.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ విజయమే బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం ప్రకటించిన అభ్యంతరాలు… ఎప్పుడైతే గోదావరి- బనకచర్ల మీద చంద్రబాబు ప్రకటనలు మొదలయ్యాయో, వెంటనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది…
బనకచర్ల ఎలా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమో కేంద్రానికి స్పష్టంగా చెప్పింది… ఇంకొన్ని కీలకమైన అస్త్రాలనూ సంధించింది… దాంతో అనివార్యంగా కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ బనకచర్ల ప్రతిపాదనల్ని చంద్రబాబుకే తిప్పి పంపించింది…
Ads
1) అంతర్రాష్ట్ర గోదావరి జలాలను ఏకపక్షంగా ఏపీ వాడుకోవడం కుదరదు… 2) గోదావరి జలాలను బేసిన్ల మధ్య మార్చే పక్షంలో ఎగువ రాష్ట్రాలకు కృష్ణాలో కేటాయింపులు పెరగాల్సి ఉంటుంది… 3) పార్లమెంటు ఆమోదం పొందిన పోలవరం ప్రాజెక్టు డిజైన్లను, వాడుకునే పద్ధతులను మార్చే పక్షంలో మళ్లీ అనుమతులు కావాలి, పైగా అది జాతీయ ప్రాజెక్టు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మార్చడం కుదరదు, ఏపీ ప్రభుత్వానిది ప్రస్తుతానికి నిర్మాణ బాధ్యత మాత్రమే… అంతేకాదు, ఆల్రెడీ పోలవరం ముంపుపై ఒడిశా, చత్తీస్‌గఢ్ అభ్యంతరాలు, కేసులు నడుస్తున్నాయి… పోలవరంపై ఏ నిర్ణయం తీసుకున్నా అది సబ్ జుడీస్ అవుతుంది…
4) నిజంగానే గోదావరి జలాల్ని కృష్ణా కావేరిలతో అనుసంధానించాలని అనుకుంటే… కేంద్రం ఆల్రెడీ ఆమోదించిన ఇచ్చంపల్లి నుంచి కావేరికి అనుసంధానించడం బెస్ట్ ఆప్షన్… అదీ కేంద్రమే చేపడితే మరీ మేలు… 5) ఇచ్చంపల్లి నుంచి నీటిని కావేరికి అనుసంధానిస్తే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు కూడా మేలు.., 6) బనకచర్లకు సీడబ్ల్యూసీ (జాతీయ జల కమిషన్), గోదావరి వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్ పరిశీలన, అనుమతీ కావాలి…
ఇలా రకరకాల ఇష్యూస్‌ను కేంద్రం దృష్టికి రేవంత్ రెడ్డి నేరుగా తీసుకెళ్లాడు… బనకచర్లకు మేం వ్యతిరేకం అని స్పష్టంగానే చెప్పాడు… అవసరమైతే చర్చిద్దామనీ ప్రతిపాదించాడు ఏపీ ప్రభుత్వానికి… తద్వారా మోడీ మీద ఒత్తిడి తెచ్చి, జస్ట్, అలవోకగా బనకచర్లకు ఆమోదం పొందుదామని అనుకున్న ఏపీ ప్రభుత్వానికి గొంతులో పచ్చివెలక్కాయ ఇరుక్కున్నట్టయింది… తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాల్నే కేంద్రమూ ప్రస్తావిస్తోంది…
బనకచర్ల ప్రాజెక్టు ఆహా ఓహో అని ప్రొజెక్ట్ చేసింది ఏపీ ప్రభుత్వం… సుమారు 80 లక్షల మందికి కొత్త నీటిపారుదల ఆయకట్టు ఏర్పాటుతోె ప్రయోజనం అంటోంది.., 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టు ఏర్పాటు, ఇప్పటికే ఉన్న 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ, పారిశ్రామిక అవసరాల కోసం 20 టిఎంసిల నీటి సరఫరా, 400 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం కూడా…
కానీ పలు దశల్లో నీటిని ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చు మాటేమిటి..? నిర్మాణ వ్యయానికి సరిపడా ప్రయోజనం లేనప్పుడు మరి అంత భారీ ప్రాజెక్టు దేనికి..? పైగా కాలేశ్వరం ఏటీఎం మీద ఆల్రెడీ ఒక కమిషన్ విచారణ సాగిస్తోంది… దాన్ని మోడీ కూడా కేసీయార్ ఏటీఎం అన్నాడు… ఈ స్థితిలో మరో ఏటీఎంకు మోడీ పర్మిషన్ ఇస్తాడా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది..?
కేంద్రం బనకచర్ల ప్రతిపాదనల్ని వాపస్ పంపించడంతో వెంటనే ఈ క్రెడిట్ కొట్టేయడానికి బీఆర్ఎస్ త్వరపడింది… మా పోరాట ఫలితమే అని క్రెడిట్ హైజాక్ చేయడానికి విఫల యత్నం చేస్తున్నాడు హరీష్ రావు… అక్కడికి హరీష్ రావు ప్రెస్ మీట్ వివరాలు చదివి మోడీ ఆ బనకచర్ల ఫైల్‌ను గోదాట్లో నిమజ్జనం చేసినట్టు..!! సో, ఇప్పుడు చంద్రబాబు రియాక్షన్ తెలుసుకోవాల్సి ఉంది..!!
మోడీ మీద పొలిటికల్ ఒత్తిడి తీసుకొచ్చి, మెడలు వంచే ప్రయత్నాలు చేస్తాడా..? మోడీ లొంగుతాడా..? తదుపరి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా..? కథ ఇంకా చాలా ఉంది..!!
బనకచర్ల మీద తెలంగాణ ప్రభుత్వ పోరాటం, విజయంలో సాగునీటి సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ కృషి, అనుభవం, ఆలోచనలు, ప్రయత్నాలను మరోసారి అభినందించాలి ఇక్కడ..!!
Share this Article