Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీ, కేసీయార్, రేవంత్‌ల జాతకాలు ఏమిటి న్యూమరాలజీ ప్రకారం..?

September 4, 2024 by M S R

న్యుమరాలజీ ప్రకారం రేవంత్ రెడ్డి జన్మ సంఖ్య 8, డెస్టినీ సంఖ్య 8. ఈ భూమి మీద అత్యంత తక్కువ మందికి ఉండే కర్మ సంఖ్య ఇది. ప్రాచీన చైనా, ఈజిప్ట్, ఇండియా, రోమ్, కొరియా నాగరికతలని చూసినట్లయితే 8 సంఖ్యకి ఉన్న ప్రాధాన్యత తెలుస్తుంది. 8 సంఖ్య ప్రాధాన్యత తెలియాలన్నా పుణ్యం చేసుకొని ఉండాలి… 7 మహా సముద్రాల ఇవతల ఉత్తర ధ్రువం దగ్గర నాకు బాగా తెలిసిన వ్యక్తి జన్మ సంఖ్య 8, డెస్టినీ సంఖ్య 8.

8, 8 ఉన్న వాళ్ళకి పూర్తిగా కర్మ ప్రకారం నడుస్తుంది. వీళ్ళని కట్టకట్టి సముద్రంలో పడేసినా ఏది జరగాలో అదే జరుగుతుంది తప్పితే ఈ భూమి మీద కానీ, భూమి క్రింద పాతాళంలో ఉన్న వాళ్ళు కానీ, ఆకాశంలో ఉన్న వాళ్ళు కానీ చివరికి ముక్కోటి లోకాలలో ఎవరూ వీళ్ళని ఏమీ చేయలేరు, కారణం శని వీళ్ళ చుట్టూ, క్రింద, పైన అనునిత్యం ఉంటుంది. చేస్తే గీస్తే శని మాత్రమే వీళ్ళకి హాని చేయాలి కానీ ఇంకెవరూ ఏమీ చేయలేరు. వాళ్ళ అహంకారమే వాళ్ళ పతనానికి కారణం అవుతుంది తప్పితే నరమానవులు ఎవరి వలన వీళ్ళకి హాని జరగదు.

మిగతా వాళ్ళకి కలిసి వచ్చినట్లు వీళ్ళకి ఏదీ మామూలుగా కలిసి రాదు, బాగా కష్టపడాలి. ఎవరూ అనుభవించలేని కష్టాలు కూడా వీళ్లు అనుభవిస్తారు. వీళ్ళ పని పూర్తిగా అయిపోయింది అనుకునేంతగా అవుతుంది. ఎదుటి వాళ్ళకి వీళ్ళు సహాయం చేసిన కొద్దీ వీళ్ళు ఎదుగుతారు. అందుకే 8, 8 వాళ్ళు మంచి చేసినా, చెడు చేసినా ఫలితం అనుభవిస్తారు; వీళ్ళ శ్రమ, చెమటే వీరికి ఆయుధం. “నేను”, “నేనే” అన్న అహంకారం ఎక్కితే మాత్రం పతనం ప్రారంభమవుతుంది. వీళ్ళకి వీళ్ళే బలం, బలహీనత.

Ads

KCR కి ఒక 8 ఉంది. KCR జన్మ సంఖ్య 8. మోడీకి ఒక 8 ఉంది. మోడీ జన్మ సంఖ్య 8. అందుకే KCR బలం మామూలుగా ఉండదు, KCR ని ఎవరూ ఓడించలేదు. KCR మాత్రమే KCR ని ఓడించుకున్నాడు. మోడీ అయినా అంతే; ఆయన్ని ఆయన ఓడించుకోవాలి కానీ ఇంకొకరు అతన్ని ఓడించలేరు. 8 సంఖ్య వారికి కొన్ని డిఫరంట్ బలాలు ఉంటై, ఎవరికీ లేని కొన్ని డిఫరంట్ బలహీనతలు ఉంటై. ఇమాజనరీ పవర్ కూడా ఎక్కువ. అయితే అహం తలకెక్కితే మాత్రం వీళ్ళ పతనం ప్రారంభమయినట్లే.

ఒక్క 8 ఉంటే రేర్ పీస్. 8 మరియూ 8 ఉంది అంటే జీవితంలో వాళ్ళ మొఖం చూసినా కొంత పుణ్యం కలుగుతుంది ఎందుకంటే 8, 8 ఉన్న వాళ్ళు పూర్తిగా కారణ జన్ములు అని న్యుమరాలజీ చెప్తుంది.

ఈ ప్రపంచంలో ఉన్న ఏ న్యుమరాలజీ పుస్తకాన్ని అయినా చూడండి – 8 కర్మ సంఖ్య; జన్మ సంఖ్య 8, డెస్టినీ సంఖ్య 8 ఉన్న వాళ్ళు కారణ జన్ములు అని చెప్తుంది. అయితే వీళ్ళు సూర్యుడికి నమస్కరిస్తే మంచిది, ఏమైనా చెడు ఉంటే పోతుంది, కొంచెం కాదు కర్మ వలన చాలా చెడు ఉంటుంది.
సూర్య భగవానుడ్ని నమస్కరించటం వలన శని వలన ఉండే చెడు పోయి శని వలన వచ్చే మంచి జరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది.

మంచి చెడు పక్కన పెడితే శని దగ్గర ఉండి మరీ జీవిత సారాంశం వీళ్లకి అర్ధం అయ్యేటట్లు నేర్పిస్తాడు. అత్యంత లోతైన అగాధాలని చూస్తారు, అత్తంత ఎత్తైన శిఖరాలని చూస్తారు. చివరకి సాధారణ జీవితమే మేలు అనుకుంటారు.

సాధారణ మనుష్యుల్లాగా వీళ్ళకి ఉండదు, వీళ్ళకి ఉండే కష్టాలు మిగతా జనం ఎవరూ భరించలేరు. నా రాత ఇంతేనా, నా పని అయిపోయినట్లేనా అని అనిపిస్తుంది. దగ్గరికి వచ్చినట్లు వచ్చి చాలా మిస్ అవుతారు, చాలా కష్టాలు, నష్టాలు అనుభవిస్తారు. మిగతా జనం ఏమనుకుంటున్నారో అని చూస్తే వీళ్ళు బతకలేరు అన్ని కష్టాలు ఉంటాయి కానీ వీళ్ళని నడిపించేదే శని. చెమట, శ్రమ, బాగా కష్టపడితే కానీ దక్కవు. వీళ్ళది వీళ్ళకి కలిసి రాదు కానీ వీళ్ళ చుట్టూ ఉండే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. వీళ్ళు కూడా తమ చుట్టు పక్కల కొన్ని నంబర్స్ వాళ్ళని పెట్టుకుంటే మంచిది అని శాస్త్రం చెప్తుంది.

KCR సంఖ్య 8, మోడీ సంఖ్య 8 కాబట్టి ఇద్దరూ కలిస్తే మాత్రం… రేవంత్ వర్సస్ KCR & మోడీ హోరాహోరీగా ఉంటుంది. 8, 8 వర్సస్ 8 + 8 కాబట్టి. ఏది ఏమైనా ఏడు మహా సముద్రాల అవతల ఉత్తర ధ్రువానికి దూరంలో ఇంకో వ్యక్తి 8, 8 ఉన్నాడు అని ఈ రోజే తెలిసింది… – పూర్తి వ్యక్తిగత అభిప్రాయం (న్యుమరాలజీ ప్రకారం)……. జగన్నాథ్ గౌడ్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…
  • వంశీ, శ్రీలక్ష్మి, ఆంజనేయులు… వాళ్ల అనుభవాలు చెప్పే పాఠమేంటనగా…
  • రవితేజ సినిమా అయితేనేం… సూపర్ ఫ్లాప్, చివరకు టీవీల్లో కూడా…
  • రియల్ కల్‌ప్రిట్ పాకిస్థాన్ కాదు… దాని వెనుక అమెరికా ట్రంపు…
  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
  • *రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!
  • ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
  • బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!
  • ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions