సినిమాలు ఫ్లాప్ అవుతుంటయ్… సహజమే… టీవీ షోలు కూడా ఫ్లాప్ అవుతుంటయ్, అదీ సహజమే… కానీ రీసెంటుగా తెలుగు టీవీ ప్రోగ్రాముల్లో పాల్గొని పరువు పూర్తిగా పోగొట్టుకున్న వాళ్లెవరు అని అడిగాడు ఓ మిత్రుడు సరదాగా… క్లిష్టమైన ప్రశ్నే… సరదాగా అడిగినా సరే, ఇలా అడగ్గానే అలా చెప్పేయడం కుదరదు… ఎందుకంటే..? చెప్పడానికి బేస్ ఉండాలి… కనీసం బార్క్ రేటింగుల పరిశీలన ఉండాలి, జనం ఫీడ్ బ్యాక్ ఉండాలి… టీవీ సీరియళ్లు వదిలేద్దాం… ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు… అన్నీ మెంటల్ సీరియళ్లే… కథా దరిద్రానికి, కథన దౌర్భాగ్యానికి, క్రియేటివ్ బురదకు చిరునామాలు… ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… మరి రియాలిటీ షోలు… ఎస్, అదే చెప్పుకోవాలి,… అందులోనే ఇజ్జత్ లాసైన కేరక్టర్లు దొరుకుతయ్ కాబట్టి… ఫస్ట్ పేరు మాస్టర్ చెఫ్…
నిజానికి ఇంత అట్టర్ ఫ్లాపయిన షో ఈమధ్య మరేదీ లేదు… దానికి పూర్తి బాధ్యత జెమిని క్రియేటివ్ టీం, సదరు షో నిర్మాతలు… తమన్నాను తీసుకున్నారు, అసలు ఆ వంటల పోటీ ఫార్మాట్ సరిగ్గా లేదుర భయ్, మన తెలుగువాళ్లకు అది సూటవదు అని ఎందరు చెప్పినా ఎవడూ వినిపించుకోలేదు… తమన్నా అందం సరిపోవడం లేదని, అనసూయను తెచ్చి పెట్టుకున్నారు, అంతకు మించిన మూర్ఖత్వం ఏముంది..? పైగా లీగల్ నోటీసులు, చెత్తా వివాదాలు… అనసూయ వచ్చాక ఆ దీపం ఇంకా కొండెక్కి, ఆరిపోయింది… అనసూయదేముంది..? నాలుగు డబ్బులు వస్తే చాలు ఆమెకు… కానీ ప్రొఫెషనల్ చెఫ్స్, వంటల లోకంలో మంచి పాపులారిటీ ఉన్న చలపతిరావు, పడాల మహేశ్, తుమ్మ సంజయ్ ఆ షోలో జడ్జిలుగా ఉండి, తమ ఇజ్జత్ కోల్పోయారు… విస్మయ్ ఫుడ్స్ ఓనర్ పరుచూరి తేజా, సెకండ్ సీజన్‌కు నిన్ను కూడా పిలుస్తారేమో… జాగ్రత్త…
Ads
సేమ్, మరో ఫ్లాప్ ప్రోగ్రాం ‘మీలో ఎవరు కోటీశ్వరులు..?’ అంతటి పాపులర్ స్టార్ జూనియర్ ఎన్టీయార్ హోస్ట్ చేసినా సరే… అడ్డంగా బోల్తాకొట్టింది… మొన్నటి మహేశ్ బాబు ఎపిసోడ్‌తో బహుశా పూర్తయిపోయినట్టే అనుకోవాలి… కొనసాగితే అది జూనియర్ దురదృష్టం… దారుణంగా పరువు పోగొట్టింది ఆ షో… దానికి సగం కారణం జెమిని, ఆ కేబీసీ తెలుగు నిర్మాతల పైత్యం, నిర్వాకం కాగా… మరో సగం బాధ్యుడు జూనియరే… అసలు నందమూరి నెత్తురు అంటేనే అదో సపరేట్ బ్లడ్డు, బ్రీడు కదా… స్వోత్కర్ష, డప్పులు, భజనలు… షో పక్కదోవ పట్టి, జనం చూడటం మానేశారు… (ఈమధ్య అరుణోదయ్ శర్మ అని తొమ్మిదేళ్ల హిమాచల్ అబ్బాయి ఎదుట హిందీ కేబీసీలో అమితాబ్ ఎలా చిన్నపిల్లాడై పోయాడో, ఆ షో ఎంత లైవ్‌లీగా ఉందో ఓసారి జూనియర్ గనుక చూస్తే తన తప్పేమిటో తెలిసేది… టాప్ ఎపిసోడ్… కనీసం కన్నడలో పునీత్ రాజకుమార్ చేసిన కొన్ని ఎపిసోడ్లు చూసినా బాగుండేది…)
