.
నేను అసెంబ్లీకి రమ్మంటే… కేటీయార్ ఏదో పెద్ద డ్రామా ప్లే చేసి, ప్రెస్ క్లబ్‌లో బైఠాయించి, ఏమోయ్, రేవంతూ, వేర్ ఆర్ యూ, పిరికోడా, రావేం అని డైలాగులు వదిలాడు కదా… దానికి రేవంత్ రెడ్డి జబర్దస్త్ బదులు ఇచ్చాడు…
ఏ పరుషమైన డైలాగులూ లేకుండా…. స్ట్రెయిట్‌గా తన బాణాన్ని డిఫరెంటుగా, ప్లాన్‌డ్‌గా కేసీయార్‌కే గురిపెట్టాడు… (కేటీయార్‌ను గుర్తించం అన్నట్టుగా...)
నిజంగా కేసీయార్ స్పందన చూడాలి ఇప్పుడు… నాట్ కేటీయార్, నాట్ కవిత, నాట్ హరీష్, నాట్ ఎట్సెట్రా ఎట్సెట్రా… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ డ్రామా ఏమిటో మీ ఫామ్ హౌజులోనే ఆడదాం, రెడీయా అంటున్నాడు…
Ads
- ఓ వాట్సప్ వార్త చదవండి ముందుగా…
కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్… మీ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాం… మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటాం…
రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది… ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా సభలో వినిపిద్దాం… మీరు శాసనసభ సమావేశాలు పెట్టాలని ఎప్పడు స్పీకర్ కు లేఖ రాసినా మేం సిద్ధం… మీ హయాంలో, మా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ పెడదాం…
సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా … ఎలాంటి గందరగోళం లేకుండా… ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది… కెసిఆర్ గారూ, మీరు రండి.. ఎక్స్పర్ట్స్ ను పిలుద్దాం… స్టేక్ హోల్డర్స్ ను పిలుద్దాం… అర్ధవంతమైన చర్చ పెడదాం…
మీ ఆరోగ్యం సహకరించకపోతే… తారీఖు చెప్పండి… ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేను మంత్రుల బృందాన్ని పంపుతా… మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం… (నువ్వు ఫామ్ హౌజ్ వదిలి ఎలాగూ ప్రజాజీవితంలోకి రావడం లేదు కదా అనే వెక్కిరింపు దాగుంది, జనం తీర్పు చెప్పిన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదు అనే నింద కూడా ఉంది ఇందులో...)
కాదూ, కూడదూ, నేను కూడా రావాలంటే… ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగే ప్రజాప్రతినిధుల సమావేశానికి రావడానికి నేను కూడా సిద్ధం… వాస్తవాలను ప్రజలకు అందించడమే మా ఉద్దేశం… తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టం…(బనకచర్ల విషయంలో జగన్‌తో కలిసి కేసీయార్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టాడని కదా కాంగ్రెస్ విమర్శ...)
తెలంగాణ హక్కుల విషయంలో దేవుడు ఎదురొచ్చినా నిటారుగా నిలబడి పోరాడుతాం… కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మా మంత్రులు అందరం వచ్చి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాము… ఎందుకంటే క్లబ్బులు, పబ్బులు మాకు అలవాటు లేదు… (ప్రెస్ క్లబ్బును పరోక్షంగా ప్రస్తావిస్తూ...)
చిన్నప్పటి నుంచి కూడా అలవాటు లేదు….. సీ ఎం రేవంత్ రెడ్డి
ఇక దీనికి బీఆర్ఎస్ కౌంటర్ ఏమిటో చూడాల్సి ఉంది… ఫాఫం, ఈ మధ్యలో బీజేపీ ఎలా స్పందించాలో తెలియక… బనకచర్లపై ఏం మాట్లాడితే చంద్రబాబుకు ఎంత కోపం వస్తుందో తెలియక కిందామీదా పడుతోంది…!! పనిలో పనిగా రేవంత్ తనతోపాటు వచ్చే పలువురు జర్నలిస్టుల పేర్లు కూడా చెబితే ఇంకా బాగుండేది..!!
Share this Article