Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొన్ని జిల్లాల్లో జీరో సీట్స్..! ప్రాంతీయమా..? ఉపప్రాంతీయ పార్టీలా..?!

May 6, 2026 by M S R

.

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూస్తుంటే… ఒకటి విశేషంగా అనిపించింది… టీవీకే విజయ్ ప్రభంజనం అని అందరూ రాస్తున్నారు కదా… మరో ఎంజీఆర్, మరో ఎన్టీఆర్ అని ఆకాశానికి ఎత్తుతున్నారు కదా… గెలుపు వరకూ నిజమే… కానీ అవసరమైన మెజారిటీకి పదీపదకొండు స్థానాలలోపే ఆగిపోయాడు విజయ్… సరే, గెలుపు గెలుపే… ప్రధాన రెండు ద్రవిడ పార్టీల కూటములు చిత్తయ్యాయి కదా, స్థూలంగా విజయ్‌దే అసలు గెలుపు… అయితే..?

మెజారిటీ సాధనకు ఎవరు కలిసొస్తారనేది పక్కన పెడితే… కన్యాకుమారి, మైలాడుదురై, తిరువారూర్, నాగై, నీలగిరి, తెన్కాశి, అరియలూర్‌ జిల్లాల్లో టీవీకేకు ఒక్కటంటే ఒక్క సీటూ రాలేదు… జీరోె… అధిక సంఖ్యలో మత్స్యకారులు ఉన్న నాగై, మైలాడుదురై జిల్లాల్లో ఎన్నికలకు ముందు విజయ్‌కి మద్దతు ఉందని ప్రచారం జరిగినా ఓట్లుగా మారలేదు….

Ads

అంతేకాదు… అటు DMK 7, AIADMK 9 జిల్లాల్లో ఖాతా తెరవలేదు… ప్రాంతీయ పార్టీలా..? ఉప ప్రాంతీయ పార్టీలా..? అంత బలంగా కనిపించిన కూటములు, ఇన్నేళ్లు అధికారం చెలాయించిన కూటములు రాష్ట్రం మొత్తమ్మీద ప్రాతినిధ్యం సాధించలేకపోవడం విచిత్రమే…

మన దగ్గర కూటములు అంటే..? ఉదాహరణకు టీడీపీ, బీజేపీ, జనసేన… అంతే… వైసీపీ సింగిల్… బీఆర్ఎస్ సింగిల్… తెలంగాణలో కాంగ్రెస్‌ ప్లస్ సీపీఐ… కానీ తమిళనాట, కేరళంలో కూటములు ఇంత స్ట్రెయిట్‌గా ఉండవు… ఉదాహరణకు… తమిళనాడులో డీఎంకే (DMK) నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (Secular Progressive Alliance) లో ప్రధానమైన పార్టీలే 12… సీట్లు కూడా కేటాయింపుల్లేని అనామక పార్టీలు కూడా కలిస్తే దాదాపు 23 వరకూ ఉంటాయి…

అన్ని పార్టీలు కలిసినా సరే, ఎక్కడా ఒక్క వోటు కూడా కోల్పోకూడదనే అత్యంత జాగ్రత్తగా సంఘటన నిర్మించినా సరే, చివరకు విజయ్ గాలిలో నిలబడలేక అధికారం కోల్పోయింది… అన్నాడీఎంకే కూటమి కూడా తక్కువేమీ కాదు… 15 పార్టీలు… కేరళంలో కూడా అంతే… యూడీఎఫ్ కూటమి పార్టీల సంఖ్య 11 … ఇందులో టీఎంసీ కూడా ఉంది…

మరోవైపు ఎల్డీఎఫ్ అంటే కేవలం లెఫ్ట్ పార్టీలు మాత్రమే కాదు… లెఫ్టేతర ఆర్జేడీ వంటి పార్టీలు సహా మొత్తం 10 పార్టీలు… దేశంలోని వేరే రాష్ట్రాల్లో మరీ ఇంత సంక్లిష్టంగా, ఇన్ని పార్టీలతో కూటములు ఉండవు సాధారణంగా… తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనే ఇలా… మరీ ఒక్క జిల్లా, రెండు జిల్లాలకే పరిమితమైన పార్టీలు కూడా ఏదో ఓ కూటమిలో కలిసిపోతాయి… కలిసివచ్చే ఒక్క వోటు కూడా చీలిపోవద్దని ప్రధాన పార్టీలు కూడా ఒకటోరెండో సీట్లు ఇచ్చి, గౌరవిస్తాయి… ఈ కోణంలో చూస్తే టీవీకే విజయ్ ఒంటరిగా అన్ని సీట్లు గెలవడం ఖచ్చితంగా ప్రశంసనీయమే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అఖిల్ నటనలో కాస్త మెరుగుదల- ఓ సాదాసీదా తెలుగు సినిమా లెనిన్!!
  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions