Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హరీష్ రావుపై సిద్దిపేటలో రేవంత్ రెడ్డి సర్జికల్ స్ట్రయిక్! 

November 20, 2026 by M S R

.

హరీష్ రావుపై సిద్దిపేటలో రేవంత్ రెడ్డి సర్జికల్ స్ట్రయిక్! ఈ శీర్షిక అబద్దం కాదు… కాకపోతే ఈ వ్యాఖ్యకు కారణాల్ని చదవాలి… ఒకప్పుడు సిద్దిపేట అంటే కాంగ్రెస్ నాయకుడు మదన్‌మోహన్ అడ్డా.., తన దగ్గర కేసీయార్ ఓ అనుయాయి… తరువాత కేసీయార్ ఎదిగాడు, తన తరువాత హరీష్ రావు…

వేరేవాళ్లను స్వపార్టీలో గానీ, ప్రతిపక్షంలో గానీ ఎదగనివ్వరు… రకరకాల మాయోపాయాలు, ప్రలోభాలు… చివరకు సిద్దిపేట అంటే అది కేసీయార్ కుటుంబం అడ్డా అన్నట్టుగా తయారైంది… బీజేపీ, కాంగ్రెస్ కూడా పెద్దగా పట్టించుకోలేదు ఈ నియోజకవర్గాన్ని… కానీ గతంలోని కాంగ్రెస్ నేతల్లాంటి నిర్లిప్త ధోరణి కాదు రేవంత్ రెడ్డిది…

Ads

తను నేరుగానే పెద్ద తలకాయలతో పోటీపడతాడు… బీఆర్ఎస్ అంటే కేటీయార్, కేసీయార్, హరీష్… కామారెడ్డిలో కేసీయార్ మీద పోటీచేసిన రేవంత్ రెడ్డి ఈసారి గజ్వెల్‌లో కూడా వదలడు… సిరిసిల్లకు వెళ్లి కేటీయార్‌కు సవాల్ విసిరి వచ్చాడు… ఇప్పుడు సిద్దిపేటలో… భారీ ర్యాలీ, భారీ బహిరంగసభ… నేరుగా హరీష్ రావే టార్గెట్…

ఒకవైపు కవితకూ హరీష్ రావే ప్రధాన టార్గెట్… హరీష్ రావుపై కేసీయార్, కేటీయార్ గానీ ప్రేమ చూపిస్తున్నది ఏమీ లేదు… ఇప్పుడు హరీష్ రావు బయటికి వెళ్తే పార్టీకి నష్టం కాబట్టి భరిస్తున్నారు, అది హరీష్‌కు కూడా తెలుసు… ఆ హరీష్‌ తనకు కావాలని బీజేపీ ప్రయత్నం, ఒక షిండే కావాలి ఆ పార్టీకి తెలంగాణలో… కానీ హరీష్ ఏదో ‘ముఖ్య’మైన హామీ అడుగుతున్నట్టుంది…

సో, ఏరకంగా చూసినా హరీష్ రావును డిస్టర్బ్ చేస్తే బీఆర్ఎస్‌ను డిస్టర్బ్ చేసినట్టే… అందుకే సిద్దిపేట సభలో హరీష్ రావుపై నిప్పులురిమాడు రేవంత్ రెడ్డి… తడబాటు, తొట్రుపాటు ఏమీ లేదు… పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు… ఉదాహరణకు…

– శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను చూపిస్తూ… ఈ ఉద్యమకారులకు ఏం ఒరిగింది..? ఏం ఒరగబెట్టావు..? (నీ కుటుంబం మాత్రం తరతరాలకు సరిపడా సంపాదించారు అని చెప్పడానికి)…

– బాబుతో సన్నిహిత సంబంధాల్ని ఏనాడో వదిలేసుకున్నాను… (జగన్‌తో అంటకాగుతూ కేసీయార్ తెలంగాణ నీటి ప్రయోజనాల్ని నష్టపరిచాడు అని చెప్పడానికి… బీఆర్ఎస్ పదే బాబు కోసం రేవంత్ రెడ్డి నీళ్లను వదిలేస్తున్నాడు అనే విమర్శలకు జవాబు చెప్పడానికి)…

