.
ప్రత్యర్థులపై మాటల దాడితో దూకుడుగా విరుచుకుపడటమే రేవంత్ రెడ్డికి అలవాటు కదా… కానీ నిన్న తన దాడి తీరు భిన్నంగా ఉంది… కేసీయార్ మీద విమర్శకు బలమైన వ్యంగ్యాన్ని దట్టించాడు… నిజం, ఎప్పుడూ సెటైర్ పేలినంతగా స్ట్రెయిట్ విమర్శ పేలదు…
మనం గతంలో రోశయ్య సెటైర్ల తీరు చూశాం కదా, తన వ్యంగ్యానికి ఎదుటోళ్లకు కూడా కాసేపు ఏం సమాధానమివ్వాలో అర్థం కాదు… అలా పడతాయి పంచులు… నిన్నటి రేవంత్ రెడ్డి వ్యంగ్యమూ ఆ బాటలోనే ఉంది… పరుషపదాల వాడకంకన్నా ఇది బెటరే… ఆ తిట్లు, పరుష పదాల భాషను ఆ కేటీయార్‌కు వదిలేస్తే బెటర్…
Ads
నిన్న రేవంత్ ఏమంటున్నాడంటే.. ‘‘కేసీయార్‌కు వేరే జైలు శిక్ష దేనికి..? తనే స్వచ్చంద జైలు శిక్ష వేసుకున్నాడు కదా… ఎర్రవల్లి ఫామ్ హౌజుకూ చర్లపల్లి జైలుకూ తేడా ఏముంది..? అక్కడా ఇక్కడా పోలీస్ కాపలా, పహారా… అప్పుడప్పుడూ విజిటర్లు వస్తుంటారు… సేమ్ సేమ్… కేసీయార్‌ను ఓడించడమే తనకు పెద్ద శిక్ష…’’
ఓడిపోయాక ఇప్పటికీ ప్రజాజీవితంలోకి రాని ప్రతిపక్ష నేతపై ఇన్నాళ్లూ సంధించిన పొలిటికల్ విమర్శలు వేరు… ఇప్పటిక కాస్త సర్కాస్టిక్‌గా ఎక్కుపెట్టడం..! దానికి కాస్త పాలిష్డ్ పాజిటివిటీని జతచేయడం… ‘‘అబ్బే, నేను విద్వేష రాజకీయాలు చేయను, అవసరం లేదు… గతంలో జైపాల్‌రెడ్డిని పీవీ నరసింహారావు, వాజపేయిని రాజీవ్ గాంధీ విదేశాలకు పంపించి చికిత్సలు చేయించారు, రాజకీయాల్లో శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే ఉండాలి’’…
అంతేనా..? ‘‘నీ కాలు విరిగినప్పుడు పరామర్శించానా లేదా..? నువ్వు హాస్పిటల్‌కు వెళ్తే ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు, సాయాలు, సౌకర్యాలు అందాలని ఆదేశించానా లేదా..?’’ అంటూ అసలే తన నుంచి పవర్ లాక్కున్నాడని రేవంత్ రెడ్డిపై మండిపోతున్న కెేసీయార్ అహంలో, కోపంలో ఇంకాస్త పెట్రోల్ పోస్తున్నాడు…
చంద్రబాబుకు, జగన్‌కు పంచ్ సెటైర్లు వేయడం పెద్దగా చేతకాదు… కానీ వైఎస్ అప్పుడప్పుడూ భలే వేసేవాడు… పాదయాత్రకు ముందు తన ఇమేజ్ వేరు… తన సీరియస్ లుక్కు, ఆ భాష వేరు… కానీ పాదయాత్ర తరువాత, సీఎం అయిన తరువాత గణనీయంగా మార్పు వచ్చింది… తన పంచుల్లో పదును పెరిగింది… రోశయ్యతో సావాసం ఫలితమేమో…
సరే, ఈ పంచుల కథలు ఎలా ఉన్నా… రేవంత్ రెడ్డికి రాష్ట్రపతి ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను బీజేపీ ముఖ్య నేతలు రద్దు చేయించడం మాత్రం అస్సలు సరికాదు… బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ తనదైన ధోరణితో వ్యతిరేకిస్తోంది… బీఆర్ఎస్‌ను వదిలేస్తే… కాంగ్రెస్ దానిపై కేంద్రంతో పోరాడుతోంది…
ఆ చట్టానికి ఆమోదముద్ర పడటానికి రాజ్యంగపరంగా, చట్టపరంగా ఉండే అడ్డంకుల్ని వదిలేస్తే… రాష్ట్రపతిని కలిసి రేవంత్ రెడ్డి టీమ్ ఓ విజ్ఞాపనపత్రాన్ని ఇస్తే, తమ ప్రతిపాదిత రిజర్వేషన్ల గురించి వివరిస్తే బీజేపీకి వచ్చిన నష్టమేమిటి..? బీజేపీ ధోరణి ఇక్కడ హుందాగా లేదు…!!
అన్నట్టు సీఎం సార్… కేసీయార్ నన్ను జైలులో వేస్తాడా..? ఇక చూసుకో నా తడాఖా, అంతు చూస్తా, కుర్చీ దింపుతా అని అప్పట్లో జైలు నుంచి విడుదల కాగానే మీసాలు తిప్పి సవాల్ చేసిన అప్పటి రేవంత్ రెడ్డి ఇకపై కనిపించడు కదా..!! ప్రత్యర్థులను సెటైర్లు, పంచులతో *ఎగ్గిచ్చే* సీఎం కనిపిస్తాడా..?! (ఎగ్గించడం అంటే ఉడికించడం..)
Share this Article