అందరికీ తెలిసిందే కదా… రీల్స్, షార్ట్స్ పిచ్చిలో పడి బోలెడు మంది ఏవో తిక్క సాహసాలు చేస్తూ ప్రాణాలే కోల్పోతున్నారు… సోషల్ మీడియా మన జీవితాల్లోకి తీసుకొచ్చిన అనేకానేక దుష్ప్రభావాల్లో ఇదీ ఒకటి… మొత్తంగా సొసైటీని సోషల్ మీడియా పొల్యూట్ చేస్తుందనేది నిజం…
రీసెంటుగా ఒకడు… అలా రోడ్డు మీదకు వచ్చి ఎదురుగా వేగంగా వస్తున్న బస్సు కింద పడుకున్నాడు… బస్సు అలాగే వెళ్లిపోయింది… వీడు జస్ట్, అలా కాలరెగరేసి, దుమ్ము దులుపుకుని స్టయిల్‌గా తెలుగు సినిమా పిచ్చి ఎడ్డి హీరోలాగా వెళ్లిపోయాడు… అవును మరి, మన హీరోలదీ ఫేక్ హీరోయిజమే కదా… వీడూ అంతే…
ఆహా, ఓహో అని కొందరు ఆల్రెడీ వార్తలు రాసేశారు… ఈ యూట్యూబర్లు కూడా ఇలాంటోళ్లే కదా… కాదు, అంతకు ఎడ్డితనం… ఈ వార్తలు కాస్తా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి వచ్చాయి… సరే, ఎవరో తీసుకొచ్చారు… రీల్‌లో బస్సు, అదీ ఆర్టీసీ బస్సు, ఇంకేం..? తను స్పందిస్తాడు అని అనుకుంటున్నదే… స్పందించాడు…
Ads
‘ఎహె, ఇది ఫేక్, పక్కా ఎడిటెడ్ వీడియో… ఎవడైనా ఇలా ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చితే తాటతీస్తాను, ఊరుకోను… ఇదేం పైత్యంరా మీకు..?’ అన్నట్టుగా ఓ ట్వీట్ వదిలాడు… నిజానికి ఇందులో ఆర్టీసీ ప్రతిష్ఠను కావాలని దిగజార్చే కుట్రేమీ లేదు… వాడొక పర్వర్ట్… వాడికి ఏదో బస్సు కావాలి, అది ఆర్టీసీయా..? ప్రైవేటా..? వాడికి అక్కర్లేదు… ఆఫ్టరాల్ ఎడిటెడ్ రీల్ కదా… ఏదో ప్రయోగం చేశాడు… వాడికి కావల్సిన లైకులు వచ్చేశాయి… అదొక ఉన్నత్తానందం… సైకిక్ మెంటాలిటీ…
తెలుగు సినిమా హీరోల తలతిక్క ఫ్యాన్స్ వెర్రి వేషాలకూ దీనికీ తేడా లేదు పెద్దగా… వాళ్లు మారరు… సజ్జనార్ కేసులు పెడితే తేలదు… నిజంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు గనుక సీరియస్‌గా తీసుకుని, ఇలాంటోళ్లను సీరియస్‌గా బుక్ చేస్తేనయినా కనీసం సొసైటీలో ఈ డిజిటల్ పొల్యూషన్ తగ్గుతుంది… దీనికి ఆర్టీసీతో లింక్ పెట్టాల్సిన అవసరం లేదు… సజ్జనార్ నిజంగా మేలు చేయాలని భావిస్తే… లా అండ్ ఆర్డర్‌లో ఉన్న తన కొలీగ్ ఐపీఎస్ ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేసుకుని, ఒకరిద్దరిని శిక్షించేలా చేయాలి… ఎందుకంటే..? ఒకడిని చూసి మరొకడు… ఇదొక జాఢ్యం ప్రబలుతోంది కరోనా వైరస్‌గా… కాదు, దాన్ని మించి..!!
ఈ ట్వీట్లతో పనికాదు, ఎందుకంటే… రీల్స్, షార్ట్స్ అనేవి ఓ సామూహిక ఉన్మత్తత… ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను నిషేధించేంత ఔదార్యం, సమాజం మీద ప్రేమ ఎలాగూ కేంద్ర ప్రభుత్వానికి లేవు… ఇలాంటివి చైనా చేయగలదు… అంతేతప్ప అమెరికాకు, అమెరికా కంపెనీలకు లోబడి, భయపడే ప్రభుత్వాలతో సాధ్యం కావు… ఇలాంటప్పుడు సొసైటీ కన్సర్న్ ఉన్న ఆఫీసర్లు చేయగలిగేది… జస్ట్, ఇలాంటి రీల్స్ చేసే పిచ్చి ఎదవలను బుక్ చేసి, తోలు ఒలవడమే…! సజ్జనార్ సార్, పూనుకొండి, సొసైటీ అభినందిస్తుంది, చప్పట్లు కొడుతుంది… దిశ ఎన్‌కౌంటర్‌ను మించిన మంచి ఇది..!!
Share this Article