిట్ ISI ద్వారా సిరియాలోని రెబెల్స్ తో కలిసి ఫైట్ చేయడానికి టర్కీ అధ్యక్షుడు ఎర్డ్ గాన్ ని అనుమతి కోరినట్లు వార్త. ఇది కేవలం అనుభవం కోసమే! అనుభవం వచ్చిన తరువాత భారత్ సరిహద్దుల్లో పనిచేస్తుంది!

*****
ప్రస్తుత టర్కీ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది?

ఒక టర్కీ లీరా విలువ 0.029 డాలర్ గా ఉంది.

టర్కీ ద్రవ్యోల్బణ రేటు : 60.9%.

ఇలాంటి స్థితిలో టర్కీ సిరియన్ రెబెల్స్ కి మద్దతుగా తన సైన్యాన్ని పంపించగలదా? అమెరికన్ ఫండింగ్ లేకుండా ఇది జరిగే పని కాదు.

********

పుతిన్ తప్పిదాలు :

టర్కీ నాటోలో భాగస్వామి అని తెలిసీ S400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమ్మడం!

ఎర్డోగాన్ గుంటనక్క అని తెలిసీ S400 అమ్మి తప్పుచేసాడు పుతిన్. ఇప్పుడు S400 ని ఉక్రెయిన్ కి ఇస్తే రష్యాకి ఇచ్చిన దానికి రెట్టింపు డాలర్లు ఇస్తామని జో బిడెన్ బేరం పెట్టాడు! ఎర్డోగాన్ ఇచ్చేస్తాడు!

పనిలో పనిగా S400 డాటాని విశ్లేషిస్తారు!

పుతిన్ మొదటి S500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యుద్ధరంగంలో మొహరించాడు!
జనవరి 20, 2025 న డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయగలుగుతాడా? ఏమో! అంత సులువుగా జో బిడెన్ నుండి ట్రంప్ కి అధికార మార్పిడి జరుగబోదేమో…. ఆ వివరాలు WW3 అప్డేట్ 6 లో…. — పొట్లూరి పార్థసారథి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions