రోడ్డు పక్కన ఓ చిన్న మెస్… రుచిగా, చౌకగా దొరుకుతూ ఉండటంతో చాలామంది ఆమె దగ్గర మీల్స్ చేసేవాళ్లు… ఎక్కడి నుంచో వచ్చింది, హైదరాబాదులో పొట్ట పోసుకుంటోంది… నిజానికి ఇలాంటి రోడ్డు పక్కన మెస్సులు హైదరాబాదులో వేలల్లో ఉంటాయి… కానీ ఎవడో సోషల్ మీడియా వాడు ఆమె దగ్గర మీల్స్ ఆహా ఓహో అని ఏదో వీడియో చేశాడు…
పాపం, ఆమె కూడా తనకు ప్రచారం వస్తుంది కదా అనుకుందో, లేక ఎవరినీ కాదనలేక సమాధానాలు చెబుతూ పోయిందో గానీ… యూట్యూబర్లు, రీల్స్, షార్ట్స్ ఆమె అడ్డాకు వెల్లువెత్తారు… మొదట్లో 4 కిలోల బియ్యంతో స్టార్ట్ చేసింది… ఇప్పుడు క్వింటాల్ బియ్యం ఉడకేస్తోంది అని ఒకడు… అసలు ఆమె రోజు సంపాదన ఎంతో తెలుసా..? ఈ పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ జాబ్సు పీకేగా నహీఁ అని ఇంకొకడు… ఇలా ఎవడికిష్టం వచ్చినట్టు కూశాడు, చూపించాడు…
దాంతో ఏమైంది..? మనకు కొత్త ఓ వింత కదా… ఇరగబడతారు కదా… ఐకియా, మెట్రో, లులూ గట్రా పైత్యాలు చూశాం కదా… సరే, ఆమె మీల్స్‌కు జనం ఇరగబడ్డారు… దాన్ని కూడా మళ్లీ వీడియోలు తీసి మళ్లీ ప్రచారం… ఒకడైతే అబ్బే, ఈ రష్‌లో నాకు ప్లేట్ మీల్స్ దొరకడం లేదు బ్రో, 50 రూపాయలు ఎక్కువ ఇచ్చి బ్లాకులో కొన్నాను అని వీడియో తీశాడు… ఇవన్నీ ఒకదానికి ఒకటి తోడై నిజంగానే ఫుల్ రష్ పెరిగిపోయింది…
Ads
వచ్చే గిరాకీని కాదనలేదు… అందరికీ చేతనైనకాడికి సప్లయ్ చేసింది.,. కార్లు, ఆటోలు, బైకులు రద్దీ… ట్రాఫిక్ జామ్… దాంతో పోలీసులు ఓవరాక్షన్ చేసి మొత్తం అక్కడి నుంచి ఖాళీ చేసేయాల్సిందేనని హుకుం జారీ చేశారు… ఆమెకు షాక్… అయితే దీనికీ రాజకీయ రంగు పులిమారు కొందరు… ఆమె ఏదో వీడియోలో ‘నాకేముంది..? జగనన్న ఇచ్చిన చిన్న ఇల్లు ఉంది’ అని ఏదో తన గురించి చెప్పుకుంది… ఇంకేం, జగన్‌ను మెచ్చుకుంది కాబట్టి రేవంత్ కావాలని ఆమె దుకాణం మూసేయించాడు… పచ్చ మాఫియా కుట్ర, దానికి వంత పాడే రేవంత్ కుట్ర అని ట్రోలింగ్ మొదలు…
ట్రోలర్లకు విచక్షణ ఉండదు కదా… ఆరోజుకు తమ అజ్ఙానం ఏం బయటపెట్టుకున్నామనేదే ప్రధానం… సరే, ఈ చిల్లర ప్రచారం రేవంత్ దాకా పోయింది… ఇదేమిటి నాన్సెన్స్, ఆమె జోలికి ఎందుకు పోయారు..? మీ నిర్ణయాన్ని వాపస్ తీసుకొండి, పేదవాళ్ల తరఫున మనం ఉండాలి గానీ వాళ్ల పొట్ట కొట్టడం దేనికి..? ఆమె జోలికి పోవద్దు… మనది ప్రజాపాలన… త్వరలో ఆమె స్టాల్‌ను నేనూ సందర్శిస్తాను’ అని పోలీసులను ఆదేశించాడు…
https://twitter.com/ayodhyareddyb73/status/1752583206036185253?t=TekZ9SNoZ5TSCVzy-iS6ow&s=08
గుడ్… ఇలాంటి చిన్న విషయాల్లోనైనా సరే తక్షణ విజ్ఞత ప్రదర్శించాలి… అది జనంలోకి మంచి సంకేతాలను పంపిస్తుంది… రేవంత్ చేసిందీ అదే… సీఎంకు కుమారి ఆంటీ కృతజ్ఞతలు… సమాజానికి మీడియోయే పెద్ద దరిద్రం… కుమారి ఆంటీ కొంప ముంచారు కదా… ఇదుగో ఇప్పుడు ఈమె దొరికింది… ఎందుకుర భయ్ ఈ దిక్కుమాలిన, సిగ్గులేని జర్నలిజం…
Share this Article