.
కేటీయార్ స్నేహితుడు కేదార్… దుబయ్‌లో డ్రగ్స్ తీసుకుని చనిపోయాడు… ఆ ఫోరెన్సిక్ రిపోర్టూ తెలంగాణకు తెప్పించాం… గతంలో వైట్ చాలెంజ్ విసిరితే పారిపోయాడు,కేటీఆర్ ఉత్త గంజాయి బ్యాచ్, కేటీఆర్ చుట్టూ ఉండేవాళ్లు కూడా డ్రగ్స్ తీసుకుంటారు…
డ్రగ్స్ తీసుకునే వాడితో నేనేం మాట్లాడతాను… డ్రగ్స్ పై మాట్లాడకుండా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంది కేటీఆర్…. అని సీరియస్ కామెంట్లు చేయడమే కాదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… అసలు తెలుగుదేశం లోకేషుతో రహస్యంగా ఎందుకు కలుస్తున్నావో తెలంగాణ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేశాడు…
Ads
రేవంత్, కేటీయార్ పరస్పర ఆరోపణల పర్వం కొత్త మలుపు తిరుగుతోంది… మేం మీలాగా ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదు, కానీ లోకేష్ తో నీ గుప్త సంభాషణలు ఏమిటో చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు…
- ‘‘డ్రగ్ అడిక్ట్ కేటీయార్ లోకేష్‌ను రహస్యంగా ఎందుకు కలిసినట్టు..? అర్ధరాత్రి లోకేష్‌తో డిన్నర్ మీటింగ్ ఎందుకు..? కేటీఆర్ లోకేష్‌ను మూడుసార్లు కలిశాడు, లోకేష్‌ను చీకట్లో కలవాల్సిన అవసరం ఏముంది..?’’ అని మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డాడు…
బీఆర్ఎస్ పదే పదే చంద్రబాబు, రేవంత్ గురుశిష్య సంబంధం, బనకచర్లను గురుదక్షిణ కింద ఇస్తున్నాడు అని ఆరోపణలు చేస్తోంది కదా, అవన్నీ సరే, ముందుగా తెలుగుదేశం లోకేష్‌తో నీ గుప్త బంధాల మాటేమిటని ఎదురుదాడికి దిగాడు రేవంత్ రెడ్డి…
- తెలుగుదేశం అంటేనే మండిపడుతూ… ఆ పార్టీ తెలంగాణ నుంచి పారిపోయేదాకా ప్రయత్నించింది కదా బీఆర్ఎస్, అప్పట్లో టీఆర్ఎస్… అవునూ, అలాంటి పార్టీ వారసనేత లోకేష్‌ను బీఆర్ఎస్ వారసనేత కేటీయార్ ఎందుకు చీకటి సంప్రదింపులు జరుపుతున్నట్టు అని ఓ బలమైన రాయి విసిరాడు రేవంత్ రెడ్డి ఆ క్యాంపులోకి..?
అసలు కేసీయార్‌ను కాపాడటానికి కిషన్ రెడ్డి ఎందుకు తాపత్రయపడుతున్నాడు..? మేం ఖచ్చితంగా కేంద్రంతో కలిసి పనిచేస్తాం… రాష్ట్ర సమస్యల పరిష్కారం కొరకు ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కి వెళ్ళాలా అనడిగాడు రేవంత్ రెడ్డి…
.
‘‘తెలంగాణను దోచుకున్న కేసీఆర్ను, కేసీఆర్ కుటుంబాన్ని వదలం… కేసుల విచారణ చట్టపరంగా జరుగుతుంది… వెయిట్, విలన్ల అరెస్టులు క్లైమాక్సులో కదా జరిగేది… ఢిల్లీకి 33 – 34 సార్లు మాత్రమే వచ్చా, సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ రావడం తప్పా, HCA అక్రమాలపై ఈడి కు ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, లోతుగా దర్యాప్తు చేయాలని ఈడి జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ కు TCA ఫిర్యాదు…
కేసిఆర్ దోపిడీపై విచారణ జరుపుతాం, విభాగాల వారీగా దర్యాప్తులు జరుగుతున్నాయి, రాత్రికి రాత్రి చర్యలు తీసుకోలేం… కవితకు వాళ్ళ ఇంట్లోనే విలువ లేదు… 2018 లో కెసిఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 23 శాతానికి పరిమితం చేస్తూ చట్టం తెచ్చారు… దాన్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది… ఆ ఆర్డినెన్స్ నే గవర్నర్కు పంపాం… 2014 కు ముందు స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి…
- గుజరాత్ యూపీ మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి, తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించాలని అడగాలి….. అటు బీజేపీని, ఇటు బీఆర్ఎస్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి తాజా బ్యాటింగు ఇదీ…
గవర్నర్‌కి పంపించిన ఆర్డినెన్స్ , రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన చట్టం రెండూ వేరు వేరు… కేంద్రం, బీజేపీ కేసీయార్ కుటుంబాన్ని కాపాడుతున్నాయి… గొర్రెలు, ఫార్ములా-ఈ రేస్ కేసు, జిహెచ్ఎంసి ఆఫీసర్ శివ బాలకృష్ణ కేసులో ఈడి ఎందుకు అరెస్టులు చేయడం లేదు..? కేటీఆర్, కెసిఆర్, హరీష్ రావులను ఈడి ఎందుకు అరెస్టు చేయడం లేదు..? అని బీజేపీని కూడా లాగుతున్నాడు రేవంత్ రెడ్డి…
తుమ్మిడి హట్టి అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తాను… ఫోన్ ట్యాపింగ్ కథేమిటో హైకోర్టు తేలుస్తుంది.,. అని వెల్లడించాడు…
Share this Article