ఓ ఇంట్రస్టింగ్ విషయం ఏమిటో తెలుసా..? మనం టీవీలు చూస్తున్నాం… సంవత్సర చందాలు కడుతున్నాం… రకరకాల ప్యాకేజీలు, రేట్లతో డబ్బు చెల్లిస్తున్నాం… కానీ అవి టీవీ చానెళ్లకు ఉత్త జుజుబీ… పత్రికల కవర్ ప్రైస్‌లాగా… అసలు రెవిన్యూ యాడ్స్ ద్వారా వస్తుంది… అసలు పెద్ద కంపెనీల యాడ్స్ లేకపోతే ఒక్క టీవీ చానెల్ కూడా నడవదు… అయితే ఏ కంపెనీలు, ప్రధానంగా ఏ ఉత్పత్తులు టీవీ ప్రకటనల్ని శాసిస్తున్నయ్… మన డబ్బు ప్రధానంగా ఏయే ఉత్పత్తుల ద్వారా టీవీలను బతికిస్తున్నాయి..?
ఈ సంవత్సరం ఇండియాలో టీవీ ప్రకటనల ఆదాయం కనీసం 3.6 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా… అంటే ఎంత్ పెద్ద మార్కెటో అర్థం చేసుకొండి… అందుకే రేటింగుల ట్యాంపరింగులు, దందాలు… సరే, బ్రాండ్లు, ఉత్పత్తుల విషయానికొద్దాం… ఇంట్రస్టింగ్ ఏమిటీ అంటే..? టాప్ టెన్ ఉత్పత్తుల్లో ఏడు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతకు సంబంధించినవే… నో, పౌడర్లు, క్రీములు ఎట్సెట్రా కావు… ప్రత్యేకించి కరోనా కాలంలో ఈ శుభ్రత బాపతు కంపెనీల అమ్మకాలు, ప్రచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి… ప్రజలు కూడా ఎక్కువగా శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్న ట్రెండ్‌కు ఈ యాడ్స్ పరిమాణం ఓ ఉదాహరణ…
ఫస్ట్ ప్లేసులో ఉండేది ఏమిటో తెలుసా..? మన అంచనాకు అందదు… డెటాల్ టాయిలెట్ సోప్… అబ్బా, టాయిలెట్లు కడిగేది కాదు, స్నానపు సబ్బే… ఇది రెకిట్ వారి ఉత్పత్తి… రకరకాల సౌందర్య సాధన సబ్బులు ఏమీ ఈ టాప్ టెన్ జాబితాలో లేవు… కేవలం డెటాల్… కాస్త యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నట్టు కూడా చెప్పుకుంటుంది కదా… సౌందర్యంకన్నా ఇక్కడ శుభ్రతే ప్రధానం… రెండోది హార్పిక్ పవర్ ప్లస్… ఇది మీరు ఊహించేది, మీకు బాగా తెలిసిన టాయిలెట్ క్లీనర్… ఇదీ రెకిట్ వాళ్లదే… ఇంత ప్రచారం చేసుకుంటూ, ఇంత ఖర్చు పెడుతున్నదా అని మరో ఆశ్చర్యం…
Ads
మూడోది లైజాల్ ఆల్ ఇన్ వన్… ఇది సర్ఫేస్ క్లీనర్… గచ్చు, వంటగది, ఫ్లోరింగ్ ఎట్సెట్రా… డిస్‌ఇన్‌ఫెక్టాంట్… ఇదీ కరోనా కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందే… నాలుగోది మళ్లీ డెట్టాల్… ఇది యాంటీ సెప్టిక్ లిక్విడ్… ఇదీ వ్యక్తిగత శుభ్రతకు ఉద్దేశించిన లిక్విడ్… కరోనా పీరియడ్‌లో బాగా అమ్మకాలు సాగాయి… ఆ అమ్మకాలు, ఆ ప్రచారం కొనసాగుతున్నాయి… అయిదోది హార్పిక్ బాత్‌రూం క్లీనర్… ఇది కేవలం టాయిలెట్ క్లీనర్ మాత్రమే కాదు, బాత్రూం ఫ్లోర్ క్లీనర్ కూడా… టాప్ ఫైవ్ చూస్తే పర్సనల్ హైజీన్, పరిసరాల హైజీన్…
ఆరోది మూవ్ స్ట్రాంగ్ స్ప్రే… ఇది డిఫరెంట్, దాన్ని పక్కన పెడితే… మళ్లీ ఏడోది వానిష్ ఓక్సి యాక్షన్… బట్టలు ఉతికేది పౌడర్ మరియు లిక్విడ్… ఇదీ శుభ్రతకు సంబంధించిన ప్రొడక్టే… ఎనిమిదోది సంతూర్ శాండల్‌వుడ్ అండ్ టర్మరిక్ సోప్… ఇదీ వ్యక్తిగత శుభ్రత కేటగిరీలోనిదే… ఇక తొమ్మిదోది విమల్ పాన్ మసాలా… పరోక్షంగా ఆ గుట్కాను ప్రమోట్ చేసే సరోగసీ యాడ్స్… పదోది పార్లే బిస్కట్స్… ఈ మొత్తం కథనంలో ఆసక్తికరం ఏమిటంటే… జనంలో శుభ్రత మీద పెరిగిన శ్రద్ధ, ఆయా కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలు, వాటి టీవీ ప్రచారాలు… అసలు కారణం కరోనా భయమే ఇప్పటికీ…!!
1 | DETTOL TOILET SOAPS | 769.75 |
2 | HARPIC POWER PLUS 10X MAX CLEAN | 745.01 |
3 | LIZOL ALL IN 1 | 633.82 |
4 | DETTOL ANTISEPTIC LIQUID | 439.13 |
5 | HARPIC BATHROOM CLEANER | 401.8 |
6 | MOOV STRONG SPRAY | 366.63 |
7 | VANISH OXI ACTION | 312.96 |
8 | SANTOOR SANDAL AND TURMERIC | 310.64 |
9 | VIMAL ELAICHI PAN MASALA | 274.89 |
10 | PARLE G | 268.74 |
Share this Article