Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వైఎస్ మార్క్ లిబరల్..! కొత్త రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు ఈమధ్య..!!

April 18, 2026 by M S R

.

ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు..! ఎన్డీఏ నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి… కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్..! తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ టీడీపీ నేతలతో కలసి సరదాగా గడిపిన ముఖ్యమంత్రి… టీడీపీ నేత ఆహ్వానం మేరకు వెళ్లినట్లు సమాచారం..!

పార్లమెంట్ లో నిన్న అత్యంత కీలకమైన 131 సవరణ బిల్లు వీగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ బ్రేక్ ఫాస్ట్ విందుపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్న రాజకీయ వర్గాలు..! …. ఇదీ వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించిన ఓ స్టోరీ ప్లస్ వీడియో… ఇంట్రస్టింగ్…

Ads

ఒకవైపు తేజస్వి సూర్య పిచ్చికూతలకు నిరసనగా కాంగ్రెస్ తెలంగాణ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటు ఎదురుగా ధర్నా చేస్తారు… హైదరాబాదులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది… (బీఆర్ఎస్ సోదిలో కూడా లేదు)… ఎన్డీయే మీద రేవంత్ రెడ్డి ఎక్కీ దిగుతుంటాడు… కానీ మరోవైపు..?

ఇదే రేవంత్ రెడ్డి తన బ్రేక్ ఫాస్ట్ మీటింగులో ఏపీ, తెలంగాణ బీజేపీ, టీడీపీ (ఎన్డీయే) ఎంపీలతో కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపాడు… అంతకుముందు టీడీపీ మహిళా ప్రజాప్రతినిధులతో ఫోటోలు దిగాడు కూడా… సో, వాటీజ్ దిస్ అనే పోస్టులు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో..! కానీ… పేకాట పేకాటే, రాజకీయంగా ప్రత్యర్థి ప్రత్యర్థే… రేవంత్ రెడ్డిలో కాస్త పొలిటికల్  మెచ్యూరిటీ కనిపిస్తోంది…

గతంలో వైఎస్ దగ్గర కనిపించేది… తన ప్రబల ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు బామ్మర్ది, వియ్యంకుడు తన ఇంట్లో కాల్పులు జరిపితే… చంద్రబాబు శరణు కోరితే… సహకరించాడు, బాలకృష్ణను బయటపడేశాడు… అది పరిణతి… సరే, దాన్ని చంద్రబాబు నిలబెట్టుకున్నాడా లేడానేది వేరే విషయం… అది వ్యక్తుల తత్వాలను బట్టి ఆధారపడి ఉంటుంది… అదే చంద్రబాబు పట్టుబట్టి జగన్‌ను జైలుపాలు చేశాడు, సతాయించాడు… అది వేరే కథ…

ఇక్కడ రేవంత్ రెడ్డి చూపిస్తున్నది… రాజకీయం వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు… ఎవరూ ఎవరికీ శత్రువులు కారు… పొలిటికల్ అపోనెంట్స్ మాత్రమే… తను టీడీపీ నుంచి వచ్చినవాడే, పూర్వాశ్రమంలో బీజేపీ… మధ్యలో బీఆర్ఎస్ క్యాంపులోకి కూడా వెళ్లివచ్చినట్టున్నాడు… సో, తనకు సిద్ధాంతాల బందీఖానా లేదు, ఫ్లెక్సిబుల్…

అర్థమయ్యేది ఏమిటంటే..? తను ఎవరో ఫిక్స్ చేసే గీతల నడుమ ఉండిపోదల్చుకోలేదు… స్వీయ విచక్షణ ప్రయోగిస్తున్నాడు… తెలంగాణ పరిధులు దాటి మరీ ఎక్స్‌పోజ్ అవుతున్నాడు… మనిషి అస్సలు అర్థం కాడు..!! అర్థమైతే రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు..?!

https://www.facebook.com/share/v/1G2LR4Hzqr/?mibextid=wwXIfr

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఐపీఎల్ 2026 : పాత దోస్తులు – కొత్త శత్రువులు… పంత్ & శ్రేయాస్…
  • వైఎస్ మార్క్ లిబరల్..! కొత్త రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు ఈమధ్య..!!
  • ఇప్పుడైతే శోభన మోహన్‌బాబును మూడు చెరువుల నీళ్లు తాగించేది..!!
  • ది మిస్ ఫిట్..! ఆంటోనీ రాజు మంత్రి పదవి ఊడబీకిన ‘అండర్ వేర్’…
  • బీహార్ ‘సామ్రాట్’ చౌదరి – అబ్బో, నువ్వు మామూలోడివి కాదు బాసూ…
  • సౌత్ వాయిస్..! రేవంత్ రెడ్డి మార్క్ పొలిటికల్ అడుగులు…!!
  • ఏలియన్స్ గుట్టు తెలిసిన సైంటిస్టులు మాయం..! ఎవరి పని..?!
  • అసలు ప్రశ్న అలాగే ఉండిపోయింది..! ఎన్ని పెంచాలి, ఎలా పెంచాలి..!!
  • అట్టడుగున ఆ నాలుగు జట్లు..! ఏవీ ఆ పాత మెరుపులు..?
  • ప్రకాష్ ఆంటోనీ రాజ్ మళ్లీ కూశాడు… ఈసారి రాముడిపై మరింత వెటకారంగా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions