మామూలుగా మన చుట్టూ మహిళలకు 70 ఏళ్లు వచ్చాయంటే… బామ్మలు, మామ్మలు… కాళ్ల నొప్పులు… ఆయాసం, అనారోగ్యం, మొహంపై ముడతలు… వయస్సయిపోయి ఇహలోకం నుంచి ఇక ఎప్పుడు విముక్తి అన్నట్టుగా మాటలు, చూపులు, అడుగులు… నిస్తేజం అలుముకుని, నిర్వేదంగా సాగే నిర్లిప్త జీవనాలు కనిపిస్తుంటాయి కదా…
కానీ ఆమె… 69 ఏళ్ల వయస్సు… అమృతం తాగిందో ఏమో… వయస్సు ఎక్కడో ఆగిపోయింది… ఈ వయస్సులోనూ అనార్కలి డ్రెస్ వేసుకుని, అబూదాబిలో జరిగిన సినిమా అవార్డుల ఐఫా వేదిక మీద 20 నిమిషాలపాటు తోటి డాన్సర్లకు దీటుగా నాట్యం చేసింది… పలు హిందీ పాటలకు అభినయించింది… ఏదో 30, 40 బాపతు వయస్సులో ఉన్నట్టుగా, చురుకుగా, ఉత్సాహంగా… సొగసుగా…
ఐఫా తన అధికారిక ఇన్‌స్టా పేజీలో సింపుల్‌గా ఓ వ్యాఖ్య చేసింది… ‘ఆమె ఐకానిక్… ఒక మెరుపు… ఆమె ప్రదర్శనతో ఈ రాత్రి వెలిగిపోయింది…’’ రేఖ 1965 చిత్రం గైడ్ నుండి లతా మంగేష్కర్ పాడిన పియా తోసే నైనా లగే రే, 1960 చిత్రం మొఘల్-ఏ-ఆజం నుండి మోహే పంఘట్ పే, 1964 చిత్రం వో కౌన్ థీ నుండి లాగ్ జా గలే, 1979 చిత్రం మిస్టర్ నట్వర్‌లాల్ నుండి పర్దేశియా యే సచ్ హై పియాతో పాటలకూ నర్తించింది…
Ads
నెట్‌లో ఆమె నాట్యం తాలూకు వీడియోలు షేర్ చేస్తూ రేఖ అభిమానులు, సినిమా ప్రియులు ఆశ్చర్యంగా, ఆనందంగా అభినందనలతో పోస్టులు పెడుతున్నారు…
ఆ వయస్సులో ఆ ఉత్సాహాన్ని, ఆ శక్తిని ప్రదర్శించడం విశేషం… వాటిని మించి ఇలాంటి ప్రదర్శనల్లో మళ్లీ మళ్లీ కనిపించాలనే ఆసక్తిని సజీవంగా ఉంచుకుని, సాధన చేస్తోంది… దేహంతోపాటు మానసిక ఆరోగ్యం… అదే లుక్కు, అదే ఫిజిక్ మెయింటెయిన్ చేయడం అల్లాటప్పా వ్యవహారం కాదు… నిజానికి హేమమాలిని కూడా 75 ఏళ్ల వయస్సులో ఈరోజుకూ అదే లుక్కు, అదే రూపు…
ఇద్దరిదీ దక్షిణ భారతమే… వాళ్లు చెబుతున్నట్టు వాళ్ల ఆరోగ్య రహస్యాల్లో యోగా కూడా ఒకటి కావచ్చుగాక… అత్యధిక ఖర్చుతో నాణ్యమైన జీవన ప్రమాణాలు కూడా ఓ కారణం కావచ్చుగాక… వైద్యులు, న్యూట్రిషనిస్టులు, సౌందర్యశాలలు గట్రా మరో కారణం కావచ్చుగాక… కానీ ఇవన్నీ ఉన్నా ఎందరు ఇలా కనిపిస్తున్నారు..? సో, ఏదో అరుదైన జెనిటిక్ కేరక్టర్‌ను ఆ దేవుళ్లను అడిగి తెచ్చుకున్నట్టుంది పుట్టుక సమయంలోనే… ఎవరో హిందీ సినిమా రచయిత చెప్పినట్టు… రేఖ అంటే ఓ విభ్రమ..!
ఈ సంవత్సరం మొదట్లోనే రేఖ బయోబుక్ స్వయంసిద్ధ గురించి ఒక సమీక్షను ‘ముచ్చట’ ప్రచురించింది… గుర్తుందా..? ఇదుగో లింక్… ఆసక్తిగా మరోసారి చదవాలని అనుకునేవారి కోసం…
రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
Share this Article