.
రేవంత్‌రెడ్డి పాలన మీద పట్టు సంపాదించినట్టే కనిపిస్తోంది… తను సీఎం అయిన మొదట్లో అధికార యంత్రాంగం మీద పట్టు లేదు, ఉన్నతాధికారగణం ఇంకా కేసీయార్ పాలనే ఉన్నట్టుగా ఫీలవుతున్నారు అనే విమర్శలు వచ్చేవి…
కానీ కీలకమైన పోస్టుల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల పనితీరు తనే మదింపు చేసుకుని, ఓ అంచనాకు వచ్చి, ఎవరెవరిని ఏయే పోస్టుల్లోకి పంపించాలో నిర్ణయం తీసుకున్నాడు… తెలంగాణ పోలీస్ శాఖలో కీలకమైన, సీనియర్ అధికారులందరికీ అనూహ్యమైన బదిలీలు జరిగాయి… ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి…
Ads
ముందుగా తను నమ్మిన, తనను నమ్మిన శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించి… ఇప్పుడు ఆ డీజీపీ పోస్టింగ్ కోసం పోటీపడిన 1991 బ్యాచ్ సీవీ ఆనంద్‌ను కూడా నిరాశపరచలేదు… ఏకంగా హోం స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా నియమించాడు… (ఇంకా సర్వీస్ ఉంది కదాని కన్విన్స్ చేసి ఉంటాడు రేవంత్)
బదిలీల్లో మరో ముఖ్యమైనది ఇప్పటిదాకా ఆర్టీసీ ఎండీగా ఉన్న 1996 బ్యాచ్ సజ్జనార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వేయడం… ఆ ఆర్టీసీ ఎండీ పోస్టులోకి 1997 బ్యాచ్ నాగిరెడ్డిని వేశారు… తను ఇన్నాళ్లూ ఫైర్ సర్వీసులో ఉన్నాడు…
మరో ఇంట్రస్టింగు బదిలీ స్టీఫెన్ రవీంద్రది… సివిల్ సప్లయిస్ కమిషనర్ కమ్ ఎక్స్ అఫిషియో సెక్రెటరీగా వేయడం… మరో సీనియర్ ఐపీఎస్ 1994 బ్యాచ్ శిఖా గోయల్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా వేశారు… ఇన్నాళ్ల సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ పోస్టులో ఇక అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు…
కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ స్థానంలో (ఇన్నాళ్లూ శివధర్‌రెడ్డి పోస్టు) 1997 బ్యాచ్ విజయకుమార్‌ను వేశారు… ఇప్పటిదాకా హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్న రవిగుప్తాను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు… తను 1990 బ్యాచ్… హోం గార్డ్స్‌లో ఉన్న 1995 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ స్వాతి లక్రాను ఎస్‌పీఎఫ్ డీజీగా బాధ్యతలు అప్పగించారు…
1998 బ్యాచ్ విక్రమ్ సింగ్ మాన్ ను లా అండ్ ఆర్డర్ నుంచి డిజాస్టర్, ఫైర్‌కు బదిలీ చేయడం మీద మాత్రం నెగెటివ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి… తనను ఇంకేదైనా ప్రయారిటీ పోస్టులోకి మారిస్తే బాగుండేది… ఇన్నాళ్లు లా అండ్ ఆర్డర్‌లో ఉన్న 1995 బ్యాచ్ మహేశ్ మురళీధర్ భగవత్‌ను ఏడీజీ పర్సనల్ పోస్టు కూడా అప్పగించారు… 1996 బ్యాచ్ సీఐడీ చీఫ్ చారు సిన్హాకు ఏసీబీ బాధ్యతలు అప్పగించారు… 1996 బ్యాచ్ అనిల్ కుమార్‌కు గ్రేహౌండ్స్, అక్టోపస్ బాధ్యతలు ఇచ్చారు… ఇంకొన్ని బదిలీలు కూడా జరిగాయి…
ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలనేది సీఎం లెక్కల మీద ఆధారపడి ఉంటుంది… సరే, ఈ బదిలీలు, బాధ్యతల మీద భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక… కానీ ఒకేసారి సీనియర్ ఐపీఎస్ మూకుమ్మడి బదిలీలతో ఆఫీసర్ సర్కిళ్లలో ఓ కలకలం..!
ఇదేరోజు కొన్ని ఐఏఎస్ బదిలీలు కూడా జరిగాయి… అందులో ఒకటి ఆసక్తికరంగా అనిపించింది సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను టీఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రెటరీగా బదిలీ చేయడం… ఝా గురించి వేరే కథనంలో చెప్పుకుందాం..!!
Share this Article