.
బాలీవుడ్‌లో తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటి రేణుకా షహనే (Renuka Shahane) ఇటీవల సినీ పరిశ్రమలోని చీకటి కోణాలపై సంచలన వ్యాఖ్యలు చేసిాంది… ముఖ్యంగా, కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన గురించి ఆమె నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది… (1990 నుంచి 2001) వరకు పాపులర్ దూరదర్శన్ సురభి షోకు కో-హోస్ట్ ఆమె)…
నిర్మాత నుండి రేణుకాకు షాకింగ్ ప్రతిపాదన
Ads
ఒకానొక సందర్భంలో ఒక సినీ నిర్మాత తన ఇంటికే వచ్చి చేసిన అసభ్యకరమైన ప్రతిపాదనను రేణుకా షహనే గుర్తుచేసుకుంది… జూమ్ (Zoom)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “ఒక నిర్మాత మా ఇంటికి వచ్చాడు. ఆయన పెళ్లయింది అప్పటికే…
నన్ను ఒక చీరల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని అడిగాడు… ఆ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటే, ప్రతి నెలా జీవనం కోసం కొంత స్టైపెండ్ ఇస్తానని, దానికి ప్రతిఫలంగా తాను అడిగిన విధంగా తనతో కలిసి ఉండాలని ప్రతిపాదించాడు… ఆ మాట విని నేను, మా అమ్మ షాక్ అయ్యాము” అని తెలిపింది…
తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించాక, ఆ నిర్మాత మరొకరి వద్దకు అదే ప్రతిపాదనతో వెళ్లాడని ఆమె చెప్పింది… అయితే, డర్టీ ఆఫర్లను ప్రతిఘటించే వారికి పరిశ్రమలో శక్తివంతమైన వ్యక్తులు ఇబ్బందులు సృష్టిస్తారనీ, ప్రతిఘటించి ఇండస్ట్రీలో నిలబడటం అందరికీ అంత సులభం కాదని అంటోంది ఆమె…
“కొన్నిసార్లు, మీరు ఎవరినైనా తిరస్కరిస్తే, వారు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు… ఇతరులకు మీకు అవకాశాలు ఇవ్వవద్దని చెబుతారు… అది చాలా ప్రమాదకరం… నాకు జరగకపోయినా, ఎవరికైనా జరగవచ్చు…” అని రేణుక హెచ్చరించింది…
మీటూ ఉద్యమం ప్రభావం తగ్గిందా?
‘‘లైంగిక వేధింపుల గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వారికి వ్యతిరేకంగా సినీ వర్గాలు ఏకమై ఆ బాధితులపైనే ప్రతీకారం తీర్చుకుంటాయి… ప్రాజెక్టుల నుండి తొలగించడం, ఇంకా ఇంకా వేధించడం, ఒక్కోసారి చెల్లింపులు కూడా ఆపేస్తారు… ఇదంతా కలిసి, బాధితుడిని మరింత వేధించే ఒక ఫాసిస్ట్ క్లబ్ లాంటిది”
#MeToo ఉద్యమం వచ్చి చాలా కాలమైనా, ఆరోపణలు ఎదుర్కొన్న చాలా మంది తమ పనిని మళ్లీ ప్రారంభించారు… ఉద్యమం ప్రభావం తగ్గింది… “సమస్య ఏమిటంటే, మీటూ ఉద్యమం తర్వాత, ఆరోపణలు ఎదుర్కొన్న వారు 5- 6 సంవత్సరాల తర్వాత అంతా మర్చిపోయి, అదే పని చేస్తున్నారు… మీరు ఎవరిపైనైనా ఆరోపణ చేసినప్పుడు, పోలీసు కేసు వంటి ఆధారాలు లేకపోతే, మీరే నిరూపించలేదని ఎదుటివారు మిమ్మల్ని ప్రశ్నించే ప్రమాదం ఉంది…”
రవీనా టండన్ భద్రత జాగ్రత్తలు
‘‘బాలీవుడ్ అగ్ర నటిగా, సినీ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, రవీనా టండన్ కూడా సెట్స్‌లో భద్రత కోసం ఎంత అప్రమత్తంగా ఉండాల్సి వచ్చిందో తెలుసా..’’ అని రేణుకా షహనే ఇంకొన్ని విషయాలు చెప్పింది…
“రవీనా పెద్ద హీరోయిన్… ఆమె పరిశ్రమ నుండే వచ్చింది… కానీ ఆమె నాతో చెప్పినదేమిటంటే, అవుట్‌డోర్ షూటింగ్‌ల సమయంలో, ఎవ్వరికీ తెలియకుండా మేము ప్రతిరోజూ గదులు మార్చేవాళ్ళం… ఎందుకంటే రాత్రిళ్లు ఎవరూ వచ్చి సమస్య సృష్టించకూడదు అని… రాత్రిపూట నటులు, నిర్మాతలు వంటి వారు హీరోయిన్ల గదుల తలుపులు కొట్టేవారని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి సరిపోయేవి కాదని రవీనా చెప్పేదవి…”
రేణుకా షహనే చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులను, అభద్రతను మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించాయి…
Share this Article