.
హైదరాబాదులో మిస్ వరల్డ్ కంపిటీషన్స్… బయో ఆసియా సదస్సు… నిజంగా బీఆర్ఎస్ గనుక అధికారంలో ఉండి ఉంటే ఇలాంటి ఈవెంట్లను అద్భుతంగా వాడుకునేది… ప్రచారంతో హోరెత్తించేది… ఏపీలో ఇలాంటి ధూమ్‌ధామ్ ప్రచార వైఖరి చంద్రబాబు నుంచి కనిపిస్తుంది…
రేవంత్ సర్కారుకు బీఆర్ఎస్ ఉధృతదాడికి కౌంటర్లు ఇవ్వడమూ చేతకావడం లేదు… కనీసం పాజటివ్ ప్రచారమూ కనిపించడం లేదు… నిస్తేజంగా, నిర్లిప్తంగా, నిరాసక్తంగా… అబ్బే, ప్రచారానికి ఖర్చు దేనికి అంటారా..? తప్పు…
Ads
1) ప్రభుత్వానికి ఇమేజ్… 2) పాలకుడికి ఇమేజ్… 3) అన్నింటికీ మించి హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్… ఆమధ్య ఫార్ములా కేసు సమయంలో కేటీయార్ ఏమన్నాడు…? ఆ రేసులతో హైదరాబాదుకు మస్తు ఫాయిదా వచ్చింది అన్నాడా లేదా..? సరే, అందులో అతిశయోక్తులు ఉండవచ్చుగాక… కానీ ఎంతో కొంత నిజం ఉంది కదా…
మరి అంతర్జాతీయ ఈవెంట్లను కూడా వాడుకోలేని అసమర్థత దేనికి రేవంత్ సర్కారుకు..? డబ్బు లేదా..? అంతేనా..? దిక్కుమాలిన ఖర్చులు ఎన్నో పెడుతున్నారు కదా… అసలు ఇదే కాదు, ప్రచార వ్యయాన్ని ఎక్కడ, ఎలా సమర్థంగా వాడుకోవాలో ఈ సర్కారుకు ఏమాత్రం అర్థం కావడం లేదు…
ప్రభుత్వానికే పట్టింపు లేనప్పుడు మనకెందుకు తీట అనుకుని మెయిన్ స్ట్రీమ్ కూడా లైట్ తీసుకుంటోంది… అంతేకదా మరి..! ప్రచారం అనగానే పత్రికల్లో జాకెట్ యాడ్స్ ఇవ్వడం కాదు… పెద్ద పెద్ద హోర్డింగులు కాదు… ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయాలి క్రియేటివ్ మెథడ్స్‌తో… బజ్ అంటుంటాం కదా… అది…
మిస్ వరల్డ్ సంగతి కాస్త అటుంచితే… బయో ఆసియా సదస్సు మాత్రమే కాదు, ఫార్మాకు సంబంధించిన ప్రతి సదస్సుకు ఇంపార్టెన్స్ ఉంటుంది… ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్… ప్రపంచ ఫార్మా మార్కెట్‌లో 80 శాతం వాటా చైనాది… కీలకమైన API (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్)లలో, అంటే జనరిక్ మెడిసిన్స్ లేదా APIలలో, చైనా నుండి 80% షేర్ ఉంటుంది, ఇండియా నుండి 10% షేర్ వస్తుంది.., ప్రపంచంలో ఉన్న మిగతా 198 దేశాల నుంచి మిగతా 10% మాత్రమే ఉన్నాయి…
ఇండియాలో ఫార్మా హబ్ అంటే హైదరాబాదే… వేక్సిన్లు మాత్రమే కాదు, కీలకమైన డ్రగ్స్ అన్నీ ఇక్కడే ఉత్పత్తి… ప్రపంచవ్యాప్తంగా ఫార్మా కంపెనీల రెవిన్యూయే ఎక్కువ… హైదరాబాద్ కంపెనీల ఆధిపత్యం కూడా ఎక్కువే ఇండియన్ ఫార్మా మార్కెట్‌లో… ఈ ఇంపార్టెన్స్ రేవంత్ సర్కారుకు అర్థమైనట్టు లేదు…
కేసీయార్ హయాంలో చీటికిమాటికీ ఏవేవో ఊర్లూపేర్లూ తెలియని పత్రికలకు కూడా ఫస్ట్ పేజీ ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చేవాళ్లు మొదట్లో… సరే, అది పాలకుడి ఇమేజ్ కోసం వ్యయం, ప్రయాస… అది కరెక్టు కాదు… కానీ అవసరమైన సందర్భాల్లో కూడా ప్రచారం, బ్రాండ్ ఇమేజ్ కోసం సాగే బిల్డప్పులు లేకపోవడం కూడా కరెక్టు కాదు… ఐనా రేవంత్ రెడ్డి సర్కారుకు అంత ఆలోచన, దిశ, దశ ఉన్నాయా..?!
Share this Article