ఏఆర్ రెహమాన్… దేశంలో… కాదు, ప్రపంచంలోని అత్యుత్తమ మ్యూజిక్ కంపోజర్లలో ఒకరు… బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీల్లో రెండు ఆస్కార్లు కొట్టడమే తనకు సర్టిఫికెట్టు… అది అల్టిమేట్ అనలేం కానీ మనకూ తెలుసు కదా తను కంపోజింగులో ఎంత మెరిటోరియసో… మొదట్లో తను డాక్యుమెంటరీలకు, యాడ్స్‌కు జింగిల్స్ కొట్టేవాడు… అలా నైన్టీస్‌లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్ ఉన్న ఒక యాడ్‌కు మ్యూజిక్ కంపోజ్ చేశాడు…
ఎహె, ఇదేం స్కోర్..? అస్సలు బాగాలేదు, మరొకటి చేయి అంటూ క్లయింట్లు దాన్ని రిజెక్ట్ చేశారు… రెహమాన్ మౌనంగా మరో స్కోర్ ప్రిపేర్ చేసి వినిపించాడు… వాళ్లు ఆహా అన్నారు… అక్కడ ఆ సీన్ కట్ చేస్తే… వాళ్లు రిజెక్ట్ చేసిన అదే మ్యూజిక్ బిట్స్‌ను రెహమాన్ మణిరత్నం సినిమా రోజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో వాడుకున్నాడు… తెలుసు కదా, తనకు ఫస్ట్ జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది ఆ సినిమా… ఒకరు రిజెక్ట్ చేసిన బిట్ దేశమంతా అలరించింది… కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టి లబ్దప్రతిష్టుడిని చేసింది…
రెహమాన్ కెరీర్ మొదట్లో డైరెక్టర్ రాజీవ్ మీనన్ తనతో కలిసి వర్క్ చేసేవాడు… ఈ రిజెక్టడ్ బిట్స్‌ను రోజాకు వాడిన ఉదంతాన్ని తను గుర్తుచేశాడు… ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ అప్పట్లో రెహమాన్ తోపాటు నేను కూడా బాగా అప్‌సెట్ అయిపోయానన్నాడు… అది గ్వాలియర్ షూటింగ్స్‌కు ఉద్దేశించిన యాడ్… అది సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ డెబ్యూ… కానీ రెహమాన్ మ్యూజిక్ బిట్‌ను చివరి నిమిషంలో కేన్సిల్ చేశారు…
Ads
ఓ డైరెక్టర్‌కు నచ్చడం, అది ప్రేక్షకులకు చేరడం అనేది సినిమాల్లో సాధారణం… కానీ యాడ్స్‌కు సంబంధించి రకరకాల లేయర్స్‌లో పరిశీలన ఉంటుంది… మన ప్రయాస సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు… ఎవరు ఏ దశలో రిజెక్ట్ చేస్తారో చెప్పలేం…’’ ఇలా చెబుతూ పోయాడు… డెస్టినీ… మనం ఓహో అనుకున్నది మరొకరికి ఏమాత్రం నచ్చకపోవచ్చు… ఆఫ్టరాల్ సంగీతం కూడా జీవితంలాంటిదే కదా…!!
Share this Article