.
మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా… ఏ యూనివర్శిటీ క్యాంపసులో తన మీద కూడా దాడి జరగడానికి ప్రయత్నాలు జరిగాయో…. ది గ్రేట్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు అని పెయిడ్ కీర్తనల ఘోషల బాహుబలి నాయకుడు కూడా ఓయూ అంటేనే భయపడిపోయాడో…
ఎస్, అక్కడే రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం హోదాలో ఘనస్వాగతం పొందాడు… డెస్టినీ… కేసీయార్ శుక్రమహర్దశ కొడిగట్టిందీ అనడానికి తార్కాణం… ఎస్, 2012లో ఇదే కేసీయార్ అనుకూల జేఏసీ రేవంత్ రెడ్డి అండ్ టీమ్ మీద దాడికి ప్రయత్నం…
Ads
దొరికిన నాగం, చెప్పు దెబ్బలతో దాడి… బట్, సీన్ కట్ చేస్తే… సోకాల్డ్ జాతిపిత కేసీయార్ ఎప్పుడూ ఉస్మానియా యూనివర్శిటీలోకి అడుగుపెట్టడానికే సాహసించలేదు… భయం… జస్ట్, ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం అనివార్యం అయితే తప్ప…
ఈరోజు రేవంత్ రెడ్డి వెళ్లాడు,.. ఆ విశేషాలు కూడా చెప్పుకోవాలి… ఎందుకంటే..? ఎవరు తన స్పీచ్ డ్రాఫ్ట్ చేశారో గానీ… పలు కోణాల్లో అల్టిమేట్… మొన్న క్రెడా స్పీచుకన్నా హైలైట్… కేసీయార్‌కు చురకలు, వాతలు… కేసీయార్ పెయిడ్ క్యాంపు కిక్కుమనేట్టు లేదు…
‘‘ఉస్మానియా యూనివర్సిటీ నుండే స్వాతంత్ర్యం కోసం పీవీ ఇక్కడి నుండే వందే మాతరం పాడారు… శివరాజ్ పాటిల్ నుండి పీవీ వరకు చాలా మంది దేశంలో కీలకంగా ఉన్న వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ నుండే వచ్చారు…’’ ఈ మాటలే కాదు…
- ‘‘నేను మళ్లీ ఆర్ట్స్ కాలేజికి వస్తా… ఒక్క పోలీస్ కూడా లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెడతా… ఆ రోజు ఒక్క పోలీస్ కూడా ఉండొద్దు… ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్పనివ్వండి… ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లో ఉండొద్దు…’’ అదిరిపోయింది… కేసీయార్‌కు చేతకాని సవాల్…
ఈ మాటలతో ఉద్యోగులు లేచి నిలిచి చప్పట్లు కొట్టడంతో మారుమోగిన ఠాగూర్ ఆడిటోరియం… ‘‘ఏం కావాలో రాసి పెట్టుకొండి, అక్కడే జీవోలు ఇస్తా…’’ కేసీయార్ గనుక ఈ లైవ్ చూసి ఉంటే… ఏమైపోయేవాడో… ఎక్కడైతే తన ప్రహసన నిరాహారదీక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు పోటెత్తాయో, ఏ క్యాంపస్ తనకు మింగుడుపడలేదో… అక్కడ తన ప్రత్యర్థి, తను ఏమాత్రం సహించని రేవంత్ రెడ్డి ఘనస్వాగతాలు పొందడం… ఇస్సీ దుస్సహం…
- ‘‘ప్రొఫెసర్ కోదండరామ్ పదవి సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్టేయించారు… 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీగా కోదండరాంను పంపిస్తా… ఢిల్లీ వరకు వెళ్లి కుట్రలు చేశారు…’’ చాలా ఇంపార్టెంట్ స్టేట్‌మెంట్ ఇది… సరే, పనిలోపనిగా కంచె గబ్చిబౌలి ల్యాండ్స్‌పై బీఆర్ఎస్ సాగించిన కుట్రల గురించీ ప్రస్తావించాడు, బట్, అదిక్కడ అప్రస్తుతం…
‘‘ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు… కొంతమంది రాజకీయ నాయకులకు పదవులు పోయాయన్న ఆవేదన ఉంటుంది, వాళ్ల కొడుకులను ఏదో చేద్దామనుకుంటే ఏదో అవుతున్నారని బాధ ఉంటది…’’ (కేసీయార్ వారసత్వంపై పరోక్షంగా కామెంట్స్…)’……. ఇలా సాగిపోయింది ప్రసంగం…
- అరె, నన్ను యూనివర్శిటీలోకే అడుగు పెట్టడానికి భయపడేంత పరిస్థితులు ఉండేవి… నేను కలలో కూడా సహించలేని రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి, నాకు వెళ్లడానికి ధైర్యం లేని చోట తను ఇంత హైలైట్ అవుతాడా… అయ్యారే…. గ్రహాలు మరీ ఇంత వ్యతిరేకంగా సంచరిస్తున్నవేమిటి..? ఇస్సీ…!!……
ఈ డైలాగ్స్ ఏ దుర్యోధన చక్రవర్తివో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా..!!
Share this Article