తెలంగాణ అసెంబ్లీలో మొత్తం సీట్లు 119… ప్రస్తుతం 43 మంది రెడ్లు సభలోకి వెళ్తున్నారు… జస్ట్, 8 శాతం జనాభా ఉన్న రెడ్లు ఏకంగా 37 శాతం ప్రాతినిధ్యం వహించడం అంటే విశేషమే…
కాంగ్రెస్ కూటమి గెలిచిన 65 మందిలో 26 మంది రెడ్లు… అంటే దాదాపు 40 శాతం… అక్షరాలా నలభై శాతం… బీఆర్ఎస్ గెలిచిన 39 మందిలో 14 మంది రెడ్లు… అంటే 36 శాతం… అంతెందుకు..? బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మందిలో ముగ్గురు రెడ్లు… అంటే 38 శాతం… పార్టీలతో సంబంధం లేదు… తెలంగాణ రాజకీయాలపై రెడ్లది సంపూర్ణ ఆధిపత్యం…
వాట్సప్ గ్రూపుల్లో ఏకంగా ఈ మొత్తం 43 మంది పేర్లతో ఓ జాబితా సర్క్యులేట్ అవుతోంది… ఇలా…
Ads
Reddy Winners*
1.Revanth Reddy
2.Ponguleti Srinivas Reddy
3.Maheshwar Reddy
4.Pocharam Srinivas Reddy
5.P Susharshan Reddy
6.Naini Rajender Reddy
7.Vemula Prashanth Reddy
8.Anirudh Reddy
9.KasiReddy Narayan Reddy
10.Palla Rajeshwar Reddy
11.KomatiReddy Venkat Reddy
12.MalReddy Ranga Reddy
13.Sabitha Indra Reddy
14.Jeevan Reddy
15.Pilot Rohit Reddy
16.Megha Reddy
17.Karipally Venkat Reddy
18.Paidi Rakesh Reddy
19.Ch. Malla Reddy
20.Parnika Reddy
21.Dhonthi Madhav Reddy
22.Kumbam Anil Kumar Reddy
23.TammanaGari Ram Mohan Reddy
24.Yennam Srinivas Reddy
25.Rajesh Reddy
26.Marri RajaSekhar Reddy
27.Gudum Mahipal Reddy
28.Bansari Lakshma Reddy.
29.Kotta Prabhakar Reddy
30.KomatiReddy RajaGopal Reddy
31.Bathuka Lakshmi Reddy
32.Uttam Kumar Reddy
33.Sudhir Reddy
34.Jagadish Reddy
35.Alla Venkateswara Reddy
36.Bandla Krishna Mohan Reddy
37.RekhlaPally Bhupathi Reddy
38.Patilla Sanjeeva Reddy
39.Nalamada Padmavati Reddy
40.Revuri Prakash Reddy
41.Padi Kaushik Reddy
42. Sunitha Laxma Reddy
43. Yashaswini Reddy
ఇది చదువుతుంటే కొన్నేళ్ల క్రితం… కేసీయార్ ఉద్దేశపూర్వకంగా నలుగురు ‘మేధావులను’ వీ6 స్పెషల్ డిబేట్‌లో కూర్చోబెట్టి, అసలు రెడ్ల జనాభా ఎంత..? వాళ్ల ప్రాతినిధ్యం ఎంత..? అనే కోణం చర్చింపచేశాడు… మరి తన పార్టీ నుంచి ఎందరు వెలమలకు టికెట్లు ఇచ్చాడు..? వెలమల జనాభా ఎంత..? సభలోకి వెళ్లిన వెలమల శాతం ఎంత..? అది మాత్రం మాట్లాడరు… సేమ్, తెలుగుదేశం నుంచి కమ్మలకు అదే ప్రాధాన్యం… బయట చెప్పడానికి నీతులన్నీ కులరహితాలు… అందరివీ…
ఇదే రేవంత్‌రెడ్డి అప్పట్లో పదే పదే ఓ వ్యాఖ్య చేసేవాడు… వెల్‌కమ్ గ్రూపు అని… అంటే వెలమ ప్లస్ కమ్మ అని… ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీయార్ ముఖ్యమంత్రులు… రెండు చోట్ల రెడ్లకు అధికారం పోయిందని తన బాధ… ఇప్పుడేమిటి అంటారా..? ఏపీలో రెడ్డి… తెలంగాణలో రెడ్డి… సంపూర్ణ రెడ్డిస్వామ్యం…!! రెడ్డిక్రసీ..!!
సోషల్ మీడియాలోనే చక్కర్లు కొడుతున్న మరో ఇంట్రస్టింగు అంశం… ఇదీ ఆ టేబుల్… (వాస్తవ అంకెల్లో కొంత తేడా ఉండవచ్చుగాక…) జస్ట్ 1.81 శాతంతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది… అంటే కాంగ్రెస్ సునామీ, తుఫాన్ అనేవి కేవలం విశేషాలే… మెజారిటీ మ్యాజిక్ మార్కుకు కేవలం 4 సీట్లు ఎక్కువ… అంతే…
ఆసక్తికరం ఏమిటంటే… బీజేపీ వోట్లు ఏకంగా 13.91 శాతానికి పెరిగినా సరే తనకు దక్కినవి 8 సీట్లే… మజ్లిస్ కేవలం 1.13 శాతం వోట్లును సాధించింది, కానీ 7 సీట్లు… అదీ వోట్లు కేంద్రీకృతం కావడం వల్ల అడ్వాంటేజ్… సేమ్, బీఎస్పీ మజ్లిస్‌కు సమానంగా వోట్లు సాధించినా సరే ఒక్క సీటూ రాలేదు… నిజానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ బాగానే వోట్లు సంపాదించింది… కానీ వ్యూహాత్మక తప్పిదాలతో అది ఎక్కువ సీట్లు గెలిచే స్థితి రాలేదు… సరే, తెలంగాణ బీజేపీ తప్పుల గురించి మాట్లాడాలంటే బోలెడు..!!
Share this Article