శ్రీరాంచంద్రా… బహుపరాక్… ఆహా ఓటీటీ వాళ్లు ఏదో ఓ టైం చూసి నీకూ హ్యాండిస్తారేమో అని ఒక్కసారి ఆయన్ని హెచ్చరించాలని అనిపిస్తోంది… అదేమిటి..? పాపం, బిగ్‌బాస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు, టాప్ ఫైవ్‌లో నిలిచాడు, ఓడినాసరే, దాదాపుగా అంతిమ విజేత తనే అనిపించుకున్నాడు… ఆ బిగ్‌బాస్ టీం ఫిక్సింగ్ యవ్వారమో, షణ్ముఖ్‌తో బెడిసిన వ్యవహారమో గానీ మూడో ప్లేసులో ఆగిపోయాడు… మధ్యలో ఇస్తానన్న 20 లక్షలూ వదిలేశాడు… మొదటి నుంచీ తన ఆటతీరుతో, మాటతీరుతో ప్రశంసలు పొందాడు… హమీదాతో క్యూట్ లవ్ ట్రాక్ బాగానే నడిపించాడు… అలాంటిది ఆహా వాళ్లు తనను ఎందుకు హ్యాండిస్తారు అంటారా..? ఏమో చెప్పలేం… అదసలే చంచలమైన ఓటీటీ… ఎందుకంటే..?
ఇదే నెలలో మొదటి, రెండో వారాల్లో ఇదీ వార్త… రేవంత్ హోస్టుగా తెలుగు ఇండియన్ ఐడల్ షో స్టార్ట్ కాబోతోంది, 26 నుంచి ఆడిషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అనేది దాని సారాంశం… అసలు సోనీ వాడు తమ లోగోను యథాతథంగా వాడుకోవడానికి అంగీకరించాడా..? లేక తెలుగు అని యాడ్ చేసేసి, ఆహా వాళ్లే ఓ ఇమిటేషన్ సరుకును నిర్మిస్తున్నారా అనే డౌటనుమానం కూడా ప్రేక్షకుల్లో ఉంది కదా… ఎందుకనగా, సోనీ వాళ్లు 2004 నుంచీ ఈ షో నడిపిస్తున్నారు… 12 సీజన్లు అయిపోయినయ్… 13వ సీజన్‌కూ రెడీ అయిపోతున్నారు… తెలుగులోనూ సోనీ లివ్ ఓటీటీకి కూడా కంటెంట్ జోరుగా, భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు ఈమధ్య… ఈ స్థితిలో తమ ప్రతిష్టాత్మక మ్యూజిక్ షో లోగోను ఆహా వాళ్లకు ఎందుకు ఇస్తారు..? సరే, అదెలా ఉన్నా, ఇప్పుడు మరో వార్త…
Ads
నో, నో, రేవంత్ కాదట, శ్రీరాంచంద్ర హోస్టట అనేది తాజా వార్త… అసలు ఆడిషన్స్ కూడా పూర్తి గాకుండానే హోస్ట్ మార్పిడా..? ఏమైంది..? అన్విత అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది, మొన్న 24న నిశ్చితార్థం కూడా అయిపోయింది… త్వరలోనే పెళ్లి… ఈలోపే ఈ షాక్..? నిజానికి రేవంత్, శ్రీరాంచంద్ర ఇద్దరూ మెరిట్ ఉన్న సింగర్సే… ఇద్దరూ అదే ఇండియన్ ఐడల్ పోటీల్లో విజేతలు… శ్రీరాంచంద్ర 2010లో అయిదో సీజన్ ఇండియన్ ఐడల్ షో విజేత… 2016లో తొమ్మిదో సీజన్‌లో రేవంత్ విజేత… మరి రేవంత్ ఎందుకొద్దు..? శ్రీరాంచంద్రే ఎందుకు ముద్దు..?
రేవంత్‌కు హ్యాండిచ్చిన చంచలబుద్ధులు శ్రీరాంచంద్రకూ ఇవ్వొద్దని ఏముంది..? అదీ డౌటు… వాస్తవానికి సింగర్స్ పరిస్థితి పెద్దగా బాగాలేదు ఈమధ్య… సినిమా పాటలకు పోటీ విపరీతం, కచేరీలే ఆధారం, కానీ కరోనా దెబ్బకు అవీ జరగడం లేదు… డబ్బు కోసమే శ్రీరాంచంద్ర బిగ్‌బాస్ హౌజులోకి వచ్చాడనేది నిజం… రేవంత్ కూడా ఈమధ్య కొన్ని టీవీ షోలలో కనిపిస్తున్నాడు… చానెళ్లలో కూడా హోస్టుగా లేదా యాంకర్‌గా లేదా జడ్జిగా చాన్స్ కావాలనుకుంటే ఈటీవీ మినహా ఏ చానెల్‌లోనూ ఈ మ్యూజిక్ షోలు క్లిక్ కావడం లేదు, పైగా అక్కడా ప్రదీప్ వంటి ముదురు యాంకర్ల పోటీ… జడ్జిలుగా సునీత, శైలజ, చంద్రబోస్ తదితరులే కనిపిస్తుంటారు… ఈటీవీలో కూడా ఎస్పీ బాలు కొడుకు చరణ్ ఆంతరంగిక టీమే ఆర్గనైజ్ చేస్తోంది… ఇక ఈ ఇండియన్ ఐడల్ తెలుగు ఇమిటేషన్ సరుకు ఏమేరకు క్లిక్కవుతుందో చూడాలి… శ్రీరాంచంద్రను ఏమేరకు ఎంకరేజ్ చేస్తారో కూడా చూడాలి… జడ్జిలు కూడా ఎవరో తేలాల్సి ఉంది..!!
Share this Article