.
ఈ అలవాటు ఇండియాలోని అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లోనూ ఉన్నదే… ఎడాపెడా కలెక్షన్ల తప్పుడు ఫిగర్‌ను ప్రచారం చేసుకోవడం… కాకపోతే మరీ తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువ… ప్రస్తుతం సూర్య సినిమా రెట్రో కూడా అంతే…
గతం వేరు, ఏం చెప్పుకున్నా నడిచింది… ఇప్పుడు సోషల్ మీడియా ఎప్పటికప్పుడు భాషల వారీగా కలెక్షన్ల వివరాల్ని పూసగుచ్చినట్టు చెబుతూనే ఉంది ప్రేక్షకులకు…. మరిక అడ్డగోలు కలెక్షన్ల వివరాలు ప్రచారం చేసుకుంటే నవ్వుకోరా ప్రేక్షకులు..?!
Ads
అధికారికంగా ప్రకటించిన వివరాల్నే పరిగణనలోకి తీసుకుంటాాం అని ఆదాయపు పన్ను శాఖను చెప్పమనండి ఒక్కసారి… అన్నీ ఆగిపోతాయి… ప్రేక్షకులను ఫూల్స్ చేయడం ఎందుకు అసలు..?
ఇప్పుడు దీనివల్ల ఏమొస్తుంది…? కలెక్షన్లు పెరగవు… శాటిలైట్, ఓవర్సీస్, డిజిటల్ రైట్స్ సొమ్ము కూడా ఈ ప్రచారాల్ని బట్టి రాదు… మరెందుకు ఈ ఫేక్ కలెక్షన్ల ప్రచారాలు..?
చూశారుగా.., 235 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రచారం… నిజానికి ఈ సినిమా మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది… ఏదో తమిళంలో సూర్య ఇమేజ్ కారణంగా, ఫ్యాన్స్ కొంతమేరకు ఆడించిందే గానీ… తెలుగు, హిందీల్లో డిజాస్టర్… మరి 235 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి..?
హిందీలో అయితే ఇప్పటికి పదిరోజులుగా రోజూ జస్ట్ లక్ష రూపాయల కలెక్షన్లు… మొత్తం హిందీ వసూళ్లే 18 రోజుల్లో 35 లక్షలు… అంటే ఎంత డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు.,. తెలుగులో కాస్త సూర్యకు ఇమేజీ ఉంది కాబట్టి ఇక్కడైనా మెరుగు అనుకుంంటే ఇక్కడా సూపర్ ఫ్లాప్…
3, 4 రోజులుగా ఇక్కడా రోజుకు లక్షే… మొత్తంగా 5.54 కోట్లు … తమిళం సంగతి చూస్తే 3 రోజులుగా 10 నుంచి 12 లక్షలు మాత్రమే… సో, ఇక థియేటరికల్ రన్ ముగిసినట్టే… అన్ని రైట్స్ డబ్బులు, ప్లస్ ఈ వసూళ్ల వాటాలు కలుపుకున్నా సరే, ఓవరాల్‌గా నిర్మాతకు భారీ నష్టాలే ప్లస్ బయ్యర్లకు కూడా… నిర్మాతల్లో సూర్య కూడా ఉన్నాడు…
అసలు ఎన్నేళ్లయింది సూర్య హిట్ చూసి..? ఆ కంగువా దెబ్బకు ఠారెత్తిపోయాడు… ఇప్పుడు దానిపైనే రెట్రో దెబ్బ…!! అన్నట్టు ఇదే యాడ్ ట్వీట్‌లో కలెక్షన్ల అంకె దగ్గర ఓ స్టార్ గుర్తు పట్టి చిన్న డిస్‌క్లెయిమర్ పెట్టారు… థియేటరికల్ ప్లస్ నాన్- థియేటరికల్ రెవిన్యూ అని..! ఐనా సరే డౌటే… అదేదో బ్రేకప్ ఫిగర్ ఇస్తే బెటరోయ్..!!
Share this Article