ముందుగా ఒక వార్త చదువుదాం…. ఈనాడులో కనిపించింది… ‘‘హీరోల బర్త్ డేల సందర్భంగా లేదా ఏదైనా పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో కొన్ని పాత సినిమాల్ని రీరిలీజ్ చేస్తుంటారు… అదొక సెలబ్రేషన్… పాత చిత్రాలకు 4 కే అనే రంగు పూసి కొత్తగా రిలీజ్ చేసే ట్రెండ్ కూడా ఇప్పుడు కమర్షియల్ కోణంలో ఆరంభమైంది… అభిమానులు చూసి పండుగ చేసుకుంటూ ఉంటారు… ఇది వేరే కథ…
మహా అయితే ఒకట్రెండుసార్లు లేదంటే మూడునాలుగుసార్లు రీరిలీజ్ జరగడం పెద్ద విశేషమేమీ కాదు… కానీ ఒక సినిమా ఏకంగా 550 సార్లు రీరిలీజ్ అయ్యింది… దాని పేరు ఓం… కన్నడ స్టార్ ఉపేంద్ర దర్శకత్వం వహించిన హీరో శివరాజకుమార్ సినిమా… ఇందులో ప్రేమ కథానాయిక… అప్పుడెప్పుడో 1995 మే 19న తొలి రిలీజ్ జరిగింది… అంటే ఈరోజుకు సరిగ్గా 28 ఏళ్ల క్రితం అన్నమాట…
అత్యధికసార్లు రీరిలీజయిన సినిమాగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కింది ఈ సినిమా… ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇతర విశేషాలు… 1) ఉపేంద్ర తన కాలేజీ రోజుల్లో రాసుకున్న కథ ఇది… 2) తీరా సినిమా నిర్మాణం దగ్గరకొచ్చేసరికి కథ ‘శివ’ పోలికలతో ఉండేసరికి మార్పులు చేశారు… 3) అండర్ వరల్డ్‌లో పనిచేసిన నిజ.మైన నేరగాళ్లను బెయిల్‌పై తీసుకొచ్చి మరీ నటింపజేశారు… 4) పలువురు నిజమైన రౌడీ షీటర్లు కూడా నటించారు… 5) ది వీక్ మ్యాగజైన్ ఈ సినిమాలో శివరాజకుమార్ వంటి హీరో నటించకుండా ఉండాలని కవర్ పేజీ కథనాన్ని పబ్లిష్ చేసింది…
Ads
6) ఈ సినిమా నిర్మాణవ్యయం 70 లక్షలు… మాజీ సీఎం కుమారస్వామి దీనికి డిస్ట్రిబ్యూటర్… 7) సినిమా తొలి రిలీజ్ నుంచి 20 ఏళ్ల తరువాత డిజిటల్ రైట్స్ అమ్మితే ఉదయ్ టీవీ 10 కోట్లకు కొనుక్కుంది… సరే, ఇవన్నీ వోకే… కానీ కొన్ని లెక్కలు చూద్దాం…
28 ఏళ్లలో 550 రీరిలీజులు… అంటే ఏటా దాదాపు 20 సార్లు… అంటే నెలకు ఒకటిన్నర సార్లు… ఇప్పుడంటే పాతబడింది గానీ సినిమా రిలీజ్ మొదట్లో నెలకు అయిదారుసార్లు రీరిలీజ్ చేశారని అనుకోవాలా..? ఈమాత్రం దానికి పదే పదే రీరిలీజ్ దేనికి..? అలాగే ఒక థియేటర్‌లో నడిపిస్తే పోలా..? వారానికోసారి రీరిలీజ్ దేనికి..?
ఒక థియేటర్‌లో ఏకంగా 30 సార్లు రీరిలీజ్ చేశారట… అంటే ఈ 28 ఏళ్లలో ఏటా ఒకసారి రీరిలీజ్… ఎందుకో నమ్మబుల్‌గా లేదు… అసలు ఇన్ని రీరిలీజులను గొప్పగా చెప్పుకునే పనీ లేదు… కానీ దాన్ని కూడా ఓ ఘనతగా చెప్పుకోవడమే చిత్రంగా ఉంది… ఈ చిత్రానికి అయిదారు కర్నాటక స్టేట్ అవార్డులు వచ్చాయి… అదీ అసలైన విశేషం… భారీగా వసూళ్లు రాబట్టింది… అదీ విశేషం… అంతేతప్ప వందలసార్లు రీరిలీజ్ అనే మాటే కాస్త చిత్రంగా ధ్వనిస్తోంది…!! అదీ ఓ రొటీన్ కమర్షియల్ పీస్…!!!
Share this Article