మల్లారెడ్డి అరెస్టు తప్పదా..? ఇదీ ఈరోజు వార్త… మొన్న టీటీడీపీలోకి మల్లారెడ్డి..? మొన్నామధ్య మరో వార్త… మొత్తానికి మల్లారెడ్డి రోజూ వార్తల్లో ఉంటున్నాడు… నెగెటివ్‌గానే..! చెప్పుకోవడానికి, తలుచుకోవడానికి పాజిటివ్ ఏమందని ఆయన జీవితంలో..?
పూలమ్మిన, పాలమ్మిన … అంటూ శుద్ధపూస కబుర్లు చెప్పే మల్లారెడ్డి యవ్వారాలు జస్ట్, అలా పైపైన తవ్వితేనే బోలెడు కబ్జాలు బయటికొస్తున్నాయి… నిజానికి మొత్తం ఆయన ఆస్తులపై జుడిషియల్ కమిషన్ గనుక వేస్తే వాళ్లే ఆశ్చర్యపోయేన్ని కతలు బయటికొస్తాయేమో…
ఆయనకు ఎన్ని ఎకరాల భూములున్నాయో, ఎన్ని ఆస్తులున్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయనకే గుర్తుండవు… ఇద్దరుముగ్గురు చార్టర్డ్ అకౌంటెంట్లు కుస్తీలు పట్టాలేమో కొన్నిరోజులు…! ఆయన ఇంజినీరింగ్, ఇతర కాలేజీలకు ఎఐసీటీఈ, ఎంసీఐ తదితర అపెక్స్ బాడీల నుంచి పర్మిషన్లు ఎలా తెచ్చుకోగలిగారనే అంశం మీద స్టార్ట్ కావాలి దర్యాప్తు…
Ads
అబ్బే, ఏ రాజకీయ నాయకుడు శుద్ధపూసండీ… మల్లారెడ్డి ఒక్కడినే నిందించడానికి అంటారా..? కరెక్టు… అట్లయితే వోకే… కానీ వీసమెత్తు హుందాతనం కూడా కనిపించదు మనిషిలో… మాటతీరు ముఖ్యం కదా… ఇదే మల్లారెడ్డి ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డిని పబ్లిక్ డొమైన్‌నలో తొడగొడుతూ బూతులే తిట్టాడు…
మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి వాళ్లిద్దరూ రాజకీయ ప్రత్యర్థులే కావచ్చుగాక… కానీ మరీ ఆ భాషేమిటి..? అక్కడ మండినట్టుంది రేవంత్‌రెడ్డికి… అక్రమాస్తుల రక్షణ కోసం హఠాత్తుగా ఇతర నగర నాయకుల్లాగే మల్లారెడ్డి కూడా అర్జెంటుగా కాంగ్రెస్‌లోకి జంపాలని నానా ప్రయత్నాలూ చేశాడు… రేవంత్ నా దోస్తే, నాకు దగ్గరే అని మొదలెట్టాడు… ఇక్కడ రేవంత్ మోకాలడ్డేసరికి కర్నాటకకు వెళ్లి డీకే శివకుమార్‌ను కలిశాడు… ఏమైంది..?
రేవంత్ వద్దంటుంటే చేర్చుకుంటారా..? సో, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.,. కేసీయార్‌ను కలిసి కూడా అయ్యా, ఏమీ అనుకోకు, బీఆర్ఎస్‌లో కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రేవంత్ తాటతీసే ప్రమాదం కనిపిస్తోంది, ఆల్రెడీ మొదలుపెట్టాడు, నేను వెళ్లిపోతాను అని చెప్పుకున్నాడు… కానీ కుదర్లేదు… ఈలోపు ఒకటీరెండు బిల్డింగుల మీదకు బుల్ డోజర్లు పంపించిన రేవంత్ రెండుమూడు జాగాలపై రెవిన్యూ వాళ్లతో సర్వే చేయించి మల్లారెడ్డి అక్రమాల్ని ఫిక్స్ చేశాడు… ఇప్పుడు భూకబ్జా కేసు కూడా నమోదైంది…
ఏకంగా ఏడు సెక్షన్లు… సరే, తను కోర్టుకు వెళ్తాడు, కొట్లాడతాడు… ఈలోపు రేవంత్ ఇంకా తవ్వకాలు జరిపించి, మరింత ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తాడు… తొడగొట్టి తిట్టి మరీ సవాల్ చేసిన మల్లారెడ్డి కథేమిటో తేల్చుకోవాలని రేవంత్ అనుకుంటుంటే… తను టీటీడీపీలోకి వెళ్లే ప్రయత్నాల్లో పడ్డాడు… ఏదో ఒక పార్టీ అని కాదు, అటు నుంచి నరుక్కొచ్చే వ్యూహం… టీటీడీపీలో చేరితే చంద్రబాబు నుంచి రేవంత్‌కు చెప్పించుకోవచ్చు అని..!
మల్లారెడ్డి మరిచిపోయిందెక్కడా అంటే..? రేవంత్‌కు చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాలు… తను వద్దంటే చంద్రబాబు మల్లారెడ్డిని పార్టీలోకి తీసుకుంటాడా..? పోనీ, తీసుకున్నా తనతో తెలంగాణలో టీడీపీ పార్టీకి వచ్చే పెద్ద ఫాయిదా ఏముంది..? మహా అయితే తెలంగాణలో పార్టీకి ఏమైనా ఆర్థికలాభం… కానీ టీటీడీపీలో అసలు ఇప్పుడు ఎవరు మిగిలారని..? ఐనా ఆల్రెడీ ఏపీలో అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు, తనకు డబ్బుకు ఢోకా ఏముంది..?
పోనీ, బీజేపీలో చేరితేనే తనలాంటోళ్లకు భలే సెక్యూరిటీ కదా అనుకుని బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తాడూ అనుకుందాం… అసలే మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఆల్రెడీ పాగా వేసేశాడు… తనకు అక్కడ మల్లారెడ్డితోనే పోటీ… పైగా కాబోయే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అంటున్నారు… తను రానిస్తాడా…? సో, మల్లారెడ్డి పాట్లు రోజూ వార్తల్లోకి ఎక్కుతున్నాయి ఇలా..!!
Share this Article