అవంతిక… అరబిందో… ఈ కంపెనీల పేర్లు బీఆర్ఎస్ పార్టీని ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడేశాయి… అవి ఏమిటి..? గతంలో రెండు సింగరేణి ప్రాంత బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీలకు ఇచ్చింది… అదీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే… ఇప్పుడేమో అదే బీఆర్ఎస్ బొగ్గు గనులను ప్రైవేటు వాళ్లకు అప్పగించొద్దు అంటూ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మీద ఆరోపణలు చేస్తోంది…
ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలా… ప్రతిపక్షంలో ఒకలా… కేటీయార్ చేస్తున్న విమర్శలకు సాక్షాత్తూ రేవంత్ రెడ్డే ‘‘మరి మీ హయాంలో ఆ రెండు ప్రైవేటు కంపెనీలకు బొగ్గు గనులకు కట్టబెడుతుంటే మీరే కదా సహకరించింది… అప్పుడు మేమే కదా తీవ్రంగా అభ్యంతరపెట్టింది… గుర్తులేదా..? గనులే కాదు, ఔటర్ రింగ్ రోడ్డును కూడా అమ్ముకున్న మీరు కూడా మాట్లాడతారా..?’’ అని ఫైర్ కావడంతో బీఆర్ఎస్ నుంచి జవాబు లేకుండా పోయింది…
ఇలా సింగరేణి ప్రాంత బొగ్గు గనుల్ని వేరే ప్రైవేటు కంపెనీలకు వేలం ద్వారా అప్పగిస్తూ వెళ్తే… మన సింగరేణి వట్టిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతున్నాడు… ‘‘40 వేల మంది ఉన్న సంస్థ చివరకు ఏ 500 మందితో మిగిలిపోయే ప్రమాదం ఉంది… కొత్త చట్టం ప్రకారం సింగరేణికి రిజర్వేషన్ ద్వారా బొగ్గు గనుల్ని అప్పగించే చాన్సుంది… కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయాలి, రాష్ట్ర బీజేపీ, ప్రస్తుతం గనుల మంత్రిగా కిషన్ రెడ్డే ఉన్నందున ఆ పని చేయాలి’’ అనేది తన మాటల సారాంశం… నిజమే…
Ads
ఈ విమర్శలకు కిషన్ రెడ్డి దగ్గర కూడా జవాబు లేదు… సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం వేలం తప్పడం లేదనీ, కాకపోతే ఈ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకూ లబ్ది అని చెబుతున్నాడు… నేనూ తెలంగాణ బిడ్డనే, హైకమాండ్‌తో మాట్లాడతాను అంటున్నాడు తప్ప ఈ గనుల వేలాన్ని సంబంధిత మంత్రిగా తనే స్టార్ట్ చేశాడు… ఆల్రెడీ గనుల్ని ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టడం ఎప్పుడో స్టార్టయింది… ఇప్పుడు కొనసాగుతోంది… సింగరేణికి నష్టం కలగనివ్వను అనే కిషన్‌రెడ్డి మాట జస్ట్, నోటి మాట కోసమే..!!
మరి సింగరేణిలో మన రాష్ట్ర ప్రభుత్వం వాటాయే ఎక్కువ… కోల్ ఇండియాది తక్కువ వాటా… మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయవచ్చు..? ఇతర ప్రైవేటు కంపెనీలతోపాటు వేలంలో సింగరేణి సంస్థ కూడా పాల్గొనాలి, పోటీపడాలి, అదే సమయంలో సింగరేణికి గనులను రిజర్వేషన్ పద్దతిలో అప్పగించాలనే పోరాటాన్ని, ప్రయత్నాన్ని కొనసాగించాలి… మరి నిన్న బట్టి విక్రమార్క చేసిందీ అదే కదా…
సో, ఇక్కడ బీఆర్ఎస్ విమర్శలకే నిజానికి వాల్యూ లేకుండా పోయింది… సరిపడా బొగ్గు గనులు లేకపోతే సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో పడినట్టే… అందులో సందేహం లేదు… ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పు, బొగ్గు గనుల కేటాయింపుతోపాటు సింగరేణి కూడా కొత్త సవాళ్లకు సిద్ధం కావాల్సిందే… ఇతర ప్రాంతాల్లో గనుల వేలంలోనూ పాల్గొనాలి… దక్కించుకోవాలి…
బొగ్గు వెలికితీతలోనే కాదు, ఇతర మైనింగు యాక్టివిటీస్‌లోకి కూడా డైవర్సిఫై కావల్సిందే… మైనింగులో తనకున్న సామర్థ్యం, నైపుణ్యం, అనుభవం ముందు ప్రైవేటు కంపెనీలు నిజానికి పోటీపడలేవు… ప్రభుత్వం కూడా తాడిచర్ల, శ్రావణపల్లి వివాదాలేమిటో… ఈ అవంతికలు, అరబిందోలు ఎవరో, ఏమేం బ్లాకులు ఎలా దక్కాయో… ఓ సమగ్ర వివరణను ప్రజల ఎదుట పెట్టి, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా, ఒక పార్టీగా తన వైఖరి ఏమిటో స్పష్టంగా జనానికి చెప్పాల్సిన అవసరమూ ఉంది…!!
పసలేని విమర్శతో గాయిగత్తరకు బీఆర్ఎస్ పార్టీ ట్రై చేస్తున్న సమయంలోనే… ఆ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మీద 300 కోట్ల మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఈడీ దాడులు చేసి బుక్ చేయడం యాదృచ్ఛికమే గానీ పరిగణనలోకి తీసుకోవాల్సిన విశేషం… మైనింగ్ అక్రమార్కులే మైన్ల వేలం మీద విమర్శలు చేయడం వింతగా లేదూ..!!
Share this Article