సాక్షి ఫస్ట్ పేజీలో వార్త చదివారు కదా… దేశంలోకెల్లా టాప్ టెన్ పత్రికల జాబితాలో చేరినట్టు రాసుకుంది… గుడ్… మరి ఈనాడు మాటేమిటి..? కూతలెక్కువ నాణేనికి గీతలెక్కువా..? గీరలెక్కువా..? చూద్దాం…
టీవీ పాపులారిటీ నిగ్గు తేల్చేవి బార్క్ రేటింగ్స్… అందులోనూ దందాలు, లోపాలు ఎన్ని ఉన్నా ప్రస్తుతం యాడ్స్ ఇచ్చే ధర్మదాతలు దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు… అలాగే పత్రికల సర్క్యులేషన్‌కు ఏబీసీ… దీనిలోనూ లోపాలు లేకపోలేదు, కానీ ప్రస్తుతానికి ఇదే చెల్లుబాటు…
ఇది గాకుండా రీడర్‌షిప్ సర్వే అని ఒకటి ఉంటుంది… నమ్మబుల్ అనిపించదు..! ఐనా ఎవడికివాడు సీఏ సర్టిఫికెట్ అని ఏదిపడితే అది రాయించేసుకుని, ప్రభుత్వంలో పైరవీలు చేసుకుని, ఐఆర్‌పీఆర్ జాబితాలో ఎన్‌ప్యానెల్ అయిపోయి వందల కోట్ల ప్రజాధనం కుమ్మేసుకుంటుంటే… ఇంకా ఏబీసీ దేనికి అంటారా..?
Ads
నిజమే… ఈసారి ఏబీసీ విడుదల చేసిన గత ఆరు నెలల సర్క్కులేషన్ వివరాల జాబితాలు చూస్తే… పాపులర్ మలయాళ డెయిలీస్ మలయాళ మనోరమ గానీ, మాతృభూమి గానీ, ఇంకా పలు పత్రికలు ఏబీసీకి దరఖాస్తు చేసుకోనేలేదు… ఎహె, ఎవడికి కావాలి నీ సర్టిఫికెట్ అని లైట్ తీసుకున్నాయి… దీంతో దేశంలో టాప్ టెన్ జాబితాలోకి… ఇదుగో సాక్షి వంటి పత్రికలూ వచ్చి చేరాయి… అదీ అసలు నిజం…
మరొకటి చెప్పుకోవాలి… అయ్యో, అయ్యో, ఈ జగనుడి దుంపతెగ, మమ్మల్ని దెబ్బతీసి, సాక్షిని పైకి లేపడానికి వాలంటీర్లకు డబ్బులిచ్చి కుట్ర చేస్తున్నాడు, అన్యాయం, అక్రమం అంటూ సుప్రీం దాకా వెళ్లింది కదా ఈనాడు కేసు… 2013 ద్వితీయ అర్థసంవత్సరంతో పోలిస్తే … 2024 జనవరి నుంచి జూన్ దాకా ఈనాడు సర్క్యులేషన్ కాస్త పెరిగింది…
మరి వాలంటీర్లకు ఇచ్చిన డబ్బుతో ఈనాడుకు నష్టమేమొచ్చింది..? సాక్షి ఏమైనా ఈనాడును దాటేసి పైకి పోయిందా..? ఏదీ జరగలేదు… కాకపోతే ఇప్పుడిక చూడాలి… ఈ జూలై నుంచి లెక్క చూడాలి… వాలంటీర్లకు డబ్బులిచ్చే జీవోను రద్దు చేశాడు కదా చంద్రబాబు… ఆ ప్రభావం సాక్షి మీద ఏమైనా నెగెటివ్‌గా ఉంటుందా చూడాలి… ఈ టాప్ 8 ప్లేసు ఉంటుందా చూడాలి… 20 శాతం గత పెరుగుదల ఉంటుందా, ఊడుతుందా చూడాలి…
సరే, ఆ రెండూ వదిలేస్తే ఆంధ్రజ్యోతి పరిస్థితేమిటి..? ఏమీ లేదు, ఎక్కడేసిన గొంగళి అక్కడే… 3.93 లక్షలు దాని మొత్తం సర్క్యులేషన్… ఈనాడు సర్క్యులేషన్ 14.89 లక్షలు కాగా, సాక్షి 12.47 కాగా… జ్యోతి వాటికి ఎంత దూరంలో ఉందో అర్థం చేసుకోవచ్చు… దీన్ని పట్టుకుని నా అసలు శత్రువు, నా అసలు ప్రత్యర్థి అంటూ ఏదేదో చెప్పాడు జగన్ ఫాఫం…
దైనిక్ భాస్కర్ 30 లక్షల సర్క్యులేషన్… దైనిక్ జాగరణ్ 24 లక్షలు… వాటిని చేరడానికి ఇక తెలుగు పత్రికల సాధనసంపత్తి సరిపోవు… కారణం… అవి హిందీ పత్రికలు, రీచ్ ఎక్కువ… పలు రాష్ట్రాల్లోల చదువరులు, నెట్‌వర్క్… మన తెలుగుకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే… పైగా నిలువెల్తా రాజకీయపు బురద పూసుకుని మరీ పాఠకుల్ని పలకరిస్తాయి… క్రెడిబులిటీ నీచస్థాయిలో ఉంటుంది…
మన మూడు తెలుగు పత్రికలు వదిలేస్తే మిగతా పత్రికలన్నీ కౌంట్ లెస్… వాటి సర్క్యులేషన్ గురించి చెప్పుకోవడం అనవసరం… వాటి ప్రభావమూ శూన్యం… ఇప్పుడిక ఆంధ్రజ్యోతిని కూడా వాటి గాటన కట్టేయొచ్చు… సో, ఈనాడు వర్సెస్ సాక్షి… ఇంకొన్నాళ్లు ఉంటుందేమో… ఏమో, చంద్రబాబు వచ్చాడు కదా, సాక్షి మీద కొన్ని నిలిపివేత ప్రయత్నాలు సాగుతాయి… గతంలోలాగే… చూడాలిక..!!
ఈనాడు, సాక్షి కాపీలు పెరిగినట్టు చెబుతున్నారు కదా… ప్రింట్ మీడియా గత వైభవం అందుకుంటుందా..? కష్టాలు తీరిపోయాయా..? లేదు… వీటి కాపీల పెరుగుదల వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయి… ఇదంతా ఎన్నికల వాపు, బలుపు కాదు… అందుకే తాత్కాలికంగా పెంచుకోవడానికి నానా కష్టాలూ పడ్డాయి… ఇకపై ఆ సిట్యుయేషన్ ఉండదు… అంతెందుకు..? ఒకటీరెండు పత్రికలు మినహా దేశంలో ప్రతి పత్రిక కాపీల సంఖ్య మరింత పడిపోయింది… ఎస్, ఈరోజుకూ అదే సిట్యుయేషన్… ప్రింట్ మీడియా రోజులు బాగాలేవు… ఉండవు…!!
Share this Article