రేఖ..! అరవై ఏడేళ్ల ఈ నవయవ్వనవతి గురించి ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా రాయాలనుకున్నా సాహసమే… ఇప్పటితరానికి పెద్దగా తెలియకపోవచ్చుగాక ఆమె కథ… తన వయస్సును పాతికేళ్లప్పుడే స్తంభింపచేసుకున్నది… అంతే… ఈ తమిళ బిడ్డ భారతీయ చిత్రజగతి కలల సుందరి… ఆమె కథలోకి పోవడం లేదు మనం ఇప్పుడు… కానీ… ఈమధ్య Sony వాళ్ల మ్యూజిక్ కాంపిటీషన్ ప్రోగ్రాం Indian Idol షోకు గెస్టుగా వచ్చింది… అఫ్ కోర్స్, ప్రతి వారం ఎవరో గెస్టును పిలవడం పరిపాటే… వచ్చే గెస్టులు కూడా సంగీత ప్రపంచంలో కాసేపు మునిగిపోతున్న తీరు కూడా చూస్తున్నదే… ఈసారి చాలా టఫ్ కాంపిటీషన్… ఏక్‌సేఏక్ సింగర్స్ పోటీదారులు… అదరగొడుతున్నారు… సోనీ టీవీవాడు కూడా ఈసారి అద్భుతంగా రక్తికట్టిస్తున్నాడు… ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… మన తెలుగు చానెళ్లు సోనీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండిపోయాయి… ఉదాహరణకు…
బాలసుబ్రహ్మణ్యం మరణించాక ఈటీవీ స్వరాభిషేకం పని అయిపోయింది… ఎవరూ బాధపడకండి, పెళ్లిళ్లలో ఆర్కెస్ట్రా టీమ్స్ కాస్త నయం… మొన్నటిదాకా జీటీవీలో వచ్చిన సరిగమప మరీ నాసిరకం… కనీసం ఫినాలేను కూడా రక్తికట్టించలేని దరిద్రం… నాలుగైదు గంటల గ్రాండ్ ఫినాలేకు మూడున్నర నాలుగు రేటింగ్స్ కూడా రాలేదంటే అదెంత అట్టర్ ఫ్లాప్ షోయో అర్థమవుతోంది కదా… ఇక మాటీవీ వాడికి ఇంకా సంగీతం మీద కన్నుపడనట్టుంది… అదీ ఓంకార్‌కు అప్పగిస్తే సరి, డాన్స్ ప్లస్లాగా ఓ భారీ షోను స్టార్ట్ చేస్తాడు… అయితే మనవాళ్లకు సరైన టేస్ట్ లేకపోవడం మాత్రమే కాదు, సరైన ప్లానింగ్ లేకపోవడం కూడా ఫెయిల్యూర్లకు ఓ కారణమే… మన చానెళ్లు ఇండియన్ ఐడల్ ఓసారి సీరియస్‌గా లుక్కేయాలి… జడ్జిలు ఎలా ఉండాలో, యాంకర్ ఎలా వ్యవహరించాలో ముందుగా తెలుస్తుంది… గెస్టును పిలిస్తే ఆ వాతావరణం ఎలా మారిపోతుందో చెప్పడానికి రేఖ ఎంట్రీ ఓ మంచి ఉదాహరణ… ఈరోజే అనుకుంటా సోనీలో రేఖ పాల్గొన్న ప్రోగ్రాం… దానికి mallika-e-ishq rekha అని అందమైన పేరు కూడా పెట్టారు…
Ads
ఎస్, సోనీ వాడైనా సరే, సంగీతాన్ని ఉద్దరించడానికేమీ ఈ షో నిర్వహించడం లేదు… వాడికి రేటింగ్స్ కావాలి, యాడ్స్ రావాలి, డబ్బు కుమ్మాలి… కానీ అదేసమయంలో క్వాలిటేటివ్ షోను ప్రేక్షకులకు అందించాలి… అక్కడ రాజీపడటం లేదు ఆ టీవీ… నిజమే, ఒక గెస్టును తీసుకురావడం అంటే ఆ గెస్టుకు తగిన వాతావరణం క్రియేట్ చేస్తారు, ప్లాన్ చేస్తారు… రేఖ కోసం ఆమె నటించిన సినిమా పాటల్ని కంటెస్టెంట్లందరూ పాడేలా ప్లాన్ చేశారు… దీనికి వాల్యూ యాడిషన్ ఏమిటంటే… రేఖ స్పాంటేనిటీ… ఆ వాతావరణాన్నే మార్చేసింది… షణ్ముఖప్రియతో కలిసి డాన్సు చేసింది… సరదాగా పంచులు వేసింది… జడ్జి విశాల్ గుండు మీద తబలా వాయించింది… మరో జడ్జి నేహకు ఓ మంచి చీర కానుక ఇచ్చి అక్కడే తనే కట్టి మురిసిపోయింది… ఓ సింగర్ పాడిన పాటకు ఆనందబాష్పాలు రాల్చింది (కృత్రిమం ఏమీ అనిపించలేదు)… ఇంటి నుంచి తెచ్చిన చపాతీ, పన్నీర్ కూరను స్వయంగా తినిపించింది సింగర్లకు…
ఏ ముకద్దర్ కా సికందర్ పాడిన సింగర్‌కు కరెన్సీ నోట్లతో దిష్టి తీసి చేతిలో పెట్టింది… హారతి పట్టింది, అందరినీ కూర్చోబెట్టుకుని హార్మోనియం అందుకుంది… పవన్ దీప్తో కలిసి మృదంగం వాయించింది… ఒకరి తలలో మల్లెల మాల తురిమింది… ఒకరిని ముద్దాడి శాలువా కప్పింది… ఆమె వయస్సు, ఆమె హోదా ఏం చేస్తున్నా సరే, ఆ పిల్లలకు ఆత్మీయతనే పంచుతాయి కదా… ఇలా అన్నీ తానై, అంతా తానై… అందరూ అబ్బురపడేలా ఆడుకుంది…. సింపుల్‌గా చెప్పాలంటే ఆ షోను హైజాక్ చేసేసింది… ఎస్, రేఖ అంటే రేఖ, అంతే… ఈ ప్రోగ్రాం బాగా వచ్చింది కాబట్టే సోనీవాడు రెచ్చిపోయి ప్రోమోలు వదులుతున్నాడు… హిందీ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు తెగ రాసేస్తున్నయ్… చివరగా :: రేఖ అనగానే అమితాబ్‌తో ప్రణయం, భగ్నప్రేమ, విరహం గట్రా గుర్తొస్తాయి కదా… యాంకర్ జయ్ భానుశాలి ఓ ప్రశ్న అడిగాడు… ‘‘ఎవరైనా ఒక స్త్రీ ఒక మగాడి కోసం పిచ్చిపిచ్చిగా పడిపోవడాన్ని చూశారా..? అదీ పెళ్లయిన ఒక మగవాడి కోసం..?’’ ఇదీ ప్రశ్న… రేఖ గురించే అని తెలుసు కదా… ‘‘నన్ను అడగండి, నేను చెబుతాను కదా’’ అన్నది రేఖ వెంటనే… చెప్పండి, చెప్పండి అని ఆసక్తిగా చూస్తాడు యాంకర్… ‘‘నేనయితే ఏమీ చెప్పలేదబ్బా’’ అని నవ్వేసింది రేఖ… సిక్సర్… తెలివైన జవాబు, పెదాలపై నవ్వు పూయించే స్పాంటేనిటీ… వావ్ రేఖ… వావ్…! #mallikaeishqrekha, @adityanarayanofficial @nehakakkar @vishaldadlani @realhimesh @fremantleindia @ijaybhanushali @saylikamblemusic
Share this Article