ఒకరు… పేరు వద్దు… అమెరికాలో ఓ కొలువు… తెలంగాణ వ్యక్తి… యువరాజు కనెక్షన్ ఏదో దొరికింది… ఓ సంఘం పెట్టాడు… అమెరికాలో తెలుగు వాళ్ల పేరిట కులాలవారీ, ప్రాంతాలవారీ బోలెడు సంఘాలు… ఏం చేస్తారు అనడక్కండి, అదో భ్రమపదార్థం… టాటా అనే పేరు వస్తుందని ఆ సంస్థ అభ్యంతరం చెబితే పేరు మార్చాడుట… అంతా, తను ఏది చెబితే అదే… యువరాజే అండగా నిలబడ్డాక ఎదురేముంది..? ఆటా, టాటా, బాటా, నోటా, పాటా, వేటా, తూటా, కాటా… ఏ పేరైనా పెట్టుకోవచ్చు…
యువరాజు గారు అమెరికా వెళ్లినప్పుడల్లా రాచమర్యాదలు, ఆడంబరాలు, అట్టహాసాలు… యువరాజు గారు సంతుష్టులయ్యారు… ఎంకరేజ్ చేశారు.., సహజమే కదా, ఆ పదేళ్లూ అంతే కదా… ఈ అమెరికన్ సామంతుడు చెలరేగిపోయాడు…
పోతే పోయాడు… తన కంపెనీలో పనిచేసే ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు… దీని మీద పెద్ద రచ్చ… అసలే ఓ గుడి పేరిట, ఓ రాజకీయ పార్టీకి హవాలా మార్గంలో విరాళాలు పంపించడం మీద బోలెడు చర్చ జరుగుతోందట అమెరికా తెలుగు సర్కిళ్లలో…
Ads
ఈ నేపథ్యంలో ఆ వివాహిత ఓ ప్రముఖ తెలుగు చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రసారం గాకుండా బోలెడు ప్రలోభాలు, రాయబేరాలు… ఆ ప్రముఖ దేశోద్ధారక చానెల్ అంటేనే అది కదా… ప్రసారం కాలేదు… (అప్పట్లో ప్రముఖ పొలిటిషియన్ కమ్ యూట్యూబర్ కూడా ఏదో వీడియో ఈ అమెరికన్ దొరవారి మీద చేసినట్టు గుర్తు…)
సరే, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా అంటారా..? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద టీంతో అమెరికా వెళ్తున్నాడు… నిజానికి ఒకవైపు కాంగ్రెస్ సీనియర్లు, మరోవైపు బీఆర్ఎస్,ఇంకోవైపు బీజేపీ అవకాశం కోసం పొంచి ఉన్న, అనగా కాచుకుని ఉన్న నేపథ్యంలో రేవంత్ పది రోజులపాటు రాష్ట్రం విడిచివెళ్లడం మీదే పలు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి… ప్రత్యర్థులు తమ అస్త్రాలకు పదును పెడుతున్నారని ప్రచారం బయట ఆల్రెడీ… కాంగ్రెస్ వైపు వస్తామని చెప్పిన కేరక్టర్లు కూడా పునరాలోచనలో పడుతున్నారట… ఐనాసరే, తను వెళ్తాడట… రేవంత్ కదా, ఓ సీతయ్య, ఎవరు చెప్పినా వినడు…
ఇప్పుడు మరో చర్చ ఏమిటంటే…? రేవంత్ వెళ్లగానే సదరు యువరాజు బినామీ అనుచరుడు కాస్తా కులం పేరు చెప్పుకుని ఇక్కడ కూడా అతుక్కుపోతాడా అని..!! అందుకే రేవంతుడు కాస్త ఇలాంటి వ్యక్తుల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలని అమెరికన్ తెలంగాణ సమూహం కోరుకుంటోందట… అబ్బే, తను వింటే కదా, ఎవరైనా చెప్పేది…
నిజానికి రాష్ట్రాల పాలకులు వెళ్తే పెట్టుబడులు రావడం అనేది ఓ పెద్ద మాయ… వాళ్లు వస్తారని, ఏదో చేస్తారని, జిల్లాల వారీగా ఏవో టీహబ్బులు పెడితే ఖజానా డబ్బు ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదని గతానుభవాలు చెబుతున్నాయి… సో, ఇలాంటి కులాలవారీ, గ్రూపులవారీ ట్రాపుల్లోకి పడకుండా జాగ్రత్తగా ఉండాల్సింది రేవంతే..!!
Share this Article