బాజిరెడ్డీ… శివారెడ్డి చస్తే నువ్వు సీఎం అవుతావు… కానీ శివారెడ్డిని చంపితే నేరస్థుడివి అవుతావు… ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయావ్..?…….. ఈ డవిలాగు అదేదే మహేశ్ సినిమాలో చాలా పాపులర్…. ఈ ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ వార్త చదివాక ఎందుకో గానీ ఆ డైలాగే గుర్తొస్తుంది… ఎందుకంటే… పక్కాగా ఇందులోనూ లాజిక్ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నది కనుక….
ఎస్; నిజమే… గాలి పోగేసి ఏదైనా మసాలా వంటకం చేయడంలో ఆంధ్రజ్యోతి ఏకాలం నుంచో ఫేమస్… అసలు సరుకులు వేయకుండా కేవలం మసాలాలు వేసి ధమ్కీ బిర్యానీ (అంటే పాఠకులకు, టార్గెట్ లీడర్లకు ధమ్కీ) ఘుమఘుమలాడించగలదు… కానీ ఇది మరీ పొయ్యి కింద మంట కూడా పెట్టకుండా వంట చేసినట్టుంది… పొయ్యి కింద మంట లేకుండా… వంట చేసి మంటపెట్టడం అనే ఓ కొత్త కళను ప్రయోగం చేస్తున్నట్టుంది…
Ads
తెలంగాణ సీఎం కేసీయార్ మొన్నటి దెబ్బాక, గ్రేటర్ పరాభవం తరువాత చింతాక్రాంతుడై… పరిపరివిధముల చింతించి, పరితపించి… చివరకు ఓ తరుణోపాయం కనుగొన్నాడట… జగన్ పార్టీని బరిలో దింపడమే ఇక శరణ్యమని ఆ అస్త్రాన్ని బయటికి తీస్తున్నాడట… అదేదో కేసీయార్ చెప్పగానే, జగన్ తన పార్టీని అబ్రకదబ్ర అనగానే మూసేసినట్టు… ఓపెన్ ససేమ్ అనగానే తెరిచినట్టు..! జగన్ పార్టీ ముఖ్యుల్ని పిలిచి, ఏమోయ్, మీరు వెంటనే తెలంగాణలో కూడా పొలిటికల్ ఆపరేషన్లు స్టార్ట్ చేసేయాలీ అని చెప్పాడట… ఏకంగా జగన్ సోదరి షర్మిల కూడా పెద్ద డాలు, పెద్ద కత్తీ పట్టుకుని ఇక యుద్ధరంగంలోకి దిగాల్సి వస్తుందని కూడా చెప్పాడట…
ఆయ్ఁ… ఓరీ బీజేపీ అధమా… నాకు రెడ్లంటే పడదని తెలిసి… రెడ్లకూ నాకూ చుక్కెదురు అని తెలిసి… కాంగ్రెస్ నుంచి రెడ్లను నువ్వు తోలుకుపోతవా..? నన్ను దెబ్బ తీస్తవా..? చూడు, జగన్ ప్రయోగంతో నీ వ్యూహాన్ని పటాపంచలు చేస్తాను…. అని కేసీయార్ అన్నట్టుగా ఉందీ రచన… సరే, పర్ డిబేట్ సేక్… ఈ వార్త నిజమే అనుకుందాం… చర్చ కోసం దేనికి, అక్షరసత్యం అనుకుందాం… ఇక పదండి విశ్లేషిద్దాం..
- ఇంతకీ జగన్ పార్టీ తెలంగాణ ముఖ్యులు అనగా ఎవ్వరు..? ఆ పార్టీకి తెలంగాణ ముఖ్యులు కూడా ఉన్నారా..? ఎవరూ, పార్టీ నిర్మాతగా పేరున్న శివకుమారుడా..? పార్టీ నాయకుడే అంటున్న పుత్తా ప్రతాపుడా..? జగన్‌తో సంప్రదింపులకు, సంధానానికి వాళ్లేనా..? హవ్వ… ఎంతమాట.? ఎంతమాట..?
- మొన్న మీరే కదా రాసింది..? జగన్ పార్టీ వోట్లన్నీ కేసీయార్‌కు వేయించారు… లేకపోతే మొన్న గ్రేటర్లో కేసీయార్ మరీ ఏ ఇరవైకో, ముప్ఫయికో పడిపోయేవాడు అని…! ఎలాగూ జగన్, కేసీయార్ జాన్ జిగ్రీ దోస్తులే కదా… అలాంటప్పుడు… జగన్ చెబితే ఆంధ్రా రెడ్లు, తెలంగాణ రెడ్లు వినేపక్షంలో… జగన్‌తో మళ్లీ పార్టీ దుకాణం ఓపెన్ చేయించాల్సిన ఖర్మ కేసీయార్‌కు దేనికి..? అవెలాగూ తనకు పడేవే కదా…
- ఒకవేళ జగన్ మళ్లీ తన దుకాణం ఓపెన్ చేస్తే… ఆ వోట్లన్నీ చీలిపోతే… అది బీజేపీకి లాభం కాదా..? అంటే కేసీయారే కావాలని బీజేపీకి మేలు చేసే వ్యూహాలు రచిస్తాడా…?
- పైగా జగన్ పార్టీ అంటే కేవలం రెడ్ల పార్టీయేనా..? తెలంగాణలో వైఎస్‌ను అభిమానించే ఇతర కులస్థులు లేరా..?
- షర్మిల అప్పట్లో అన్న కోసం జగన్బాణంగా జనంలో తిరిగింది అవసరార్థం… అంతేతప్ప ఆమెకు రాజకీయాలపై ఇంట్రస్టు లేదు, అన్న అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా ఏ ఒక్క సందర్భంలోనూ ఆమె రాజకీయ తెరపై కనిపించలేదు… వదిన భారతి అన్నకు సాయంగా అప్పుడప్పుడూ కనిపిస్తున్నా సరే, షర్మిల మాత్రం పాలిటిక్స్ జోలికి రాలేదు… బహుశా రాదు కూడా…
- మరి ఆమెను ప్రతినిధిగా పెట్టి, ఇప్పటికిప్పుడు తెలంగాణలో బ్రాంచ్ ఆఫీసు మళ్లీ ఓపెన్ చేయాల్సిన అవసరం జగన్‌కు ఏముంది..? పైగా తన యుద్ధక్షేత్రం ఏపీ మాత్రమే… దాన్ని వదిలి తెలంగాణలో కూడా రాజకీయం చేద్దాం అనుకుంటే… చంద్రబాబుకు పట్టిన గతే… ఎందుకంటే, చాలా సమీకరణాలు మారిపోతయ్…
- అంతెందుకు..? కేసీయార్‌కు లబ్ధి చేకూర్చే పనిని జగన్ చేస్తే… జగన్ కూడా బీజేపీకి శత్రువు అయిపోతాడు… జగన్ ఇప్పుడు అదెందుకు గోక్కుంటాడు…? సో, డియర్ రాధాకృష్ణా… ఈసారి ఎవరెవరి నడుమో పుల్లు పెట్టాలనుకుని, తమరు వదిలిన ఈ పుల్లల బాణంలో పెద్ద పంచ్ లేదు… తుస్…
Share this Article