.
ముందుగా కోరా జాన్ పోస్టు చదవండి ఓసారి… ఇది తంగలాన్ – నెట్‌ఫ్లిక్స్ వివాదం
పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ లీడ్ రోల్‌లో వచ్చిన తంగలాన్ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
Ads
సెప్టెంబర్ 20న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ 16 రోజులు గడిచినా.. ఇంకా ఆ సినిమా ఓటీటీలోకి రాలేదు. దీనికి కారణం.. తంగలాన్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, నెట్‌ఫ్లిక్స్ మేనేజ్‌మెంట్ మధ్య వివాదమే కారణమట. సినిమా రిలీజ్‌కు ముందు రూ.35 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదిరింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లు రాకపోవడంతో.. నెట్‌ఫ్లిక్స్ ముందు అనుకున్న మొత్తం కంటే తక్కువ చెల్లిస్తామని చెప్పిందట. కానీ నిర్మాతలు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదని తెలిసింది.
నెట్‌ఫ్లిక్స్ రూ.35 కోట్లు కాకుండా.. రూ.20 కోట్లు మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో నిర్మాణ సంస్థ ఒప్పుకోలేదట. చివరకు రూ.25 కోట్లు ఇస్తామని నెట్‌ఫ్లిక్స్ చెప్పినా.. ముందు అనుకున్న మొత్తం ఇస్తేనే.. రైట్స్ ఇస్తామని అన్నదట. రెండు పార్టీలు కూడా పంతంతో ఉండటంతో.. తంగలాన్ ఓటీటీ రిలీజ్ లేట్ అవుతూ వస్తోంది.
అవసరమైతే వేరే ఓటీటీకి ఇస్తాం.. అంతే కానీ తక్కువ మొత్తానికి మాత్రం నెట్‌ఫ్లిక్స్‌కు ఇవ్వమని నిర్మాతలు చెప్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ మాత్రం రూ.25 కోట్లు ఇస్తాం. లేదంటే డీల్ క్యాన్సిల్ అన్నదట… ఇదీ సంగతి…
విషయం ఏమిటంటే… వేరే ఓటీటీ యాప్స్ కూడా ఆ సినిమా మీద పెద్ద ఇంట్రస్టు చూపించడం లేదు… ఇదే కాదు, ఓటీటీలు సినిమాల కొనుగోళ్లకు ఎడాపెడా ఖర్చు పెట్టడం మీద పునరాలోచనలో పడ్డాయి… సౌత్ సినిమాలే కాదు, భారీగా ఆశలు పెట్టి, భారీ రేట్లకు కొన్న హిందీ సినిమాలు కూడా చూసేవాడు లేకపోవడంతో చేతులు మూతులు కాల్చుకున్నాయి…
స్టార్ క్యాస్ట్ చూసి, భారీ ఖర్చుల లెక్కలు విని… విపరీతమైన వ్యూయింగ్ మినట్స్ నమోదవుతాయని భ్రమపడి అనేక సినిమాల విషయాల్లో ఓటీటీలు భంగపడ్డాయి… అందుకే మొదట్లో కుదిరిన ఒప్పందాలకూ కట్టుబడి ఉండటం లేదు… వాడి దయ, నిర్మాత ప్రాప్తం అన్నట్టుగా మారింది… థియేటర్లలో విడుదలైన పలు సినిమాలు ఓటీటీలకు రావడం లేదు… ఓటీటీలు గతంలోలాగా ఆతృతను ఏమీ ప్రదర్శించడం లేదు…
మరోవైపు శాటిలైట్ టీవీ హక్కుల విషయంలోనూ పెద్దగా గిరాకీ లేదిప్పుడు… సీరియళ్లు చూస్తున్నారు తప్ప ప్రేక్షకులు టీవీల్లో సినిమాల్ని చూడటం మానేశారు… అందులో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు కూడా టీఆర్పీలు లేవు, చూసేవాడు లేడు… మరోవైపు ఓటీటీల మొరాయింపు… థియేటర్లలో దోపిడీతో ప్రేక్షకులు చాలామంది వాటి జోలికి వెళ్లడమే మానేస్తున్నారు… మంచి మౌత్ టాక్ వచ్చిన సినిమాలు వస్తే తప్ప జనం కదలడం లేదు…
కొన్ని సినిమాలకు వందల కోట్ల కలెక్షన్లను పత్రికల్లో, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నా ఎక్కడెక్కడ ఏ బయ్యర్ ఎంత మునిగిపోయాడో ఫిలిం సర్కిళ్లలో అందరికీ తెలుసు… ఒకవైపు సత్యం సుందరం… మరోవైపు దేవర… టేస్టున్న జనం అంతిమంగా సత్యం సుందరానికే వోటేశారు… ఇది కొరడాల శివ కాలం కాదు… ఇది ప్రేమ కుమార‌్‌ల కాలం… ఇలా భిన్న కోణాల్లో ఇండియన్ సినిమా ఓ సంధి దశలో ఉన్నట్టుగా ఉంది..!!
Share this Article