అదేమిటో గానీ… కొందరు మాజీ హీరోయిన్లు ఏం తాగుతారో తెలియదు… డెబ్భయ్ ఏళ్ల వయస్సులోనూ మొహంలో గ్లో తగ్గదు, అరకిలో బరువు కూడా తేడా రాదు… అఫ్ కోర్స్, కొంత మేకప్ మహత్యం కావచ్చుగాక… కానీ అదొక వరం వాళ్లకు… రేఖ, హేమమాలిని గురించే కాదు, చాలా ఉదాహరణలు దొరుకుతయ్… కానీ చాలామంది తారలు సినిమాలు మానేస్తే చాలు, ఒకరిని కన్నారంటే చాలు… బరువు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతారు… దేహం మీద శ్రద్ధ పోతుంది… వయస్సులో ఉన్నప్పటికీ, ఏ నలభయ్యేళ్లకో మళ్లీ చేసేటప్పటికీ ఓ షాక్ సహజం…
అసలు వాళ్లేనా అని ఒకటికిరెండుసార్లు చూడాలి… నటి పూర్ణిమ కూడా అంతే… ఒకప్పుడు నలభై ఏళ్ల క్రితం… జంధ్యాల బాగా ప్రేమించిన నటి… బక్కపల్చగా, పొట్టిగా, చిన్న పిల్లలా కనిపించేది… సగటు హీరోయిన్‌తో పోలిస్తే అసలేమీ కాదు… అయితేనేం… ముద్దమందారం సినిమాలో ‘ముద్దుకే ముద్దొచ్చే మందారం’ పాట చూస్తుంటే అప్పటి యువత ఆనందంగా యాక్సెప్ట్ చేసింది ఆమెను… నిజంగానే అప్పటికి పిల్లే…
నాలుగు స్థంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ సినిమాల్లో కూడా జంధ్యాల ఆప్షన్ ఆమే… అవి వదిలేస్తే అర్జున్ నటించిన సినిమా… రాణీ రాణమ్మా, ఆనాటి నవ్వులు ఏవమ్మా పాట సూపర్ హిట్… అది కోటి రామకృష్ణ సినిమా… ఆమె తెలుగమ్మాయి… చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం… తరువాత ఓ మెరైన్ ఇంజనీర్ ఉప్పులూరి రతన్‌ను పెళ్లి చేసుకుంది… వైజాగ్ చేరింది… ఆమధ్య వైసీపీలో కూడా చేరినట్టుంది…
Ads
ఆలీతో సరదాగా షో ప్రోమో చూస్తుంటే ఆమె పాత సినిమాలన్నీ చకచకా గుర్తొచ్చాయి… కానీ ఆలీ టీంలో మేకప్ టీం ఎవరో గానీ… చెత్త… అస్సలు చూడబుద్ధి కాలేదు పూర్ణిమను… నిజానికి మరీ అంత ఘోరంగా ఏమీ లేదామె, ఈమధ్య కొన్ని యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది… మళ్లీ ఏవైనా మంచి పాత్రలు దొరికితే చేద్దామని ఉన్నట్టుంది… కానీ తెలుగు టీవీ సీరియళ్లలో అత్తల పాత్రలకు వోకే… అలా మారిపోయిందామె…
గతంలో ఓ వెలుగు వెలిగిన తారలు మళ్లీ తెర మీదకు రావాలని ఆశపడుతుంటారు… వాళ్లంతా ఆలీతో సరదాగా షోలో కనిపిస్తుంటారు… కానీ ప్రస్తుతం టీవీ, సినిమా ఇండస్ట్రీలో మరీ విపరీతమైన పోటీ… పాత చరిత్రలు, ఘనతలు ఇప్పుడు పనికిరావు… పూర్ణిమకు ఇప్పుడు 56 ఏళ్లు… సినిమా ఇండస్ట్రీలో అది పెద్ద ఏజేమీ కాదు… కానీ సుడి ఉండాలి… తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు కలిసి యాభై అరవై సినిమాలు చేసినట్టుంది ఈమె…
కానీ కోడి రామకృష్ణ, జంధ్యాల సినిమాలే బాగా క్లిక్కయ్యాయి… మరీ కన్నడంలో అయితే చిల్లర పాత్రలు, వెకిలి పాటలు కూడా చేసినట్టుంది… 1981లో స్టార్ట్ చేస్తే 1987లోపు ఆమె కెరీర్ ఖతం… జస్ట్, ఆరేళ్లే… పూర్ణిమ అంటే చటుక్కున గుర్తొచ్చే పాట… ‘అలివేణీ ఆణిముత్యమా…’ అదే ఆమెను చాలామందికి గుర్తొచ్చేలా చేసింది… ‘‘అలివేణీ ఆణిముత్యమా… నా పరువాల ప్రాణముత్యమా… జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో, స్వాతి వాన లేత ఎండలో జాజిమల్లి పూలగుండెలో…!!
Share this Article