Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ స్వరం Gata rahe mera dil అంటూ గుండెల్లో మారుమోగుతూనే ఉంది…!

October 14, 2025 by M S R

.

Pal pal dil ke paas tum rehti ho…! (Blackmail)… (నిన్న అక్టోబర్ 13 కిశోర్ కుమార్ వర్ధంతి…)

.……………………………………………………………………………………….

Ads

SHANTHI ISHAAN…  కిశోర్ కుమార్ పాటలన్నింటిలోకీ నా మనసుకు చాలా దగ్గరైన పాట ఇది. కిశోర్ దా, ఆర్డీ బర్మన్ కాంబినేషన్ అంటే ఇష్టపడే నాకు కల్యాణ్ జీ – ఆనంద్ జీ స్వరపరిచిన పాట most favourite కావడం కొంత వింతగానే అనిపిస్తుంటుంది.

స్కూల్ డేస్ నుంచే కిశోర్ దా పాటలు వింటున్నా ఆ గొంతుకు బాగా కనెక్ట్ అయ్యింది మాత్రం కాలేజ్ డేస్ లోనే! ఆయన స్వరంలో ఒలికే youthfulness ఇందుకు కారణం కావచ్చు! Prem Pujariలో పూల రంగును, ప్రేమను సిరాగా మార్చి నీరజ్ రాసిన కవిత్వాన్ని కిశోర్ దా ఎంత అందంగా పలికారో విన్నాక ఆ గొంతుతో ఎవరు మాత్రం ప్రేమలో పడరు చెప్పండి!

Kora kagaz tha yeh man mera పాట మొదట్లో వచ్చే హమ్మింగ్ చాలదూ ఆయన స్వరాన్ని జీవితాంతం ప్రేమించేయడానికి. అప్పుడిక మనమూ O mere dil ke chain అని పాడుకుంటూ ఉండిపోమూ!

గుండె లోతుల్లో నుంచి వెలికి వచ్చే ప్రకంపనలేవో కిశోర్ దా గొంతు నిండా మార్దవ్యాన్ని, మాధుర్యాన్ని నింపిపోతాయి. Raat kali ek khwab mein aayee అని ఆయన పాడితే ముద్దులొలికే పూల మొగ్గలు కళ్ళ ముందు మెదలాడతాయి.

Ek ajnabi haseena se అంటే అందమైన ముగ్ధ అలా కలల్లో నడిచిపోతుంటుంది. Khilte hain gul yahan అని ఆయన పాడుతుంటే నిజంగానే మన చుట్టూరా పూలు విప్పారిన అనుభూతి కలుగుతుంది. Musafir hoon yaaron అంటూ RD బర్మన్ స్వరకల్పనలో పాడుతుంటే ఎంత లాలన! గుల్జార్ రాసినట్లు hawa ke paron par mera aashiyana అంటూ మనసు గాలి రెక్కలపై ఊరేగుతుంది.

Roop tera mastanaలో raat nashilee mast sama hai అని కిశోర్ దా పాడుతుంటే ఆ స్వరంలో ఎంత మత్తు ఇంకెంత గమ్మత్తు! అందుకే కదా ఈ పాట కొన్ని తరాలనే ఊపేసింది! Ye sham mastani అన్నా అదే మత్తు, అదే గమ్మత్తు. ఇంతటి మెలోడీలోనూ తన ట్రేడ్ మార్క్ yodellingతో పాటను రక్తి కట్టించారాయన.

Yodelling ప్రసక్తి ఎలాగూ వచ్చింది కాబట్టి Zindagi ek safar hai suhana, Chala jaata hoon kisi ki dhun mein కూడా గుర్తు చేసుకోవాల్సిందే. పంచమ్ దా కంపోజ్ చేసిన Chala jaata hoon పాటలో అయితే చరణాల్లోని పదాలను ముప్పతిప్పలు పెట్టి ఆయన yodel చేసిన తీరు పాటకు ఎంత హుషారు తెచ్చిందని! Jewel Thief లోని Ye dil na hota bechara ఇలాంటి అల్లరల్లరి పాటలకు మరో మంచి ఉదాహరణ.

ఇక ఆ గొంతులో బాధాతప్తత వినిపించిందా గుండె మెలితిరుగుతుంది. Koyi humdum na raha అని పాడితే మనసును దిగులు మేఘాలు కమ్మేస్తాయి. Zindagi ka safar ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్ళు తెప్పించలేదూ! Hum bewafa hargiz na the పాటలోని ఆవేదన ఎంతగా ఊపేస్తుందో మనకి తెలియనిదా?

ఈ పాటలోని చరణాలను high-pitchలో పాడుతూనే ఆయన బాధను ఎంత బాగా పలికించారని! Khushbooలోని O Majhi re కూడా ఇలాంటి melancholic tuneకి గొప్ప ఉదాహరణ.

అతిశయోక్తి అవునేమో తెలియదు కానీ కిశోర్ దా ముందు వేరే ఏ గొంతుకా ఆనదు నాకు. Abhimaanలో అమితాబ్ బచ్చన్ సింగర్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు పాడిన Meet na mila re man ka పాటను కిశోర్ కుమార్ తో పాడించారు.

భార్య గొంతుకే గొప్పగా ఉందని చెప్పాల్సిన సందర్భంలో పాడిన Teri bindiya re లో మాత్రం రఫీ గొంతుక వినిపిస్తుంది. అంటే రఫీ కంటే కిశోర్ కుమార్ గొంతుక గొప్పదని makers చెప్పకనే చెప్పారా? ఏమో నాకలా అనిపించి ఉండొచ్చు (రఫీ ఫ్యాన్స్ నా అత్యుత్సాహాన్ని మన్నించేసేయండి).

కిశోర్ దా పాడిన ఆణిముత్యాల్లో Andhiలోని Tere bina zindagi se ఒకటి. ఇందులో మొదటి రెండు చరణాలు లతా మంగేష్కర్ పాడితే కిశోర్ దా గొంతుక చివరి చరణంలో వినిపిస్తుంది. పాట మొదలైన దగ్గర నుంచి నేను ఆ చివరి చరణం కోసమే ఎదురుచూస్తానంటే మీరు నమ్మాలి మరి!

Mere naina sawan bhadon పాటను లతా మంగేష్కర్ కూడా పాడినా కిశోర్ కుమార్ పాడిన వర్షనే పాపులర్ అయింది. అలాగే Rhimjhim gire sawan విషయంలోనూ లతా వర్షన్ కంటే కిశోర్ దా వర్షన్ అంటేనే నాకు చాలా ఇష్టం.

Shiv-Hari స్వరపరిచిన Dekha ek khwab పాటలోనూ కిశోర్ కుమార్ గొంతంటేనే మక్కువ. ఇక Aapki aankhon mein kuch mehke huye se raaz hain అంటూ గుల్జార్ రాసిన ఉదాత్తమైన లిరిక్స్ కి ఆర్డీ బర్మన్ అంతే గొప్పగా స్వర కల్పన చేస్తే కిశోర్ దా తన గొంతుకతో ప్రాణం పోశారు. ఇందులోనూ లతాజీ గొంతుక కంటే కిశోర్ దా స్వరమే బాగా నచ్చుతుంది నాకు.

శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా సహజ సిద్ధమైన గొంతుకతోనే కిశోర్ దా అందరి మనసులూ గెలుచుకోగలిగారు. మిమిక్రీ, yodelling- ఇలా ఆయన తన స్వరంతో చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చేసి ఉండరేమో!

అందుకే కాబట్టే ఆ గొంతు ఆయన వెళ్ళిపోయి ఇన్ని దశాబ్దాలైనా ఆ స్వరం మాత్రం Gata rahe mera dil అంటూ మన గుండెల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. అమృతం, అజరామరం! కొన్ని యుగాలైనా మన గుండెల్లో పదిలం!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తప్పుడు కేసులో 43 ఏళ్ల జైలు… ఎట్టకేలకు నిర్దోషి… కానీ మరో అన్యాయం..?
  • ఈ దర్శనం అమూల్యం… ఇది కళ్లకు తెలియని ఓ భక్తి పారవశ్యం…
  • ఆ స్వరం Gata rahe mera dil అంటూ గుండెల్లో మారుమోగుతూనే ఉంది…!
  • సానుభూతి వేరు… వోట్లేసే లెక్క వేరు… పాత ప్యాటర్న్ చెప్పేది ఇదే…
  • బిలియనీర్స్ బంకర్..! అణుయుద్ధం బూచిగా… ఇదో కమర్షియల్ స్కామ్..!!
  • విశ్వనాథుడి మరో సంగీత కెరటం… శృతిలయలు చక్కగా కుదిరిన కథ…
  • మునుగోడుకు సపరేట్ ముఖ్యమంత్రి, సొంత ఎక్సయిజు రాజ్యాంగం..!!
  • మీకు సుగర్ ఉందా..? వేడివేడిగా లాగించకండి…! బాగా చల్లారనివ్వండి..!!
  • చిదంబరం ‘తప్పుల ఒప్పుకోలు’ ప్రకటనలు… అసలు మర్మమేమిటో…
  • Good Classmates..! ఆ క్లాస్‌మేట్ ఆత్మ ఆనందపడి ఉంటుంది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions