Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన దేశంలోని ప్రాంతీయ పార్టీలు దాదాపుగా కుటుంబ సంస్థలే…

May 28, 2025 by M S R

.

Mani Bhushan ……. ప్రాంతీయ పార్టీలు అన్నాక చీలికలు పేలికలు కావడం సహజ పరిణామం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి అరుణాచల్ వరకు ఏ రాష్ట్రంలో నైనా ఇదే తంతు.

1914 నాటి జస్టిస్ పార్టీ, ‘20 నాటి శిరోమణి అకాలీ దళ్ మొదలుకుని, ఇటీవలి వరకు చరిత్రలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి అఖండత, యథాపూర్వస్థితి అనేది లేదు. TDP రెండున్నరేళ్లకే చీలింది. YSRCP ఎనిమిదేళ్లకు బీటలు పడింది.

Ads

ఇప్పుడు TRS వంతు వచ్చింది. అంతే, తతిమాదంతా సేమ్ టు సేమ్. హెడ్ క్వార్టర్సులోనే తప్ప క్షేత్ర స్థాయిలో సంస్థాగత నిర్మాణం లేని పార్టీలు మరింత వేగంగా చీలిపోతాయి. అధికారం ఉన్నంత కాలం ఉక్కు ముక్కలా కనిపించేవి… అధికారం పోగానే సీనారేకు డబ్బా (tin box)లా ఎక్కడికక్కడ ముక్కలవుతాయి.

కారణం చాలా సింపుల్… వాటి నిర్మాణంలోనే లోహ పరమైన riveting ఉండదు. కార్డ్ బోర్డ్, ప్లాస్టిక్, రబ్బరు, ఇనుము లాంటి భిన్నమైన ఎలిమెంట్లను fevi quickతో అతకబెట్టినట్లుగా show run చేయడం జరుగుతుంది.
ఒక సదాశయం, సంకల్పంతో… భావ సామీప్యం గల బుద్ధిజీవుల భాగస్వామ్యంతో ఒక Partnership Ventureలా ప్రాంతీయ పార్టీలు రూపు దాలుస్తాయి.

Leader బలపడుతున్నకొద్దీ, అనుకున్న లక్ష్యం నెరవేరుతున్న కొద్దీ Proprietary Concernగా మారతాయి. Parallelగా కుటుంబీకులు ప్రవేశిస్తారు. వారి చుట్టూ గుంపులు చేరేసరికి… చివరకు Family Enterpriseగా మిగులుతాయి.

NTR సంతానంలో ఎవరికీ ardent political ambitions లేవు కాబట్టి, బావ చేతికే పార్టీని అప్పగించేశారు. హరికృష్ణ కొంత తాటాకు చప్పుడు చేసి చప్పబడ్డారు.

ఇతర రాష్ట్రాలైన తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం (DMK), మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD), బీహారులో లోక్ జనశక్తి పార్టీ (LJP), సమతా పార్టీ, ఉత్తర ప్రదేశంలో సమాజవాది పార్టీ, జమ్మూ కాశ్మీరులో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) వంటివి Family enterprisesగానే కొనసాగుతున్నాయి.

ప్రస్తుతానికి అఖండంగా కనిపిస్తున్న లాలు ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (RJD), మమతా బెనర్జీ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC), బిజు పట్నాయక్ పార్టీ బిజు జనతా దళ్ (BJD)లు రేపటి రోజున ఏమవుతాయో చెప్పలేం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మనసున్న వార్త… ఓ ముసలాయనకు ప్రాణం పోసిన ఓ మనస్విని సేవ…
  • ఎఐసీసీ మంత్రి పదవిని ప్రామిస్ చేస్తే… రేవంత్ రెడ్డిని ఎందుకు అడగడం..!?
  • తెరపైకి మళ్లీ ‘దాసరి చిరంజీవి’… పెద్దన్న పాత్రలోకి రంగప్రవేశం..!!
  • సీఎం సాబ్… తమరు జర్నలిస్టుగా ఉన్న కాలం కాదు… జమానా బదల్ గయా..!!
  • ట్రావెల్ థెరపీ… సరదాగా చెప్పుకున్నా నిజముంది, ఫలముంది…
  • మోడీ దర్శించిన ఆ హిస్టారిక్ టెంపుల్ కథాకమామిషు ఏమిటంటే..!!
  • జయహో టెస్టు మ్యాచ్ సీరీస్… వన్డేలు, టీ20లకు దీటుగా ప్రేక్షకాదరణ…
  • Ramayana… a story for English readers and civil trainees..!!
  • ఢిల్లీలో ఫైట్‌కు రేవంత్ రెడీ..! కుదరదంటున్న బండి సంజయ్..!!
  • ఫేక్ జర్నలిస్టులపై మరి ప్రభుత్వ తక్షణ బాధ్యత ఏమీ లేదా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions