Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనుకుంటాం గానీ… రెహమాన్ సంప్రదాయ రాగాల్లోనూ దిట్ట !!

October 6, 2026 by M S R

.

Bharadwaja Rangavajhala ….. మడిసన్నాక … కూసింత సంగీతం తెలిసుండాల… అంచేత …
ఏటంటే …
ఇవాళ కాసేపు సంగీతపు విషయాలు మాట్లాడుకుందాం.
ఎ.ఆర్. రెహ్మాన్
వెస్ట్రన్ ఇన్ఫులెన్స్ అనేస్తారు గానీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతంలో భారతీయ రాగాలు తొంగి చూస్తూనే ఉంటాయి.

ఆ మధ్య రెహమాన్ చేసిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘ఏమాయచేశావే’లో ‘భాగేశ్వరి’ వినిపిస్తుంది.
ఏ మాయ చేశావే సినిమా క్లైమాక్స్ కు ముందు కాస్త ఉత్సాహంగా వినిపించే మళయాళ గీతం భాగేశ్వరిలో చేశారు.
ఆ పాట హీరో మానసిక స్థితికి అద్దం పడుతుంది.

Ads

ఇదే ఏమ్మాయ చేసావే మూవీలోనే ‘బిళహరి’ ఆధారంగా చేసిన కంపోజిషన్ ఒకటి వినిపిస్తుంది. కర్ణాటక రాగాలను ఆధారం చేసుకుని స్వరాలు కూర్చినా…
వెస్ట్రన్ ఇస్ట్రుమెంట్స్ ఇన్ఫులెన్స్ కనిపించేలా ఆర్కెస్ట్రా నడిపించడం ఎ.ఆర్. రెహమాన్ ప్రతిభ.
కుందనపు బొమ్మా అంటూ వినిపించే పాట బిళహరి ఛాయల్లో నడిచినట్టు అనిపిస్తుంది.

ప్రేమ అనే పదం సంస్కృత జన్యం.
కాదలం అనేది ద్రవిడ వ్యవహారికం.
పోతన కూడా కాదలి కోడలా అనే ప్రయోగం చేశారు భాగవతంలో అంటారు వేటూరి.
సరిగ్గా ఈ నేపథ్యంలోనే వేటూరి కాదలి వేణుగానం కానడ పలికె అంటూ రాశారు.
‘అలై పొంగేరా ‘కన్నా పాటను కానడలోనే స్వరపరిచారు సంగీత దర్శకుడు రెహమాన్.

శాస్త్రీయ రాగాధారిత గీతాలు కంపోజ్ చేయడంలో సిద్దహస్తుడు రెహమాన్.
మధ్యమావతిలోనూ మంచి పాటలు అందించారు.
వాటిలో ప్రియురాలు పిలిచెలో వచ్చే ఐశ్యర్య గీతిక పలికే గోరింకా కాస్త ప్రత్యేకం.
నిర్మాత ఎ.ఎమ్.రత్నం శివగణేష్ కలసి తెలుగు చేసిన ఈ గీతాన్ని సాధనా సర్గమ్ చాలా బాగా గానించారు.

ఇళయరాజాతో సంగీతం చేయించుకునే భారతీరాజా కూడా ఓ దశలో రెహ్మాన్ వైపు టర్న్ అయ్యారు.
ఆయన తీసిన ఓ తమిళ సినిమాలో రెహమాన్ శుద్ధ సావేరిలో ఓ టిపికల్ యుగళగీతాన్ని కంపోజ్ చేశాడు.
ఉన్నికృష్ణన్ , చిన్మయి పాడిన ఈ పాట చాలా ఎనర్జీ తో నింపేశాడు రెహమాన్.
Ennuyir Thozhiye – Kankalal Kaidhu Sei
అని యుట్యూబులో కొడితే ఆ పాట వచ్చేస్తుంది.

ఎమ్మెస్వీ, ఇళయరాజాలకు భిన్నంగా తిలంగ్ రాగంలో హుషారైన గీతాన్ని కంపోజ్ చేశాడు రెహ్మాన్.
రొటీన్ కు భిన్నంగా అనిపించాలనే తపనే కాదు… సన్నివేశాన్ని రక్తి కట్టించేలా సంగీతం అందించాలనే తపన కూడా రెహ్మాన్ లో ఎక్కువే.
మణిరత్నం తీసిన దొంగ దొంగ సినిమాలో వినిపించే తీ తీ తీయని అంటూ హీరా పాడే పాట తిలంగ్ లో స్వరం చేసినదే.

మెలోడీ అనేకాదు విషాదం సైతం అద్భుతంగా పలుకుతుంది శంకరాభరణ రాగంలో.
ధీర శంకరాభరణంలో రెహ్మాన్ కంపోజ్ చేసిన పాటల్లో హృదయాలను తాకే గీతం బొంబాయి ఉరికే చిలుకా.
రెహ్మాన్ సంగీతంతో పోటీ పడి ఆ గీతాన్ని చిత్రీకరించారు మణిరత్నం.

శాస్త్రీయ రాగాలను సినిమా పాటలకు వినియోగించడంలో రెహ్మాన్ ది ప్రత్యేక ముద్ర.
మాండు రాగానికి నీలాంబరి, తోడి, మోహన రాగాలను దన్నుగా నిలబెట్టి చేసిన రాగమాలిక ఇద్దరు చిత్రంలో వినిపిస్తుంది.
వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ఈ పాటలో మదనమోహినీ చూపులోన మాండు రాగమేలా అంటాడు.
అలాగే మరో చోట క్షణానికో తోడి రాగం అంటాడు.
సంగీతపు గుట్టుమట్టులు తెలిసిన కవి కదా వేటూరి.

నటభైరవి హిందూస్తానీ సంగీతంలో అసావేరీ ఠాట్ లో ఉన్నట్టుంటుంది.
ముత్తుస్వామి దీక్షితార్ పద్దతిలో చూస్తే రీతి గౌళ అంటారు.
భక్తి మాత్రమే కాదు… గొప్పగా అనిపించే అనుభూతులను వ్యక్తీకరించడానికి అద్భుతంగా పనికొచ్చే రాగం నటభైరవి.
మణిరత్నం తీసిన సఖి సినిమా కోసం రెహ్మాన్ కంపోజ్ చేసిన స్నేహితుడా పాట నటభైరవి పద్దతిలోనే అనిపిస్తుంది.

ఎస్. రాజేశ్వరరావు, ఎమ్మెస్వీ , మహదేవన్, ఇళయరాజా తర్వాత దక్షిణాది సినిమా సంగీతానికి చుక్కానిగా నిలబడ్డ సంగీత శిఖరం ఎ.ఆర్.రెహ్మాన్.
బిగ్ సినిమాల డైరక్టర్ శంకర్ తొలి చిత్రం జంటిల్ మేన్ లో రెహ్మాన్ ధర్మవతి రాగంలో స్వరం కట్టిన ఓ టిపికల్ యుగళగీతం వినిపిస్తుంది.
రాజశ్రీ రచనలో సాగే ఈ పాటకు ఓ విశేషం ఉంది. సాధారణంగా భారతీయులు పాశ్చాత్య సంగీతాన్నించి ప్రేరణ పొందుతారంటారు కదా.
కానీ ఈ పాటను ప్రేరణగా తీసుకుని ఓ వెస్ట్రన్ ఆల్బమ్ వచ్చింది.
ఆ పాటే కొంటెవాణ్ణి కట్టుకో …

లవ్ బర్ట్స్ అంటూ తెలుగులోకి వచ్చిన డబ్బింగ్ సినిమాలో మనసున మనసున అంటూ వినిపించే రాజశ్రీ సాహిత్యాన్ని శుద్ద సారంగ ఛాయల్లో నడిపిస్తాడు.
చారుకేశి రాగంలో పాటలు చేసిన సంగీత దర్శకుల్లో ఎ.ఆర్.రెహ్మాన్ కూడా ఉన్నారు.
నిర్మాత ఎ.ఎమ్.రత్నం కొడుకు జ్యోతి కృష్ణ డైరక్ట్ చేసిన నీ మనసు నాకు తెలుసు మూవీలో ఓ ఆహ్లాద గీతం చారుకేశిలోనే సాగుతుంది.
ఏదో ఏదో … అంటూ సాగుతుంది.
కార్తిక్, గోపికాపూర్ణిమ పాడారనుకుంటా ఆ పాట.

ఇలా… ఇది ఓ టీవీ ఛానల్ కోసం రాసా… రెండు మాట్లు, మూడు పాట్లు గా నడుస్తుంది కదా…
అంటే యాంకర్ గారు రెండు మాటలు చెప్పి ఓ పాటేస్తారు కదా అదన్నమాట…
కొంచెం వెరైటీ గా ఉంటుంది అని ఇలా రాగాలుచ్చుకుని నడిపాం తప్ప నాకేం తెలుసు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అబ్బురపరిచే సినిమాటిక్ ‘ఎదుగుదల’..! ఎవరీ ‘పవర్‌ఫుల్ కేరక్టర్..?
  • అనుకుంటాం గానీ… రెహమాన్ సంప్రదాయ రాగాల్లోనూ దిట్ట !!
  • చో – ఎవడినీ లెక్కచేయలేదు- నమ్మిన ఏ మాటనూ దాచుకోలేదు…!!
  • SIR ప్రకంపనలు- న్యాయవ్యవస్థలోనూ చర్చ – భిన్నాభిప్రాయాలు !!
  • స్టీవ్ జాబ్స్ చివరి మాటలు “ఓహ్- వావ్!… ఏం చూశాడు తను..?!
  • పెళ్లి లేదు… పిల్లలు లేరు… అంతిమంగా మేనల్లుళ్లే వారసులు?
  • ఉన్నవాడి ఔదార్యమూ గొప్పదే- లేనివాడి ఔదార్యం మరీ మరీ గొప్పది !!
  • ఎంతకు తెగించావురా..? ఆ ‘యావ’తో జీవిత ఖైదీనే వదిలేశావు!!
  • తప్పే- కానీ ఆ తప్పు తీవ్రత ఎంత..? తప్పుచేశానా? ఓ రిపోర్టర్ స్వగతం!!
  • ‘డోరతి’ మూవీ… ఇది ‘మరో చరిత్ర’… మరో అంటరాని చరిత్ర…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions