Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శక్తిపీఠం… నాటి జ్ఞానపీఠం… శత్రువు చెరలోని ఈ గుడికి విముక్తి దొరికింది…

March 23, 2023 by M S R

కర్తార్‌పూర్ గురుద్వారా కారిడార్ గురించి మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఊదరగొట్టింది అప్పట్లో… దేశవిభజన సమయంలో పాకిస్థాన్ పరిధిలోనే ఉండిపోయిన సిక్కుల ప్రముఖ గురుద్వారా అది… దాన్ని దర్శించుకోవడానికి వీసాలు, పర్మిట్లు అవసరం లేకుండా ఓ కారిడార్ నిర్మించాయి ఇరుదేశాలు… కానీ కశ్మీరీ హిందువులు కూడా అంతే పవిత్రంగా, ప్రముఖంగా భావించే మరో ముఖ్యమైన గుడి గురించి మాత్రం మీడియాకు ఏమాత్రం పట్టలేదు…

అది నిశ్శబ్దంగా ఉగాది పర్వదినాన ప్రారంభమైంది… హోం మంత్రి అమిత్ షా దాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించాడు… అసలు ఏమిటీ గుడి..? అది శారదా పీఠం… హిందువులు పవిత్రంగా భావించే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి… ఆక్రమిత కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉంటుంది… అక్కడికి వెళ్లాలంటే శ్రీనగర్ నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది… అసలు ఎందుకు ఈ ప్రముఖ గుడి హిందువుల చేజారింది… పాకిస్థానీ ముష్కరుల చేతుల్లో అవమానాలకు గురైంది…?



కశ్మీర్ ఫైల్స్..! అంటే చరిత్రపుటల్లో దాగి ఉన్న నరమేధాలు, పైశాచిక ఊచకోతలు, మతోన్మాదాలే కాదు… వర్తమాన పరిణామాలు కూడా..! ఇండియాను మతం పేరిట రెండు ముక్కల్ని చేయాలని అనుకున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఎవడో ఓ అర్ధ నిపుణుడికి (సగం) బాధ్యత ఇచ్చింది… మ్యాప్ మందు పెట్టుకుని అడ్డంగా తోచిన గీతలు గీసి, ఇది పాకిస్థాన్, ఇది ఇండియా అన్నాడు… శాస్త్రీయ విభజన అయితే కదా… ఈలోపు ఇటువాళ్లుఅటు, అటువాళ్లుఇటు… లక్షలాదిగా వలస…

Ads

లక్షల మంది మరణించారు… మతం పేరిట తెగనరుక్కున్నారు ఇటూఅటూ… పాలక స్థానాల్లో జరిగే చెత్తా నిర్ణయాల దుష్ఫలితాలు చరిత్రలో ఎన్నో రికార్డయ్యాయి… ఇదీ ఒకటి… అదలా ఉంచేస్తే… సిక్కులు పవిత్ర యాత్రాస్థలిగా భావించే కర్తార్‌పూర్ పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయింది… కశ్మీరీ పండిట్లు అంతే యాత్రాస్థలిగా పరిగణించే శారదా పీఠం దుర్గతి మరోలా తయారైంది… పాకిస్థాన్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించేసుకుంది… ఇప్పుడా పీఠం పాక్ అధీకృత ప్రాంతంలోనే ఉంది… పేరుకు ఆజాద్ కశ్మీర్…

మధ్యలో ఓ వాస్తవాధీనరేఖ… ఆ రేఖకు పది కిలోమీటర్ల దూరంలో ఈ సరస్వతి గుడి… ప్రతి కశ్మీరీ పండిట్‌కు మూడు పవిత్రయాత్రాస్థలాలు… ఒకటి ఈ శారదా పీఠం, రెండు అమరనాథ్, మూడు అనంతనాగ్ దగ్గర మార్తాండ సూర్య దేవాలయం… ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ శారదా పీఠాన్ని హిందువులు శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణిస్తారు… సతీదేవి కుడిభుజం కిందపడ్డ ఈ స్థలం ఓ శక్తిపీఠమే కాదు, జ్ఞానపీఠం కూడా… యూనివర్శిటీ… అప్పట్లో 5 వేల మంది దాకా చదువుకునేవాళ్లు… నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసినీ | త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యాదానంచ దేహి మే || అని కశ్మీరీ పండిట్లు శారదా దేవిని కశ్మీర్ పురవాసినిగా రోజూ ప్రార్థిస్తుంటారు… ఇదీ ఈ పీఠం ప్రాధాన్యం… 2300 ఏళ్ల నాటి గుడి ఇది…

sharada

కానీ ఏమైంది..? కశ్మీరీ పండిట్లను మతం పేరిట నరమేధంతో మన దేశం నుంచే బయటికి తరిమేశారు కదా… అనేక గుళ్లు కూలిపోయాయి కదా… ఇక పాకిస్థాన్ అదుపాజ్ఞల్లో ఉన్న గుడి సంగతేమిటో విడిగా చెప్పాలా..? అప్పటికే శిథిలావస్థలో ఉన్న గుడి, పట్టించుకునేవాళ్లు లేక, వచ్చిపోయేవాళ్లు లేక మరింత శిథిలమైపోయింది… భారతీయులకు ప్రవేశం లేదు… చాన్నాళ్లు కొట్లాడాక వీసాలు ఇచ్చేది పాకిస్థాన్… కానీ గుడి దగ్గరకు పోనిచ్చేవాళ్లు కాదు… 70 ఏళ్లుగా దీపం పెట్టింది లేదు, పసుపుకుంకుమ పూసింది లేదు…

sharada

కర్తార్‌పూర్ కారిడార్ పేరిట పంజాబ్ సిక్కులు తమ యాత్రాస్థలికి వెళ్లడానికి ఓ అవకాశం ఏర్పడింది… సేమ్, అలాగే శారదా కారిడార్ కావాలనే డిమాండ్ పెరిగింది… ఏళ్ల తరబడీ పాకిస్థాన్ తేలికగా తీసుకుంది… కారణాలు ఏమైనా గానీ… పాకిస్థాన్ అంగీకరించింది… ఎల్వోసీ దగ్గర తంగ్‌దార్ సెక్టార్‌లోని తెత్వాల్ గ్రామంలో కారిడార్ ఏర్పాటు పనులకు ఏడాది క్రితం భూమిపూజ నిర్వహించింది శారదా యాత్ర టెంపుల్ కమిటీ… మరి పీఠం పునరుద్ధరణ, భక్తులకు కనీస సౌకర్యాల ఏర్పాటు, దర్శనీయ సౌలభ్యం మాటేమిటి అంటారా..?

ఆరోజు తొలి అడుగు పడింది కదా… చకచకా పనులు సాగిపోయాయి… ఇప్పుడు ఆ గుడిలోపల కొత్తగా కొలువైన శారదా దేవి స్వరూపం ఇది…

శారద

అసలు ఆక్రమిత కశ్మీర్‌లో అడుగుపెట్టడమే గగనం… అలాంటిది అక్కడ ఓ గుడి పునర్నిర్మాణం, అదీ అష్టాదశ శక్తీపీఠాల్లో ఒకటైన పాత జ్ఞానపీఠాన్ని పునరుద్ధరించడం విశేషమే… కాకపోతే ఇండియన్ మీడియాకు మాత్రం విశేషం కాదు… తిరుమలకు ఫలానా జడ్జి వచ్చాడు, ఇదుగో ఫోటో, ఫలానా వీఐపీ వచ్చాడు, ఇదుగో ఫోటో, ఫలానా మంత్రిణి సందర్శించింది, ఇదుగో ఫోటో అని రోజూ అపురూపంగా అచ్చేసుకునే ‘వెధవ మీడియా’కు ఇదెందుకు కనిపించలేదు..?! అదే విశాఖ స్వరూపుడు నెలకొల్పుకున్న శారదాపీఠం వార్తలయితే, చినజియ్యరుడి రియల్ ఎస్టేట్ ఆశ్రమం వార్తలయితే కళ్లకద్దుకుని ప్రచురిస్తారు..!! తరించిపోతారు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అధికారానికి మాత్రం మేం… పోరాటాలకు, కేసులకు బడుగులు…
  • కృష్ణ గారడీ ఏమీ లేదు… అంతా పక్కా టైం పాస్ పల్లీబఠానీ…
  • రోడ్ల గుంతలా మజాకా… పెద్ద పెద్ద కంపెనీల్నే తరిమేస్తున్నయ్…
  • సేమ స్టోరీ… సేమ్ ప్రచారం… సేమ్, అప్పట్లో శ్రీదేవి… ఇప్పుడు దీపిక…
  • గెలిచానని నవ్వనా… ఏడ్వనా… మనసా కవ్వించకే నన్నిలా..!
  • ఫాఫం నాగార్జున..! బిగ్‌బాస్ లాంచింగ్ షో రేటింగుల్లో బిగ్గర్ ఫ్లాప్..!!
  • ట్రంపుడి సుంకదాడికి విరుగుడు ఉంది… మోడీయే గుర్తించడం లేదు…
  • రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions