Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ నుంచి మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ సీటు..? నో వే…!!

June 14, 2026 by M S R

.

తెలంగాణలో ఎవరో కాంగ్రెస్ వాళ్లే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరింపబడేలా ఆమెకు కోర్టు నోటీసుల అంశాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు ఉప్పందించారు అనేది వివాదం.., నో, నో, తెలంగాణ బీజేపీ నేతలతో ప్లాన్‌డ్‌గా ఈ కేసు వివరాలు మధ్యప్రదేశ్ బీజేపీకి అందించారు, అందుకే మూడో అభ్యర్థిని పెట్టారు, రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేశాడు అనేది మరో వాదన…

సరే, నామినేషన్ తిరస్కరించబడింది… ఆమె స్థానంలో ఎవరో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యాడు, సుప్రీంకోర్టు ఎన్నిక దశలో నేను జోక్యం చేసుకోను అనేసింది… ఎన్నికల సంఘం దగ్గరే తేల్చుకొమ్మంది… ఎన్నికల సంఘం కూడా సుప్రీంకోర్టు వైఖరికి భిన్నంగా ఏమీ వెళ్లకపోవచ్చు… కానీ ఏ తెలంగాణ నుంచి కేసు వివరాలు లీకయ్యాయో, అక్కడి నుంచే ఆమెను రాజ్యసభకు పంపించాలని ఎఐసీసీ ఆలోచిస్తోందని ఓ వార్త… పైగా ఆమె తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి…

Ads

బహుశా ప్లాంటెడ్..! అది సాధ్యం కాకపోవచ్చు రకరకాల కారణాల రీత్యా… ఓసారి చెప్పుకుందాం… ఆమెను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించాలీ అంటే మొదట ఎన్నికల సంఘం దగ్గర ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలి… ప్రస్తుతం తెలంగాణ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు కాంగ్రెస్ తరఫున… లీగల్, టెక్నికల్ కారణాల రీత్యా నామినేషన్ రిజెక్టయినా… ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ వాళ్లే ఆమెకు వ్యతిరేకంగా పనిచేయడం అనేదే నిజమైతే…

ఆమె మీద స్థానిక నేతల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు లెక్క… ఎఐసీసీ దానికి కారణాలు అన్వేషించాల్సిందే తప్ప, కావాలని ఆమె అభ్యర్థిత్వాన్ని తెలంగాణ మీద రుద్దకూడదు… అది పార్టీలోనే మరింత వ్యతిరేకతకు దారితీస్తుంది…

లేదూ తప్పనిసరిగా తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపిద్దాం అనుకుంటే, ప్రస్తుతం ఖాళీలేవీ లేవు… రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ ప్రస్తుత రాజ్యసభ ఎంపీలు… ఎవరితోనైనా రిజైన్ చేయిస్తే తప్ప ఖాళీ ఏర్పడదు… ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పంపించడమే తప్ప, రాజీనామా చేయించడం చాలా చాలా క్లిష్టం…

వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు… పైగా మొన్నమొన్ననే ఎన్నికయ్యాడు… కుదరదు… అభిషేక్ సింఘ్వీ ఎఐసీసీకి లీగల్ గుండెకాయ… అదీ కుదరదు… అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్ లీడర్, పైగా బీసీ… జీహెచ్ఎంసీ ఎన్నికల్ని ముందు పెట్టుకుని ఓ బీసీ నేతను ఇంటికి పంపిస్తానంటే అది యాంటీ సెంటిమెంట్, అసలే బీసీ మూవ్‌మెంట్ ఉన్న ఈరోజుల్లో తనను రాజీనామా చేయించడం సూసైడల్…

ఇక మిగిలింది రేణుకా చౌదరి… ఒకవైపు హైదరాబాదులో ఎన్టీయార్ విగ్రహం పెట్టి మరీ సెటిలర్ల వోట్ల కోసం జీహెచ్ఎంసీ ఎన్నికల పావులు కదుపుతున్న నేపథ్యంలో ఆమెతో రాజీనామా చేయించలేరు… 70 ఏళ్ల వయస్సులో ఆమె పార్టీకి ఏమీ ఉపయోగపడదు, ఆమెకే పార్టీ ఉపయోగపడాలి… పైగా రాజీనామా చేయి అనడిగితే ఢిల్లీ వీథుల్లోనే పెద్ద పంచాయితీ పెట్టి గాయిగత్తర చేయగలదు…

మరి ఎవరు రాజీనామా చేయాలి..? ఖాళీ ఎలా ఏర్పడాలి..? 2028లో ఖాళీ అయ్యే బీఆర్ఎస్‌కు చెందిన రెండు సీట్లలో అప్పటి అసెంబ్లీ సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ అవకాశం వెతకాలి… అంతే తప్ప ఇప్పటికిప్పుడు మీనాక్షి నటరాజన్‌కు ఈ కోణంలో తెలంగాణ నుంచి నో చాన్స్… ఐనా పట్టుబట్టి ఆమెను రాజ్యసభకు పంపించాల్సినంత అర్జెన్సీ, ఇంపార్టెన్స్ ఏముందని..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ నుంచి మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ సీటు..? నో వే…!!
  • కాలా హిరణ్..! పాపం, సల్మాన్ వ్యక్తిత్వ హక్కులకు విఘాతం అట..!!
  • రెండు కొప్పుల ‘సివిల్’ వార్‌… చివరకు సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం..!!
  • ఆలియా భట్..! చెప్పే మాటలకూ చేసే పనులకూ ఎంత తేడా..?!
  • దృఢం..! జీతూ జోసెఫ్ మార్క్ ‘దృశ్యం’ లేదు… దృఢంగా లేదు…
  • ఒక షిండే… ఒక హిమంత… ఒక సువేందు… ఒక హరీష్ రావు..?!
  • అన్‌సాల్వ్‌డ్ మిస్టరీ..! ఆల్ప్స్ పర్వతాల్లో విమాన ప్రమాదం..!!
  • అప్పలసూరి ఏడుపు … తెలుగు నటుడిగా పుట్టడమే దురదృష్టమట…
  • నీ అయ్య – నా మామ..! ఒక్క పాటకు సిప్లిగంజ్ కోటి రూపాయల ఖర్చు..!!
  • డబుల్ స్టాక్ రవాణా..! మన రైల్వేలు సాధించిన మరో ఘనత…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions