ఆమధ్య ఓ సంఘటన… తుంటి చికిత్సకు హాస్పిటల్‌లో చేరిన కేసీయార్‌ను పరామర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లాడు కదా… ఆ ప్లేసులో రేవంత్ ఉండి ఉంటే కేసీయార్ వెళ్లి ఉండేవాడా అనేది వేరే ప్రశ్న… కానీ తను లోపలకు వెళ్తున్న క్రమంలో ఎవరో ఓ పేషెంట్ అటెండెంట్ ‘‘అన్నా రేవంతన్నా’’ అని పిలిచింది…
తను వెంటనే వెనక్కి తిరిగి, ఆమె వద్దకు వెళ్లి, ఆమె బాధ ఏమిటో కనుక్కుని, ఉపశమనం చర్యలకు ఆదేశించి వెనుతిరిగాడు… ఆ వీడియో వైరల్ అయ్యింది… అదొక చిన్న ఇన్సిడెంటే కావచ్చుగాక కానీ సదరు నాయకుడి ఇమేజీని పెంచుతుంది… వ్యక్తిగత పాజిటివ్ ఇమేజీ పెరిగితే అది ప్రజల్లో ఆ నాయకుడి మీద భరోసాకు కూడా దోహదపడుతుంది…
ఈ క్రమంలో సాక్షిలో వచ్చిన ఓ వార్త ఆకర్షించింది.,. చిన్న వార్తే, కానీ రాయాల్సిన వార్తే… సీఎంకు గుర్తుచేయదగిన వార్తే… పోనీ, నాడు రేవంత్‌తోపాటు ఉన్న నాయకులైనా చదివి స్పందించాల్సిన వార్తే… ముందుగా ఆ వార్త ఇదుగో…
Ads
మార్చి 18న హాథ్ సే హాథ్ జోడో పేరిట రేవంత్‌రెడ్డి యాత్ర చేస్తూ కామారెడ్డి మండలం, చిన్నమల్లారెడ్డి ఊరిలో భిక్కనూరు లక్ష్మి అనే మహిళ ఇంటి దగ్గరకు వెళ్లాడు… తన ఇల్లు కూలిపోయిందనీ, ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వలేదని ఆమె చెప్పుకుంది… కూలిన ఇంట్లో ఎలా కాపురం చేస్తున్నారంటూ రేవంత్ తమ ప్రభుత్వం రాగానే ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చాడు… ఆమె చేతులెత్తి మొక్కింది…
సరే, కాంగ్రెస్ సర్కారు వచ్చింది, ఆ రేవంతుడే సీఎం అయ్యాడు… ఆమెకు సొంతిల్లు కట్టిస్తే బాగుంటుందని సదరు వార్త చెబుతోంది… గుడ్… ఐతే అలా ఇళ్లు కూలిపోయినవాళ్లు, అసలు ఇళ్లే లేనివాళ్లు బోలెడు మంది… స్థూలంగా ఓ పాలసీ తీసుకుని, ఇళ్లు లేని పేదలు ఉండకూడదనే భావనతో ప్రయారిటీ వర్క్ చేయడం అవసరమే… కేసీయార్ సర్కారు పాలనలో డబుల్ బెడ్ రూం అనేది ఓ ప్రహసనం… అదెలా భ్రష్టుపట్టిపోయి చివరకు 5 లక్షలకు, మరీ చివరకు సొంత జాగా ఉంటే 3 లక్షలు ఇస్తామనే వరకూ తీసుకుపోయాడు కేసీయార్…
ఈ స్థితిలో ఇందిరమ్మ ఇళ్లు అనేది రేవంత్ ఎదుట పెద్ద టాస్క్… ఇదుగో ఇలాంటి లక్ష్మిలకు తన పాత హామీ నెరవేర్చి చూపిస్తే, అది ప్రజల్లోకి పాజిటివ్‌గా వెళ్తే… రేవంత్‌కు వ్యక్తిగత ఇమేజీ పెరగడమే కాదు, తను ఇళ్ల విషయంలో ఏదైనా సీరియస్ వర్క్ చేస్తాడనే నమ్మకాన్ని కూడా కలిగించినట్టవుతుంది… ఇప్పుడు కాంగ్రెస్‌లో సీనియర్ల బెడదను తట్టుకుని నిలబడాలన్నా ఇలా పర్సనల్ ఇమేజీ పెంచే స్టోరీలు, చర్యలు అవసరమే… తన యాత్రలో ఇలా ఎవరెవరికి ఏమేం హామీలు ఇచ్చాడో… రేవంతన్నా… హామీలు మరవకు…! చిన్న చిన్న చర్యలే పెద్ద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తాయి… యాదికి ఉంచుకో…!!
Share this Article