మాయాద్వీపం మరో ఫ్లాప్ షో… రియాలిటీ షోలకు కింగ్ అనుకుంటాడు ఓంకార్… కానీ తనను నేలమీదికి దించింది ఈ షో… అప్పటికే మాటీవీలో ఓ డాన్స్ షో పెద్దగా క్లిక్ కాలేదు, జనం ‘వన్ సెకండ్’ అనే సిక్స్త్ సెన్స్ కూడా పట్టించుకోవడం లేదు… ఇక మళ్లీ ఇప్పుడు ఇస్మార్ట్ జోడి స్టార్ట్ చేయబోతున్నాడు… కరోనా టైంలో ఆన్‌లైన్ షో చేశాడు ఆ పేరుతో… ప్చ్, ఓంకార్ హవా ఆగిపోయినట్టే… ఇజ్జత్ ఖరాబ్ అయిపోయినట్టే… మరో ఫ్లాప్ మాటీవీలో వచ్చే స్టార్ మ్యూజిక్… అంతటి ఘనత వహించిన సీనియర్ వెటరన్ యాంకర్ సుమ ఆ షో చేస్తున్నా సరే, జనం లైట్ తీసుకుంటున్నారు… ఆమె పరువు పోయింది… దానికి మించి కామెడీ స్టార్స్ మరో ఫ్లాప్… శేఖర్ మాస్టర్‌ను జడ్జి కుర్చీ నుంచి దింపేసి, వెళ్లగొట్టి, ఏ కొలువూ లేని నాగబాబును తెచ్చిపెట్టారు రీసెంటుగా… ఆ షో ఇక లేవదు… దానిలో ఎందుకో జీవం లేదు… శేఖర్ మాస్టర్ ఇజ్జత్ పోయింది…
ఇక మాటీవీలో వచ్చే బిగ్‌బాస్ గతంతో పోలిస్తే ఫ్లాప్… ఈసీజన్ ఉన్నంత చెత్తగా బహుశా ఏ భాషలో కూడా బిగ్‌బాస్ సీజన్ నడవలేదేమో… మొత్తం ఫిక్సింగ్ కార్యక్రమమని ప్రేక్షకుడికి అర్థమైపోతూనే ఉంది… ప్రత్యేకించి షణ్ముఖ్ పట్ల బిగ్‌బాస్ టీం ‘అవాంఛిత ప్రేమ’, సిరితో షన్ను గలీజు లవ్వు యవ్వారం జనానికి వెగటుపుట్టిస్తోంది… వీక్ డేస్‌లో ర్యాంకింగ్స్ చూస్తే ఆ నిర్మాతలకే పిచ్చి లేస్తున్నట్టుంది… కానీ ఏం చేయాలో తెలియదు ఇక… స్వయంకృతాపరాధం… టీం మార్చకపోతే రాబోయే సీజన్ మరింత ఘోరంగా బోల్తా కొట్టడం ఖాయం… కానీ ఇజ్జత్ పోగొట్టుకుంటున్నది నాగార్జున… చెప్పనేలేదు కదూ… ఈటీవీలో రెచ్చిపోదాం బ్రదర్ అనే షో వస్తుంది… జడ్జి సుమ భర్త రాజీవ్… అదీ అడ్డంగా ఫ్లాప్… ఇజ్జత్ చాలా ఘోరంగా కోల్పోయాడు తను… ప్లస్ బాబా భాస్కర్ కూడా…! ఇవండీ రీసెంటుగా తెలుగు టీవీల్లో పరువు పోగొట్టుకున్న కేరక్టర్స్… ఇంకా తవ్వితే ఇంకా దొరుకుతాయేమో… ఇప్పటికి ఇవి చాలు…!! (ఈ పిచ్చి షోల బార్క్ రేటింగుల్ని కూడా రాసి వాళ్ల పరువుకు ఇంకాస్త పంక్చర్ చేయడం వేస్ట్…)…
Share this Article