.
రేవంత్ రెడ్డిది సరైన నిర్ణయం… నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం లభించకపోవడమే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అనివార్యత కాదు, ఓ సరైన అవకాశం… విచిత్రంగా ఉందా..? కానీ అదే నిజం…
వాస్తవంగా రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ బిల్లును తెచ్చాడు… రాష్ట్రపతి దగ్గర పెండింగ్… ఈ కథ అందరికీ తెలుసు… మరోవైపు కోర్టు డెడ్ లైన్ విధించింది, దగ్గరకు వస్తోంది… సుప్రీంకోర్టుకు వెళ్లి, దాన్ని చూపించి, ఈ ఎన్నికల్ని వాయిదా వేయించొచ్చు… కానీ రేవంత్ రెడ్డి ఇక్కడే తెలివైన ఎత్తుగడ వేశాడు…
Ads
1) ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా భావించబడే బీఆర్ఎస్ తనే గతంలో బీసీ రిజర్వేషన్లను కుదించింది… ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి విఫల ప్రయత్నం చేస్తోెంది కదా… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్‌ను రాజకీయంగా, నైతికంగా జనంలో ఎండగట్టే చాన్స్ వచ్చినట్టయింది… ఎలాగంటే…
కేసీయార్ గతంలో చేసిన చట్టం వల్ల బీసీల రిజర్వేషన్లు కుదించుకుపోయాయనే పొలిటికల్ దాడి చేయొచ్చు… మేం మా సంకల్పానికి కట్టుబడి, అడ్డంకులున్నా సరే పార్టీపరంగా రిజర్వేషన్లు ఇచ్చి మా చిత్తశుద్ధిని చాటుతున్నాం అని చెప్పొచ్చు…
అంతేకాదు, కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లను రాజకీయంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నది కాబట్టి, అనివార్యంగా నువ్వు ఇస్తావా చస్తావా అనే స్థితిలోకి బీఆర్ఎస్‌ను అదీ 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే దిశ వైపు నెట్టేయడం… పొలిటికల్ అప్పర్ హ్యాండ్ వచ్చింది…
2. స్థానిక ఎన్నికల్లో పెద్దగా బీజేపీ చూపించే ప్రభావం ఉండబోదు… పైగా పార్టీలోనే తన్నులాటలున్నాయి… బోలెడంత గందరగోళం… ఈ స్థితిలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకుని, కేంద్రంలో పెండింగులో పెట్టేయడానికి కిషన్ రెడ్డి అండ్ గ్రూపు కారణమని జనంలో చర్చ పెట్టడానికి ఓ చాన్స్ దొరికినట్టయింది…
సరే, బీజేపీ మేం మత రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాం, అందుకే అడ్డుకున్నాం అని బలంగా చెప్పగలిగే నాయకత్వం కొరవడింది బీజేపీలో… బండి సంజయ్ వంటి లీడర్లు అయితే కరాఖండీగా, కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడేవాడేమో… కానీ తనిప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాడు కదా…
సో… ఇటు బీజేపీని, అటు బీఆర్ఎస్‌ను ఏకకాలంలో కార్నర్ చేస్తూ… ఎక్కువ రిజల్ట్ సాధించే చాన్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టే… బీఆర్ఎస్ కేడర్ నిస్తేజంగా ఉంది, లీడర్ బయటికి రాడు, సెల్ఫ్ జైల్… కవితను గెంటేస్తున్నారు… సో, అంతులేని అయోమయం, కేడర్‌కు మద్దతు రాహిత్యం… అందుకని రెండు ప్రత్యర్థి పార్టీల కోణంలోనూ కాంగ్రెస్‌కు ఓ చాన్స్… ఇక చూడాలి, రేపు బీజేపీ, బీఆర్ఎస్ స్పందనలేమిటో..!!
Share this Article