– మావాళ్లు కొందరు ఎర్రికుక్క కరిచినట్టు మాట్లాడుతున్నారు… (కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి పదునైన జవాబు)…

– రబ్బరు చెప్పులు వేసుకునే హరీష్ రావుకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి… (హరీష్ ఆస్తులపై ఆమధ్య కొన్ని వివరాలు కూడా చెప్పాడు కదా రేవంత్ రెడ్డి… తన అడ్డాలో ఎవరూ కాలుపెట్టలేరు అనే దీమా భ్రమలో ఉన్న హరీష్ రావుకు అదే సిద్దిపేటలో భారీ బహిరంగ సభ పెట్టి సమాధానం చెప్పడం ఇది… బహుశా హరీష్ రావు ఊహించి ఉండడు ఈ బహిరంగ సభ ఇంత విజయవంతం అవుతుందని…,

సిద్దిపేట

బీఆర్ఎస్ క్యాంపు కాంగ్రెస్ ఏ సభ పెట్టినా … ముందు నుంచే దుష్ప్రచారం చేస్తుంది తెలుసు కదా, అవాకులు, చెవాకులు, అబద్దాలతో సోషల్ మీడియాలో పోస్టులు… నిన్న కూడా అదే… రేవంత్ రెడ్డి సభకు జనాల్లేరు, ఫ్లాప్, సీఎం ఆగ్రహంతో సభావేదిక నుంచి విసురుగా వెళ్లిపోయాడు అని ఊదరగొట్టారు… కానీ ర్యాలీ, సభ బాగా సక్సెస్…

సిద్దిపేటలో నాన్ బీఆర్ఎస్ కోసం వర్క్ చేసేవాళ్లను పిలిచి, సభ సక్సెస్ గాకుండా ఉండేందుకు హరీష్ రావు నానా ప్రయత్నాలూ చేశాడట… కానీ సిద్దిపేటలోనే తనమీద వ్యతిరేకత ప్రబలుతోంది… అది రేవంత్ సభతో జనానికి కూడా తెలిసొచ్చింది… సిద్దిపేటలో గెలిచొస్తే మంత్రి పదవి ఇస్తానని ప్రకటించడం హరీష్ భాషలో చెప్పాలంటే మాంచి వజన్ ఉన్న మాట… ఈ సభ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టే కేటీయార్, హరీష్ రావు వెంటనే ఉలిక్కిపడి ఏదేదో కౌంటర్ల ప్రయాస పడుతున్నారు…

ఇక గజ్వెల్‌ మిగిలింది... కాంగ్రెస్ గనుక సిద్దిపేటలో కవితకు మద్దతు ఇస్తే..? పోటీ బాగా రక్తికడుతుంది..!! అన్నట్టు సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెట్టాలనేది మంచి నిర్ణయం... 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హరీష్ రావుపై సిద్దిపేటలో రేవంత్ రెడ్డి సర్జికల్ స్ట్రయిక్! 
  • అమెజాన్ అడవుల్లో ఓ ఆర్తనాదం – ‘‘మమ్మల్ని బతకనిస్తారా’’
  • “డోరతి” చూసినప్పటి నుంచి రోజుకొక్కసారైనా గుర్తుకొస్తున్నాడు…
  • ’ఆకాశంలో ఒక తార’ మెరిసింది – రోత సినిమా చీకట్లలో ‘స్పూర్తి వెలుతురు !!
  • ఆ బ్రీఫ్‌కేసు తెరిచి, ఓ ఎర్రబటన్ నొక్కగానే… అణ్వాయుధాలు పేలవు!!
  • అల్లు అరవింద్ చెప్పింది నిజమే- ఈ తెలుగు కొత్త తార సాత్విక మెరిసింది
  • బాక్సాఫీసు రికార్డులన్నీ బద్దలు – ‘ఖజానా’కు మాత్రం చిల్లులు !!
  • Ramoji film city – ఓ కేజీఎఫ్ మార్క్ చాకిరీ అనుభవం !!
  • చైనా, పాకిస్థాన్ మనకు యుద్ధ సంకేతాలు ఇస్తున్నయ్..! ఇలా…
  • ఒకేలాంటి పాట ఒకేలాంటి సందర్భాల్లో రెండు సినిమాల్లో…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions