Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో కేసీయార్… నో జగన్… టాప్-25 జాబితాలో రేవంత్ రెడ్డి…

March 29, 2026 by M S R

.

ఎవరెంత ఏడుస్తున్నా… ప్రత్యర్థులు ఎంత బురద జల్లుతున్నా… ఎదిగేవాడు ఎదుగుతూనే ఉంటాడు… ఉదాహరణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ‘ఐఈ100’ పేరిట దేశంలోని టాప్ 100 అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను ప్రచురించింది… అందులో 25 వ ప్లేసులో రేవంత్ రెడ్డి పేరు ఉంది…

తను కాంగ్రెస్‌లో చేరిన తరువాత వేగంగా సాగింది ప్రస్థానం… పీసీసీ అధ్యక్షుడు కావడం…, ఎవరూ ఓడించలేరు అనే భ్రమల్ని ఛేదించి, కేసీయార్‌ను ఇంటికి పంపించేసి, ప్రజాజీవితానికే దూరం చేయడం.., తను ముఖ్యమంత్రి కావడం…, ఇదెంతకాలం, కొన్నాళ్లేలే అనే ప్రత్యర్థులు- పార్టీ సీనియర్ల కలల్ని భగ్నం చేయడం… చకచకా… శుక్రమహర్దశ…

Ads

ఇప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ టాప్ 25 లో చోటు… ఈ టాప్ 25 జాబితాలో రాహుల్ గాంధీ తరువాత కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి..! విశేషమే… ఎఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఎక్కడో 43 వ ప్లేసులో, ప్రియాంక వాద్రా 35 వ ప్లేసులో ఉన్నారు… సిద్ధరామయ్య 40 ప్లేసు, డీకే శివకుమార్ వంటి నేతలు పత్తా లేరు…

రేవంత్

అక్కడికే వస్తున్నా… ఈ లిస్టులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు గానీ… తెలంగాణ బాపు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపితగా స్వీయ భుజకీర్తుల కె. చంద్రశేఖర్ రావు పేరు గానీ లేవు… లేవు… కేసీయార్ అసలు ప్రజాజీవనంలోనే లేడు… స్వీయ బందిఖానా… డెస్టినీ అంటే ఇదే…

ఒకప్పుడు బీజేపీయేత పార్టీల మొత్తం ఎన్నికల ఖర్చును భరిస్తానని సిద్ధపడి… పార్టీ పేరులోని ఆత్మను చంపేసి, బీఆర్ఎస్ అని జాతీయ ముసుగు తొడిగి, ఏకంగా ప్రధానిని అయిపోతానని ఆశపడ్డ నాయకుడు తను… ఆయన పేరుకే దిక్కులేదు, ఇక కేటీయార్, హరీష్‌రావు, కిషన్‌రెడ్డిల పేర్లు అంటారా..? భలేవారే..!!

తను ముఖ్యమంత్రి కదా, సహజంగానే కొంత ఇన్‌ఫ్లుయెన్షియల్ గా కనిపిస్తాడు కదా, అందుకే ఈ జాబితాలో పేరుందిలే అని కొందరు ఎప్పటిలాగే కొట్టేసి, లోలోపల కుళ్లుకుని ఏడవొచ్చు గాక… కానీ ఈ టాప్ 100 జాబితాలో శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, శశిథరూర్, కేజ్రీవాల్ వంటి ఏ పదవుల్లో లేని నాయకులు కూడా ఉన్నారు… ఒవైసీ కూడా ఉన్నాడు… చివరకు రాజకీయంగా ఇంకా మొదలూమోక్షం లేని టీవీకే విజయ్ కూడా ఉన్నాడు…

ఏపీకి వస్తే… చంద్రబాబు నాయుడు టాప్ 25 జాబితాలో ఉన్నాడు… 13 వ ప్లేసు… కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీయే మెజారిటీ మార్క్ చంద్రబాబు చేతుల్లో ఉంది కాబట్టి ప్రభావశీలుర జాబితాలోకి వచ్చి చేరాడు, లేకపోతే కేసీయార్‌లాగే..! మరి నితిన్ కూడా సేమ్ చంద్రబాబులాగే ప్రభావశీలి కదా అంటారా..? తను ఎప్పుడైతే సీఎం పదవి త్యాగం చేసి, బీహార్‌ను బీజేపీకి అప్పగించేశాడో తన ‘పవర్’ స్థాయి పడిపోయింది…

ఈ జాబితాలో మరో పేరు పవన్ కల్యాణ్… అవును, టీడీపీ, బీజేపీ సంధానకర్త తను… నేరుగా తను పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ కాకపోవచ్చు… కాకపోతే కేంద్రంలో ఎన్డీయే మెజారిటీకి తను కూడా ఓ ఇరుసు… ఇంకా చాలా విశేషాలున్నయ్, అవి వేరే కథనంలో చెప్పుకుందాం వివరంగా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో కేసీయార్… నో జగన్… టాప్-25 జాబితాలో రేవంత్ రెడ్డి…
  • స్వామి పర్వర్షన్‌‌కు తోడుగా కిష్వర్ పైత్యం… మోడీని గోకుతున్నారు…
  • శిఖరాగ్రం నుండి శూన్యం వరకు… రేమండ్స్ విజయపథ్ ‘డెస్టినీ’…
  • శెట్టి గ్యాంగ్ కకావికలు… డబుల్ హేపీతో రష్మిక పకపకలు…
  • బ్రహ్మర్షి విశ్వామిత్ర … ఆకట్టుకోని ఎన్టీయార్ సొంత సినిమా…
  • మీడియా వార్ కాదు… ఇగో వార్… టీవీ5 Vs ఎన్టీవీ… నాయుడు Vs చౌదరి…
  • ఆట ఆడితే, ఆడిస్తే కోట్లు జలజలా రాలాలె… మేం అస్సలు ఆడం పో…
  • యుగాంతం..! విశ్వ వినాశనం దిశలో అమెరికా- రష్యా ప్రాక్సీ వార్..!!
  • మీరు క్రికెట్ ప్రేమికులా..? ఐతే తప్పకుండా ఓసారి చదవాల్సిందే…
  • ‘కోడి మెడ’..! ఒవైసీ చేతికి చిక్కుతుందా..? బెంగాల్ ముఖచిత్రమేంటి..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions