.
రాహుల్ సిప్లిగంజ్ మంచి పాటగాడు… ఆ గొంతకు సరిపోయే కొన్ని మంచి పాటలు తనను వెతుక్కుంటూ వచ్చాయి… పాపులర్ అయ్యాడు… తన ప్రైవేటు ఆల్బమ్స్ బాగా క్లిక్కయ్యేసరికి సినిమాల్లోనూ చాన్సులు వచ్చాయి… సద్వినియోగం చేసుకున్నాడు…
పక్కా హైదరాబాదీ, ధూల్‌పేట… పాటలు రాస్తాడు, నటుడు కూడా… ఇప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు యూట్యూబులో విపరీతమైన ఆదరణ లభిస్తుందని చెప్పుకుంటున్నాం కదా… కానీ రాహుల్ సేమ్ ఫ్లేవర్ అదీ సిటీ డిఫరెంట్ ఫోక్‌తో పాడిన పాటలు 2013 నుంచే హిట్లు…
Ads
తెలుగు బిగ్‌బాస్-3 షోకి వెళ్లాక మరింత పాపులారిటీ వచ్చింది… ఆ షో విజేత కూడా… ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటను కాలభైరవతో కలిసి పాడాడు… పాట బ్లాక్ బస్టర్… రాసిన చంద్రబోస్‌కు, స్వరకల్పనకు కీరవాణికి ఆస్కార్లు వరించాయి… నిజానికి రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు క్రెడిట్స్ దక్కాల్సింది…
ఈ విమర్శ, ఈ అభిప్రాయం సర్వత్రా వినిపించింది… సో సో, సాహిత్యమే అయినా సరే… పాడిన గొంతుతో బలం వచ్చింది దానికి, కొరియోగ్రఫీ మరింత బలం… సరే, అప్పుడు జరిగింది అన్యాయమో కాదో పక్కన పెడితే… రాహుల్ సిప్లిగంజ్‌ది కులవృత్తి… ఎస్, మా వృత్తి అదేనని బిగ్‌బాస్ షోలోనే చెప్పినట్టు గుర్తు… గుడ్… చేసే పని, కుడు పెట్టే కులవృత్తి పట్ల కనబర్చాల్సిన గౌరవం అది…
నాటు నాటు పాట ఆస్కార్ దాకా వెళ్లొచ్చాక పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి 10 లక్షల బహుమతిని ఇచ్చాడు 2023లో… అంతేకాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోటి రూపాయలు ఇస్తామనీ ప్రకటించాడు… నిజానికి గద్దర్ అవార్డు తనను వరించాల్సింది… రేవంత్ రెడ్డీ అదే ఫీలయ్యాడు…
గద్దర్ అవార్డుల వేడుక సందర్భంగా తన మనసులో మాటను కూడా వెల్లబెట్టాడు… భట్టి విక్రమార్క గారూ, మనవాడికి ఏదైనా అవార్డు ప్రకటించి ప్రోత్సహించండీ అనడిగాడు అక్కడే… మీరే ప్రకటించండి అని భట్టి బదులిచ్చాడు… అప్పుడేమీ ప్రకటించకపోయినా… ఇప్పుడు బోనాల పండుగ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్‌కు గతంలో ఇచ్చిన హామీ మేరకు కోటి రూపాయల నగదు ప్రోత్రాహకాన్ని ప్రకటించాడు రేవంత్ రెడ్డి… మాట నిలుపుకున్నాడు…
నిజానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ సప్లిగంజ్ ను గోషామహల్ నుంచి పోటీ చేయించాలనుకుంది! కానీ, అతను సున్నితంగా తిరస్కరించాడు! కోటి రూపాయల నగదు పురస్కారం సరైన నిర్ణయం… రాహుల్ సిప్లిగంజ్ దానికి అర్హుడే..!!
Share this Article