.
నేనొక సీరియస్ విషయం చెబుతాను… మొన్ననే చెప్పాను ఓ ఇన్సిడెంట్… డల్లాస్‌లో ఓ అమెరికన్ మనవాళ్ల వీథిప్రదర్శనలపై అసహనంతో పెట్టిన పోస్టు గురించి, దానిపై మనవాళ్ల ఏపీ తరహా రెస్సాన్స్ గురించి…
ఏమీ లేదు… మనవాళ్లకు రోమ్‌లో రోమన్‌లాగా ఉండటం తెలియదు… సంస్కారం తెలియదు… మన ఫ్యానిజం, మన రోత మొత్తం యూఎస్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని… అది స్థానికుల్లో విపరీతమైన అసహనానికీ …. అంతిమంగా ట్రంపు అనేవాడి ద్వారా ఏకంగా హెచ్1బీ ఆంక్షలకూ దారితీస్తున్నదనీ మనవాళ్లకు తెలియదు, అర్థం కాదు… మనం మారం…
Ads
మనం చెత్తా కులఫ్యానిజంతో ప్రదర్శనలు చేస్తాం, దరిద్రంగా థియేటర్లలో సీట్లు కోస్తాం, నానా చెత్తా ప్రదర్శిస్తాం… స్థానిక కల్చర్‌ను డిస్టర్బ్ చేసే రోత వేషాలు వేస్తాం… అది రాను రాను అమెరికన్లలో ఆగ్రహం పెంచుతోంది…
కులం, ప్రాంతం జాఢ్యం ప్రభావం ఏమిటో ఈ మూర్ఖాభిమానులకు అర్థం కాదు… వాడికి బీటెక్ ఉంటుంది గానీ కామన్ సెన్స్, గ్లోబల్ సెన్స్, కామన్ టెక్ ఉండదు కదా… ఇక్కడి నుంచి వెళ్లే సెలబ్రిటీ గాడిదలకు అంతకన్నా జ్ఞానం అస్సలు ఉండదు కదా…
ఇప్పుడు ఏం జరిగింది..? ఓజీ సినిమా మీద పడింది ఆ ప్రభావం… యూఎస్ క్లియర్… ఈ తెలుగు కమ్యూనిటీని కంట్రోల్ చేయాల్సిందే… హెచ్1బీ మాత్రమే కాదు, ఇక ఇండియన్లు కాదు, స్పెషల్‌గా తెలుగు కమ్యూనిటీ సఫర్ కాబోతోంది… ఐనా మన వెధవలకు అర్థం అవుతుందనే నమ్మకం మాత్రం లేదు…
- North America లో వివాదంలో #OG సినిమా డిస్ట్రిబ్యూటర్. రాజకీయ, సామాజిక వర్గాల ఒత్తిడి మేరకు.. తాము OG సినిమా ప్రదర్శన నుంచి వైదొలగుతున్నట్టు తెలిపిన York Cinemas… #NorthAmerica లో దక్షిణ ఆసియా ప్రాంతం సినిమాలను ప్రదర్శించే ఒక వర్గం వాళ్ళు సామాజిక వర్గాలలో విభేదాలు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని… ఈసారి ఓజీ సినిమా exhibit టైమ్ లో ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయో ఏమో అన్న అనుమానంతో తాము తప్పుకుంటున్నట్టు యార్క్ సినిమాస్ మేనేజ్మెంట్ తెలిపింది… ఇప్పటివరకు బుక్ అయిన టికెట్లు అన్ని రీయింబర్స్ చేస్తామని, మేము OG నుంచి తప్పుకున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మాపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, మా ఫైనాన్సియల్ స్టేటస్ గందరగోళంగా ఉందని మా సంస్థపై అభాండాలు వేస్తున్నారు… అలా చెప్పినవాళ్ల మీద న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్న లేఖను యార్క్ నిర్వాహకులు విడుదల చేశారు…#OG #NorthAmerica #SouthAsianFilms #YorkCinemas
……………………………….
ఇది ఒక ఓజీ సమస్య కాదు… కులాభిమానంతో కుళ్లిపోయే ప్రతి సినిమా సమస్య… ప్రతి కులసమస్య… ప్రత్యేకించి తెలుగు సమస్య… కాదు, అంతిమంగా ఇండియన్లను భద్రతారాహిత్యంలోకి పడేసే విషసమస్య… ఐనా ఈ వెధవలకు అర్థమవుతుందని అనుకోలేం… (ఎన్ఆర్ఐ సంఘాలు సిగ్గుపడండి)…
ఇంతకీ యార్స్ సినిమాస్ ఉత్తర అమెరికాలో ఓజీ ప్రదర్శనల్ని ఎందుకు రద్దు చేసింది..? అదీ ప్రధానం… అది ఒక దిల్ రాజుకో, ఒక చంద్రబాబుకో, ఒక రేవంత్ రెడ్డికో, ఒక పవన్ కల్యాణ్‌కో అర్థం కాదు… అర్థమయ్యే సీన్ వాళ్లకు లేదు…
యార్క్ సినిమాస్ వారు వివిధ సాంస్కృతిక, రాజకీయ ప్రభావాల వల్ల ప్రజల భద్రతకు ప్రమాదం ఉండొచ్చనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నారు… ముందుగా టికెట్లు కొన్నవారికి పూర్తి రిఫండ్ ఇవ్వబడుతుంది… మా కస్టమర్స్, ఉద్యోగులు మరియు ప్రజల భద్రత మాకు ప్రాధాన్యం… అని చెబుతోంది ఆ ఎగ్జిబిషన్ సంస్థ… అయితే అసలు రీజన్..?
‘‘కృత్రిమంగా సినిమాకు హైప్ క్రియేట్ చేస్తారు… ఎలా… ? బల్క్ బుకింగ్స్… తరువాత ఆహో ఓహో… మా హీరో తోపు, తురుం… వీడు దేవుడు, దేవుడికన్నా తోపు అని ప్రచారం… తరువాత అవన్నీ కేన్సిల్ చేసి, రిఫండ్ కోరతారు… ఒక చెత్తా మార్కెటింగ్ టాక్టిక్స్… ఒరేయ్ అది హైదరాబాద్ కాదురా…
‘‘కొందరు వ్యక్తులు సామాజిక స్థితి, రాజకీయ సంబంధాల ఆధారంగా దక్షిణాసియా కమ్యూనిటీలలో విభేదాన్ని రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు… యార్క్ సినిమాస్ అలాంటి అనైతిక వ్యాపార ధోరణులను ఒప్పుకోదు..; దక్షిణాసియా సమాజంలో అన్ని గ్రూపులను ప్రోత్సహించడమే మా లక్ష్యం…’’ అంటోంది ఆ ఎగ్జిబిషన్ సంస్థ… అదేమీ ఆ నలుగురి గుప్పిట్లో ఉన్న మూసీ మార్క్ సినిమా సిండికేట్ కాదు కదా…
ఆహా… ఈ కులహీరోల చెత్తా పోకడల గురించి అమెరికాకు కూడా అర్థమైంది… అసలే ఇండియా మీద ఆ ట్రంపు గాడికి ద్వేషం, వాడసలే పాకిస్తానీ తొత్తు… ఈ నేపథ్యంలో మన మూర్ఖపు, చెత్తా, మురికి, కంపు ఫ్యానిజాన్ని… తిక్క మార్కెటింగ్ టాక్టిక్స్ ప్రయోగిస్తే ఎవరికి నష్టం..? అది ఇంకా ఇంకా స్థానిక అమెరికన్లలో ఆగ్రహాన్ని పెంచితే ఎవరికి నష్టం..? ఈ గాడిదలకు ఆ సోయి ఉందా అసలు..?!
మన కాలనీలోకి మురికి ప్రవహిస్తుంటే మనం ఏం చేస్తాం..? అమెరికా కూడా అదే చేస్తోంది… మన వెధవ గాడిదలకు అర్థం అవుతుందని మాత్రం అనుకోలేం… అనుభవించాల్సిందే..!! చెయ్యండిరా… జంతుబలులు, క్షీరాభిషేకాలు… మిమ్మల్ని ట్రంపు గాడు తరిమేస్తే నిజంగా సంతోషించేది భారతీయులే..!! ఎందుకంటే… అమెరికన్లలో కోపం పెరుగుతున్నది మన తెలుగు రోతతోనే..!!
చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి దేశంలోకి రావడానికి వీసాలు ఇస్తే అక్కడకి పోయి కుల సంఘాలు, కార్ ర్యాలీలు, థియేటర్లో పేపర్లు విసరడాలు. ఫస్ట్ వరల్డ్ కంట్రీని థర్డ్ వరల్డ్ గా మారుస్తున్నారు అని వాళ్ళతో తిట్లు తినడాలు…
“ఈ సినిమా పంపిణీలో సాంస్కృతిక, రాజకీయ శక్తులు ఉన్నాయి. అవి ప్రజా భద్రతకు ముప్పు” అని గుర్తించి, OG సినిమా డిస్ట్రిబ్యూటర్లకు చెందిన కొందరు కృత్రిమంగా టికెట్స్ ఎక్కువ అమ్ముడు పోయినట్టు చెప్పమని మమ్మల్ని స్పందించారు. అటువంటి అనైతిక పనులకు పాల్పడం” అని సినిమా షోస్ కాన్సిల్ చేశారు…
ఇండియాను రెప్రజెంట్ చేయడానికి అనేక అంశాలున్నాయి. కానీ వీళ్ళు కులాన్ని, మతాన్ని, లేకి తనాన్ని చూజ్ చేసుకున్నారు… వీళ్ళ ఉద్యోగాలు చేయడానికి, చదువుకోవడానికి, బెటర్ ఫ్యూచర్ కోసం మాత్రమే పోయిన వాళ్ళు సఫర్ అవుతున్నారు……….. ఇదీ ఓ చోట కనిపించిన అభిప్రాయం…
Share this Article