.
మొన్న జ్యోతిలక్ష్మి వర్ధంతి… ఈ తరానికి ఆమె తెలియకపోవచ్చు… కానీ ఫిఫ్టీస్ నుంచి సెవన్టీస్ నడుమ ఉన్నవాళ్లందరికీ ఆమె ఓ ఐటమ్ బాంబ్… ఏవేవో సెర్చ్ చేస్తుంటే… మిత్రుడు Mani Bhushan అప్పుడెప్పుడో రాసిన ఓ పాత పోస్టు కనిపించింది…
శృంగార కావ్యాలలొ రాసిన స్త్రీ సౌందర్యానికి, శరీర లావణ్యానికి సరైన కొలబద్దలా ఉండేది జ్యోతిలక్ష్మి.
జ్యోతిలక్ష్మి ఆట, ఎల్లారీశ్వరి పాట, రాజబాబు కామెడీ ఒక జమానాలో తెలుగు సినిమాని ఊపేశాయి. అప్పట్లో హండ్రెడ్ డేస్ ఆడిన ప్రతి మూడు సినిమాల్లో రెండు వీళ్ల మూలానే ఆడాయంటే నమ్మరు. అంత పాపులారిటీ సంపాదించారు.
Ads
‘పిల్లా? పిడుగా?’, ‘మొనగాడొస్తున్నాడు జాగ్రత్త!’, ‘గుండెలు తీసిన మొనగాడు’ వంటి కొన్ని కౌబాయ్, అడ్వంచరస్ చిత్రాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది. మొత్తం మీద ఇరవై- ముప్పయ్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించగా, తమిళంలోనే పది సినిమాలలో లీడ్ రోలు పోషించింది.
‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ వేసి… హీరోయిన్ విజయనిర్మలకంటే ఎక్కువ మార్కులే కొట్టేసింది. ‘మొనగాడొస్తున్నాడు జాగ్రత్త!’ సినిమాకి ఎల్లారీశ్వరి సింగిల్ కార్డ్ గాయని. హీరో కృష్ణ సహా మరొకరికి పాటే లేదు!
.
శాస్తీయ నృత్యంలో ఆరితేరిన జ్యోతిలక్ష్మి…”ఇదా లోకం? (1973)” సినిమాలో “గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు” పాటలో అటు శాస్త్రీయాన్ని, ఇటు పక్కా మాస్ స్టెప్పుల్ని వేసి ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టింది.
ఎన్టిఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబు… ఇలా హీరోలు ఎవరైనా; వాణిశ్రీ, కాంచన, మంజుల, భారతి వగైరా అందాల తారలు ఉన్నా… జ్యోతి లక్ష్మి ఆట-పాట ఉండాల్సిందే!
కేవలం జ్యోతిలక్ష్మి పాట కోసమే సినిమాలకు వెళ్లే జనం ఉండేవారట!
—
(ఈమె మరణం తెలుగు సినిమాకి తీరని లోటులాంటి కామెంట్లు పెట్టి కామెడీ చేయకండి ఫ్రెండ్స్. బొబ్బిలి పులి (1983) నాటికే ఈమె రిటైరయ్యింది)…
నిజమే… 2016లో మరణించిన ఈమె తమిళ అయ్యంగార్ ఫ్యామిలీలో పుట్టింది… ఈమె చిన్న చెల్లెలు జయమాలిని కూడా డాన్సర్… ఈ ఇద్దరి తరువాత ఆ స్టేటస్ పొందింది మళ్లీ సిల్క్ స్మిత మాత్రమే… ఆ తరువాత హీరోయిన్లే వ్యాంపు పాత్రలు, ఐటమ్ సాంగ్స్ చేస్తుంటే ఇక ప్రత్యేకంగా వేరే ఐటమ్ డాన్సర్లు అవసరం లేకుండా పోయారు…
అన్నట్టు… జ్యోతిలక్ష్మి అనగానే గుర్తొచ్చేది… అప్పుడెప్పుడో దాసరి ఏదో సినిమాలో పెట్టిన పాట… జ్యోతిలక్ష్మి చీరకట్టింది, పాపం చీరెకే సిగ్గేసింది..!!
Share this Article