Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

…. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల అంచనాలకు అందడు..!!

June 8, 2026 by M S R

.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుల్ని, ఆలోచనల్ని అంచనా వేయడం తన రాజకీయ ప్రత్యర్థులకు అంతుపట్టడం లేదు… తన ప్రతి అడుగు వెనుక ఓ రాజకీయ మర్మం ఉంటుంది… ఉండకపోతే ఎలా..? రాజకీయ నాయకుడే కదా…!

హైదరాబాదులో తనే స్వయంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పి, నగర రాజకీయాల్లోనే కాదు… తెలంగాణ, ఏపీ రాజకీయ సర్కిళ్లలో పెద్ద చర్చను లేవనెత్తాడు… ఇదంతా సెటిలర్ల వోట్ల కోసం, ప్రత్యేకించి కమ్మజనాన్ని సంతృప్తిపరచడం కోసం అనే విమర్శల్ని … సో వాట్ అని కొట్టిపారేశాడు… ఎన్టీయార్ విగ్రహాల్ని బీఆర్ఎస్ స్వయంగా పెట్టినప్పుడు ఈ విమర్శలు ఎటుపోయాయంటూ వివాదాన్ని లైట్ తీసుకున్నాడు… తను, అంతే…

Ads

ఇప్పుడు అలాంటిదే మరొకటి… నిన్న ఉప్పల్ ఏరియాలో వేల కోట్ల అభివృద్ది పనుల్లో పాల్గొన్న తను ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెడుతున్నట్టు ప్రకటించాడు… అంతేకాదు, మీటింగులో ‘నేను రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకున్నాను, ఈ ఏరియాకు సేవ చేశాడు, ఇదీ గుర్తింపు, అంతేకాదు, ఉప్పల్ చౌరస్తాలో ఆయన విగ్రహం కూడా పెడతాం’ అని చెప్పాడు…



ఉప్పల్ వేదికగా రాజకీయాలకు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టాం. బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, నిజంగానే రాజకీయాలు చూసి ఉంటే ఆ పేరు పెట్టేవాడినా? ఉప్పల్ చౌరస్తాలో రాజిరెడ్డి విగ్రహాన్ని కూడా… pic.twitter.com/hyBVwukghM

— Telugu360 (@Telugu360) June 7, 2026



ఇక్కడ తనే ఓ క్లారిటీ ఇచ్చాడు… ‘‘బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్‌లో ఉన్నాడు… ఐతేనేం, రాజిరెడ్డి సేవల్ని మనం రాజకీయాలకు అతీతంగా గుర్తించాలి, అందుకే ఈ నిర్ణయం’’ అన్నాడు… ఇది ఖచ్చితంగా నగర రాజకీయాల్లో మరో చర్చనీయాంశం… రేవంత్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయ నిర్ణయమే కాదు, తన గెలుపుకి సహకరించిన వ్యక్తి పట్ల కృతజ్ఙత కూడా…

రాజిరెడ్డి కాంగ్రెస్ లీడరే… ఓసారి మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు… ఉప్పల్ ఏరియాలో గ్రిప్ ఉన్న నాయకుడే… తరువాత సోదరుడు లక్ష్మారెడ్డి తెరపైకి వచ్చాడు… తను కూడా మొదట్లో కాంగ్రెసే… కానీ తరువాత ఆశించిన కాంగ్రెస్ టికెట్ దక్కక, బీఆర్ఎస్‌లో చేరాడు… 2023 ఎన్నికల్లో ఉప్పల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచాడు…

గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, పరిసర సీట్లలో బీఆర్ఎస్ బలం ప్రదర్శించింది… ఆ బలానికి కారణాలేమిటో విశ్లేషించుకుంటూ, ఒక్కొక్కటీ తనదైన స్టయిల్‌లో తనవైపు లాక్కుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి… మొన్న ఎన్టీయార్ విగ్రహం కావచ్చు, ఈరోజు ఉప్పల్ కారిడార్‌కు రాజిరెడ్డి పేరు, తన విగ్రహం కావచ్చు…

అవును, రాజకీయాలకు అతీతం ఏమీ కాదు, రాజకీయమే… తెలివైన వ్యూహాత్మక రాజకీయం… రాజకీయాలకు అతీతమని చెప్పుకునే రాజకీయం… మరోవైపు తనకు సహకరించిన దివంగత నేత పట్ల కృతజ్ఞత, అదీ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేదే… ప్రస్తుతం బీఆర్ఎస్‌కు వోటేసిన వోటర్ల మనస్సు కూడా గెలుచుకోవడం ఇంకోవైపు… బహుళ కోణాలు… అందుకే బీఆర్ఎస్‌కు రేవంత్ రెడ్డి మింగుడుపడడు… అఫ్‌కోర్స్, సొంత పార్టీలోని కొందరికి కూడా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘కమ్మ’ అంటే తెలుసా? – ‘ఇడుపు కాయితం’ అసలు అర్థమేమంటే?
  • గంగ చంద్రముఖిలా..! కాషాయ రాంచందర్‌ కాస్తా పింక్ హరీష్‌లా…!!
  • గ్లోబల్ ఎంఎన్సీల వైపు యువ గిరిజనం! సరికొత్త సక్సెస్ స్టోరీలు!
  • ఓహో… ఈ ‘ఇడుపు కాయితం’ రచ్చకు అక్కడ బీజం పడిందా..?!
  • ‘‘ఓహ్.., నేను ఇంకా టీచింగు నుంచి రిటైర్ కాలేదన్నమాట’’
  • కువిమర్శ! అయోధ్య విరాళాలతో బీజేపీ ఎంపీలను కొన్నదట!
  • ‘‘మీ పాలనలో 75 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగినట్టేనా హరీష్?’’
  • “అసలైన పాన్ రుచికి మీఠా… తుపాన్ నాట్యం చేస్తే – ఈఠా!”
  • Uniform Civil Code – ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు!
  • బుడ్డోడిని ఆడించలేదు – చివరకు ఐర్లాండ్ కూడా ఆడుకుంది – ఓడించింది

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions