Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రావణ తాండవం! రెహమాన్ అందిస్తున్న ఓ సర్‌‘ప్రైజ్ సాంగ్ !!

October 22, 2026 by M S R

.

ఆహా… రామాయణ సినిమా దర్శకుడు మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు… ప్రేక్షకులకు మంచి సర్‌‘ప్రైజ్… ఓ పాట బిట్ రిలీజ్ చేశాడు… అది రావణ తాండవం… శివుడి భారీ విగ్రహం ఎదుట, చుట్టూ మంటల నడుమ రావణుడు తాండవం చేసే సీన్… ఆ పాట… విశేషం ఏమిటీ అంటారా..?

ఆయా భాషల్లో ప్రసిద్ధులైన సంగీత దర్శకులతో స్వయంగా పాడించడం… అవును, నిజమే… తెలుగులో దేవిశ్రీ ప్రసాద్, తమిళంలో అనిరుధ్- జీవీ ప్రకాష్, హిందీలో విశాల్ దడ్లానీ పాడారు… కన్నడ వెర్షన్ రవి బస్రూర్, మలయాళ వెర్షన్ యదు కృష్ణన్ కె…

Ads

స్వయంగా సంగీత దర్శకులైన ఈ ప్రముఖులతో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఓ పాట పాడించడమే ఆ సర్‌ప్రైజ్… వాళ్లంతా స్వయంగా గాయకులు కూడా… నచ్చింది… బాగా మనసు పెట్టి వర్క్ చేస్తున్నట్టున్నాడు రెహమాన్ ఈ సినిమాకు…

రామాయణ ప్రాజెక్టులో భాగమైనందుకు ఆ సంగీత దర్శకులు కమ్ గాయకులు కూడా ఏమాత్రం భేషజం ప్రదర్శించలేదు సరికదా, ఆనందంగా ఉన్నట్టు ట్వీట్లు కొడుతున్నారు… అదీ అభినందనీయమే… ఇక్కడ రెమ్యునరేషన్ పెద్ద సబ్జెక్టు కాదు, అలా పాడటానికి, పార్టిసిపేట్ కావడానికి అంగీకరించడమే ఓ విశేషం…

మొదటి నుంచీ అనుకుంటున్నదే కదా… రావణుడిని ఓ ప్రతినాయకుడిగాకన్నా రాముడికి దీటైన ప్రత్యర్థిగా చూపిస్తారనీ, యశ్ ఇమేజ్‌కు తగినట్టు క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని మూల కథలోనే ఆ మార్పులు చేసుకున్నారనీ..! ఈ రావణ తాండవం పాట కూడా దానికి తగినట్టుగానే కనిపిస్తోంది…

ravana tandavam

ముఖ్యంగా యశ్ ఆహార్యం, అభినయం, శివ తాండవాన్ని ఆవిష్కరించిన తీరు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ… యశ్ ముఖంలో కనిపించే తీవ్రత, హావభావాలు, తెరపై ఆయన చూపించిన ప్రభావం పాటకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి…

రెండు భాగాలుగా తెర‌కెక్కిన ‘రామాయణం’ మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండ‌గా రెండో పార్ట్ వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి విడుద‌ల కానుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రావణ తాండవం! రెహమాన్ అందిస్తున్న ఓ సర్‌‘ప్రైజ్ సాంగ్ !!
  • నమ్మకాన్ని బ్రేక్ చేసిన వైసీపీ… ఇది ఎవరికి చెంపపెట్టు ?
  • ప్చ్, వ్యవస్థలో ఎవరూ శుద్దపూసలు కారు- ఈయన అతీతుడేమీ కాదు !!
  • ఇన్నేళ్లకు దొరికింది సరైన పాత్ర..! భేష్, రెచ్చిపోయింది ఈ వరంగల్ పోరి !!
  • నిరాశ ! గాయపడిన ప్రతి బాధితుడి ప్రతి చర్యా న్యాయమైపోదు!!
  • ఒక బొద్దింక నిజాలు మాట్లాడుతోంది… మరో రెండు నోరువిప్పాల్సి ఉంది…
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • స్పర్శతో రూపం దిద్దుకున్న దైవం : అంధ శిల్పి రాంపాల్ వేళ్లే కళ్లు !
  • దక్షిణ వెండి తెరపై చాప్లిన్ ఈ గుండూరావ్ అలియాస్ నగేష్ !
  • లెనిన్ పాండియన్ ! తమిళ వెండి తెరపైకి మళ్లీ వచ్చిన నగరి రోజా !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions