.
అసలు గవర్నర్ పర్మిషన్ కూడా ఇచ్చాడు… ఫార్ములా వన్ కేసులో కేటీయార్‌ను అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు… కేటీయార్ కూడా మానసికంగా ప్రిపేరయిపోయాడు… రోజూ యోగా చేసుకుని ఫిట్, స్లిమ్ అవుతాననీ, జైలులో వేసుకుంటే వేసుకొండని, బయటికి రాగానే పాదయాత్ర స్టార్ట్ చేస్తా అన్నాడు…
కానీ రేవంత్ రెడ్డి అరెస్టు జోలికి పోలేదు… భయం కాదట, సంకోచం కూడా కాదట… జస్ట్, కక్షసాధింపు వద్దులే అనుకున్నాడట… దేవుడే చూసుకుంటాడులే, ఎవరి పాపం వాళ్లదేలే అనుకున్నాడట… తనే చెబుతున్నాడు అసెంబ్లీలో… ఇలా…
Ads
మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే… వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు
చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు.
డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు
16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదు
లైట్లు ఆన్‌లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారు
ఉగ్రవాదినో, కరుడు గట్టిన నేరస్థుడినో బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు
వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు.. అంతకు అంతా అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నా
నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు
చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు
రాజకీయ కక్ష సాధింపులంటే మీవి, అయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు
నిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారు
కానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించాం..
ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించా
సొంత పార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా………. ఇదీ రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ఓ భాగం…
కేటీయార్ ఏమన్నాడంటే..? ‘‘రేవంత్ రెడ్డి ఏం పని చేసి జైలుకు వెళ్ళాడు..?
నేను కూడా ఉద్యమంలో వరంగల్ జైలుకు వెళ్ళాను
మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ పై డ్రోన్ పంపిస్తే ఊరుకుంటారా.
మీ భార్యనో, మీ బిడ్డో అక్కడ ఉంటే ఫోటోలు తీస్తే ఎలా ఉంటుంది
నాడు మా ఇళ్లపై ఎలా డ్రోన్ ఎగరేశారు..?
మా పిల్లలపై ఇష్టం ఇచ్చినట్లు మాట్లాడారు…
మైనర్ పిల్లలు అని చూడకుండా నా కొడుకు బిడ్డను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.
డ్రోన్ కేసులో మీరు జైలుకు వెళ్ళారు.
నాకు రంకు అంటగట్టి ఎలా పడితే అలా మాట్లాడారు అది మీ నీతా?
సో, డ్రోన్ ఎగరేస్తే 500 జరిమానా వేస్తారు గానీ ఒక ఎంపీని కక్షసాధింపుగా జైలులో అన్నిరోజులు నిర్బంధించారు అనేది రేవంత్ రెడ్డి ఆరోపణ, ఆవేదన… ఐనాసరే, నేను కక్షసాధింపు కోసమే, రివెంజ్ కోసమే ప్రయత్నించలేదనీ, దేవుడే చూసుకుంటాడులే అని వదిలేశాను అంటున్నాడు… కేటీయార్ అరెస్టు మీద క్లారిటీయా ఇది..? సరే…
కేటీయార్, కేసీయార్, హరీష్ రావు అక్రమాల్ని కూడా క్షమించేసి, వాళ్లను దేవుడే శిక్షిస్తాడులే అనేది నీ భావనగా అనుకోవచ్చా సార్..?! బారా ఖూన్ మాఫీ అన్నట్టేనా..?! మరి గవర్నర్ పర్మిషన్ దేనికి..? ఈ విజిలెన్స్ ఎంక్వయిరీలు ఏమిటి..? ఈ రకరకాల అంశాలపై విచారణ కమిషన్లు దేనికి..? ఏదో క్లారిటీ లోపిస్తోంది బాస్..?!
Share this Article