.
The Ministry of External Affairs (MEA) stated that political clearance for Telangana Chief Minister A. Revanth Reddy’s proposed US tour was denied because the submitted program and itinerary were not considered appropriate to the office held and the purpose of the visit…
… తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం ఓ పే-ద్ద మిస్టీరియస్ పరిణామం… విదేశాంగ శాఖ వాడే భాష, పదాలు ఎప్పుడూ మార్మికంగా ఉంటాయి, అంత సులభంగా అర్థం కావు… ఓ సరైన నిర్దారణకు రాలేం కూడా… ఇప్పుడూ అలాగే స్పందించాడు విదేశాంగ శాఖ ప్రతినిధి…
Ads
పైన చెప్పిందే… not appropriate అంటే ఏమిటి..? అదుగో పులి, ఇదుగో తోక అన్నట్టుగా… చాలా మంది రాస్తున్నట్టుగా ఈ పర్యటన ‘అనుచితం’ అని కాదు… సరైన, అనువైన, తగిన అనే అర్థాలు తీసుకోవాలి ఈ సందర్భానికి… ఎందుకంటే, తను సీఎం హోదాలో వెళ్తున్నాడు కాబట్టి… ఆ పోస్టు హోదాకు తగిన అనే అర్థమే ముఖ్యం… మరి అది ‘తగినట్టు’ లేదా..?
లేదనే కేంద్ర విదేశాంగ శాఖ భావిస్తోంది… అసలే అమెరికాలో సంబంధాలు గతంలోలా లేవు, భారత్ మీద విద్వేషంతో వ్యవహరిస్తోంది ట్రంపు ప్రభుత్వం… పైగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బదులు, అనేక భారత వ్యతిరేక షరతులతో ట్రేడ్ అగ్రిమెంట్ కోసం రకరకాల బ్లాక్ మెయిల్ ఒత్తిళ్లు తీసుకొస్తోంది అమెరికా… ఈ స్థితిలో ఈ దేశ ముఖ్యమైన పోస్టుల్లో ఉన్నవారు వెళ్లి, సున్నితమైన అంశాలపై ఏం వ్యాఖ్యలు చేసినా అది ‘సరైనది’ కాదని బహుశా జైశంకర్ ఆఫీసు భావించి ఉండవచ్చు…
పైగా తన టూర్ ప్లాన్ కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగానే ఉన్నప్పటికీ… అమెరికా యూనివర్శిటీలతో ఒప్పందాలు తెలంగాణ ప్రయోజనాల కోసమే ఐనప్పటికీ… ఆ వివరాల్ని ( itinerary ) సరిగ్గా ఇవ్వడంలో తెలంగాణ ఉన్నతాధికారగణం ఫెయిలైనట్టు తెలుస్తోంది… విదేశాంగ శాఖ క్లారిటీ అడిగినా సరే, బాగా జాప్యం చేసినట్టు సమాచారం… ఎవరు బాధ్యులో రేవంత్ రెడ్డే తేల్చుకోవాలి…
Non-Conformity with Norms: Foreign visits by chief ministers and other high-ranking dignitaries are systematically assessed by the MEA to accord political clearance. The ministry determined that the schedule and specific details proposed for the United States did not conform with established norms and the dignity of the office.
అధికారిక హోదాల్లో ఎవరైనా విదేశీ పర్యటనలకు వెళ్తే ఇచ్చే అనుమతిని ‘పొలిటికల్ క్లియరెన్స్’ అంటారు, అంటే ‘రాజకీయ కారణాలతో ఇచ్చే అనుమతి’ కాదు… సో, ఒక వీహెచ్ హనుమంతరావు, ఒక ధర్మపురి అర్వింద్, ఒక బీజేపీ రాంచందర్‌రావు ఏమంటున్నారనేది అప్రస్తుతం… వాళ్లకు విదేశాంగ శాఖ నిర్ణయాల్ని విశ్లేషించేంత సీన్ లేదు… జస్ట్, ఇగ్నోర్ దెమ్…
ఇంకా చూద్దాం… 1) రేవంత్ రెడ్డి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్‌కు అటెండవుతున్నాడు న్యూయార్క్‌లో అని ఓ అభిప్రాయం… అదేమీ నిషేధిత సంస్థ కాదు, అది కారణమూ కాదు… ఎవరైనా తెలుగు ముఖ్యులు వెళ్లినప్పుడు తమ తెలుగు ప్రవాసులతో భేటీ వేయడం తప్పూ కాదు…
2) లండన్‌లో భారత వ్యతిరేకులతో కలిసి ఆక్స్‌ఫర్డ్ వర్శిటీలో తిరిగాడు అంటూ మరో అభిప్రాయం… అదీ తప్పే… తను వెళ్లింది అక్బరుద్దీన్ ఒవైసీ బిడ్డ పెళ్లికి, దాానికి కేటీయార్, హరీష్ రావు కూడా వెళ్లారు, ప్యూర్ పర్సనల్… పైగా అక్కడికి వెళ్లాక ఎవరెవరో కలుస్తారు, వాళ్లందరూ రేవంత్ రెడ్డి రాజకీయ కార్యాచరణను ప్రభావితం చేస్తారని కాదు కదా… పైగా లండన్ పర్యటనను విదేశాంగ శాఖ వ్యతిరేకించలేదు… అమెరికా పర్యటనతో దానికి సంబంధం లేదు…
3) కొందరు మరీ ఎక్స్‌ట్రీమ్‌కు వెళ్లారు… రేవంత్ ఏకంగా ట్రంపు కలిసే ప్లాన్ చేశాడనీ, తను కలవకపోతే జేడీ వాన్స్‌తో కలవాలని ప్రయత్నం చేస్తున్నాడని..! అదంత ఈజీ యవ్వారం కాదు, కానీ కలిసినా తప్పేమిటి..? కీలకమైన వ్యవహారాల్ని ట్రంపు ప్రభుత్వం కేంద్ర విదేశాంగ, వాణిజ్య, రక్షణ, చమురు, ఆర్థిక తదితర సంబంధిత మంత్రిత్వ శాఖలతో డీల్ చేస్తుంది తప్ప రాష్ట్రాలతో కాదు… మోదీ ప్రభుత్వం ఉలిక్కిపడిందనే వాదన అబ్సర్డ్…
4) ఇలా ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు, అసలైన కారణాన్ని విదేశాంగ శాఖ ఎప్పుడూ వెల్లడించదు, తన నిర్ణయం అల్టిమేట్… ఎవరూ ప్రశ్నించరు, ప్రశ్నించడానికి వీల్లేదు, అవి అంత కీలకం, పవర్‌ఫుల్ కాబట్టి… అందుకెే రేవంత్ రెడ్డి అనవసర రాద్దాంతానికి పోకుండా సింపుల్‌గా, సైలెంటుగా వచ్చేస్తున్నాడు…
5) కొందరైతే ఏకంగా తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం పెరిగింది, తన పీఠం కిందకే నీళ్లొస్తున్నాయి, అందుకే తనే పర్యటన రద్దు చేసుకుని వచ్చేస్తున్నాడు అని రాసుకొచ్చారు… దీన్ని యూట్యూబ్ జర్నలిజం అంటారు తెలుసు కదా… వాళ్లకు పే-ద్ద దండం…
5) రేవంత్ మంచి పనులతో క్రెడిట్ కొట్టేయకుండా బీఆర్ఎస్- బీజేపీ కలిపి క్షుద్ర పన్నాగాలు అని మరికొన్ని కథనాలు… ఆహా, ఏం తెలివి బ్రదర్స్…?

కొందరైతే (చివరకు అత్యున్నత పాత్రికేయ విలువలున్న మహాన్యూస్ సహా) రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తరఫున డీప్ స్టేట్, జార్డ్ సోరేస్ టీమ్స్‌తో భేటీ కావాలని అమెరికా వెళ్లబోయాడని రాసుకొచ్చారు… శతకోటి నమస్కారాలురా బాబూ… ఇంకా నయం జియోపాలిటిక్స్‌లో రేవంత్ కీలకపాత్ర అని రాసుకురాలేదు… హమ్మయ్య…
ఐతే ఇలా ఇదే మొదటిసారా..? మరీ మనం ధర్మపురి అర్వింద్ భాషలో… దేశసమగ్రత, సార్వభౌమాధికారానికే ప్రమాదం అనే రేంజ్ అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు… తన ‘పరిధి’ తెలుసు కదా… బట్, ఇదేమీ కొత్త కాదు… గతంలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్, పినరై విజయన్, తరుణ్ గొగోయ్, భగవంత్ సింగ్ మాన్, అర్జున్ ముండా తదితరులకూ కేంద్రం ‘పొలిటికల్ క్లియరెన్స్’ ఇవ్వలేదు…
2012 లో యూపీఏ హయాంలో అసోం కాంగ్రెస్ సీఎం తరుణ్ గొగోయ్… ఐనా నో క్లియరెన్స్… సో, కొన్నింటికి ఈకలు పీకాల్సిన పనిలేదు… మమత, కేజ్రీవాల్, విజయన్, భగవంత్ మాన్ ఎట్సెట్రా దేశవ్యతిరేక ధోరణులు కాబట్టి కేంద్రం సందేహించి ఉండొచ్చు… రేవంత్ రెడ్డి విషయంలో ఆ సందేహాలూ ఉండవు… సో, కొన్ని జరుగుతూ ఉంటాయి, అంత సీరియస్ యవ్వారంగా తీసుకుని, ఇదేదో తెలుగు ప్రజానీకానికే అవమానం అని ఘోషించే గొంతులకు ఓ పేద్ద నమస్కారం పెట్టి వదిలేయడమే..!!
( విదేశాంగ శాఖ నిర్ణయాల్ని విశ్లేషించేంత పరిజ్ఞానం ఈ రచయితకూ లేదు, కాకపోతే నిన్నటి నుంచీ వస్తున్న కథనాలను ఓ క్రమపద్ధతిలో క్రోడీకరించి, ఒక అంచనాకు వచ్చే ఓ పాత్రికేయ ప్రయత్నం, అందరూ ఏకీభవించాలని ఏమీ లేదు... )
వికసిత్ భారత్- 2047 కు సంబంధించి నీతి ఆయోగ్ తాజా రిపోర్ట్..! దేశంలో 15 నుండి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 8.7 కోట్ల మందికి నో ఎడ్యుకేషన్, నో జాబ్…. కానీ అత్యున్నత విదేశీ విద్యను మాత్రం మన దేశంలోకి, కనీసం తెలంగాణలోకి రానివ్వకుండా అడ్డంకులు… వావ్…
Share this Article