ఒక టీవీ స్క్రోలింగ్ చాలా ఆశ్చర్యపరిచింది… కేసీయార్‌ను నేడో రేపో డిశ్చార్జ్ చేస్తారని ఆ వార్త… హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ జరిగాక కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు రెస్ట్ అవసరం… కాకపోతే సర్జరీ జరిగాక 12 గంటల తరువాత వాకింగ్ చేయిస్తారనేది కరెక్టే కావచ్చు… కానీ మూణ్నాలుగు రోజుల్లోనే డిశ్చార్జా..? వాళ్ల యశోద హాస్పిటల్ వర్గాలే 6- 8 వారాల రెస్ట్ అని తమ మెడికల్ బులెటిన్‌లో పేర్కొన్నాయి కదా, మరి ఇదెలా..? మిరకిల్..!!
అంతేకాదు… ఆ స్క్రోలింగ్ నిజం కావచ్చు, కాకపోవచ్చు, ఏదో ఫేక్ అయి ఉండవచ్చు కూడా… కానీ అందులో పదే పదే ‘‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి’’ అని కేసీయార్ పట్ల సంబోధన ఉండటం మరో ఆశ్చర్యకరమైన పాయింట్… ఏ రిపోర్టరయినా సరే, చివరకు టీన్యూస్, నమస్తే తెలంగాణ జర్నలిస్టులైనా… కేసీయార్ పెంచి పోషించిన ఇతర మీడియా సంస్థల జర్నలిస్టులైనా ‘మాజీ ముఖ్యమంత్రి’ అనే అంటారు, లేదా సింపుల్‌గా కేసీయార్ అంటారు…
జాతిపిత, బాపు వంటి పదాల్ని జనం నిష్కర్షగా తిరస్కరించారు కదా, ఇక ఈ ‘‘తొలి ముఖ్యమంత్రి’’ అని మొదలుపెట్టారేమో… అది నిజమే, కానీ ఎక్కడా ఫస్ట్ సీఎం, థర్డ్ సీఎం, ఫిఫ్త్ సీఎం అని రాసుకోరు, రాయరు… జస్ట్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్… అంతే… సరే, ఈరోజు ఉదయం నుంచీ రేవంత్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది… అదీ ఆశ్చర్యం అనిపించింది…
Ads
A cute video from Telangana 😍
Revanth Reddy, the Chief Minister of Telangana & people calling him Revanth Anna ❣️ pic.twitter.com/BY5kPMoE1M
— Darshni Reddy (@angrybirdtweetz) December 10, 2023
యశోదా హాస్పిటల్‌కు కేసీయార్‌ను పరామర్శించడానికి రేవంత్ వెళ్లినప్పుడు… హఠాత్తుగా ఓ మహిళ ‘‘రేవంతన్నా, నీతో మాట్లాడాలన్నా…’’ అని పిలుస్తుంది… వెంటనే వెనుతిరిగిన రేవంత్ ఆమె దగ్గరకు స్ట్రెయిట్‌గా వచ్చేస్తాడు… ఒక్క రోజులో లక్ష రూపాయల బిల్లు అంటున్నారు, నువ్వు ఆదుకోవాలన్నా అని వేడుకుంటుంది… ఆయన వెంటనే వెంట ఉన్న ఓ అధికారికి ఇదేదో చూడాలని పురమాయిస్తాడు… నేనున్నాను కదమ్మా అని ఆమెకు భరోసా ఇస్తాడు…
వీడియో బాగుంది… ట్విట్టర్‌లో కనిపిస్తున్న ఆ వీడియో బిట్స్ ప్రధానంగా కాంగ్రెస్ ఫాలోయర్స్ ట్వీట్స్… పైగా రేవంతన్నా అనగానే వెంటనే ఆమె దగ్గరకు స్ట్రెయిట్‌గా వచ్చేసి, ఏమిటమ్మా అనడగడం నిజమే కావచ్చుగాక… కానీ హఠాత్తుగా చూసేవాళ్లకు ఆశ్చర్యం , అసాధారణం అనిపిస్తుంది… అలాగని అదేమీ ప్రిప్లాన్డ్ సంఘటన అన్నట్టుగా కూడా ఏమీ లేదు… నన్ను ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు అనే ఒకింత విస్మయం, తరువాత ఆ సౌండ్ వినిపించిన వైపు అడుగులు వేయడం వంటివేమీ లేవు… ఎవరో పిలుస్తారు అని తెలిసినట్టుగా వేగంగా స్పందించడమే విస్మయకరం…
ఆ దిగువన ఉన్న కామెంట్లలో ఒకాయన ‘‘ఆ టైమ్‌లో నేనక్కడే ఉన్నాను, రేవంత్ అంత వేగంగా స్పందించిన తీరు నేనే నమ్మలేకపోయా’’ అని రాసుకొచ్చాడు కూడా… ఒకవేళ రేవంత్ నిజంగానే అలా రియాక్టయ్యేవాడే అయితే తను సీఎం హోదాలో ఇండివిడ్యుయల్ ఇమేజీని ఇంకా పెంచుకునే చాన్స్ ఉంది… ఐతే ఇవన్నీ సీఎం అయిన కొత్తలో మాత్రమే, దీన్ని సస్టెయిన్ చేసుకోవాలి కదా అంటారా..? చూద్దాం… తనకూ వ్యక్తిగత మైలేజీ అవసరం కదా… లేకపోతే సీనియర్లు మింగేస్తారు అమాంతం…!!
Share this Article