.
మంచు లక్ష్మి వర్సెస్ ఆ జర్నలిస్టు కథను కాసేపు పక్కన బెడితే… ఆమె ప్రధాన పాత్రలో నటించిన దక్ష, ది డెడ్లీ కాన్‌స్పరసీ సినిమా ఎలా ఉంది..? చాన్నాళ్లయింది కదా ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా రాక… మరి దీని సంగతేమిటి..? పైగా సొంత సినిమా…
లక్ష్మి మంచి నటి, అందులో డౌట్ లేదు… అది వదిలేసి మిగతావి చెప్పుకుందాం… ఈ సినిమా విషయంలో ఆమె చేసిన ప్రాథమిక తప్పు ఏమిటంటే… సన్నాఫ్ ఇండియా పేరిట మోహన్‌బాబు హీరోగా ఓ విచిత్రమైన సినిమాను డైరెక్ట్ చేశాడు కదా, డైమండ్ రత్నబాబు… తను ఈ సినిమాకు కథ రాయడం… మల్లా వంశీకృష్ణ దర్శకుడు…
Ads
నిజానికి సినిమాకు తీసుకున్న బేసిక్ స్టోరీ లైన్ వోకే… క్లినికల్ ట్రయల్స్ నేపథ్యంతో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్… లక్షి పోలీస్ పాత్ర… అనుమానాస్పద మరణాలు, ఇన్వెస్టిగేషన్ చాలా సినిమాల్లో చూసిందే… కాకపోతే కథ ఎలా ఉన్నా కథనం, ప్రజెంటేషన్ భిన్నంగా ఉంటేనే కథ రక్తికడుతుంది… సినిమా కనెక్టవుతుంది…
కానీ దర్శకుడి ప్రతిభ ఏమిటంటే..? సినిమా ఆద్యంతం ఒక్క హై మూమెంట్ కూడా లేకుండా… అక్కడక్కడా లాజిక్కులకు కూడా దొరకకుండా ఫ్లాట్‌గా ముగించేశాడు… ఫాఫం, ఇక లక్ష్మి నటనకు స్కోప్ ఏముంటుంది..? అన్నింటికన్నా ముఖ్యంగా ఇందులో మోహన్‌బాబు నటించాడు…
తండ్రీకూతుళ్ల నడుమ మంచి సీన్స్ పడి ఉంటే సినిమాలో కాస్త జోష్ ఉండేది… ఈ కాంబినేషన్ అదిరిపోయేది… ఆయన నాలుగైదు సీన్లకు మంచి నటించలేదు… అసలు లక్ష్మికి సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ బాగానే ఉన్నా, ఆమెకు తెలంగాణ యాస అస్సలు నప్పలేదు… మామూలు భాషే పెట్టి ఉండాల్సింది… బీజీఎం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది…
ఏదైనా ఒకే అంశం మీద కథనం కాన్సంట్రేట్ చేసి ఉంటే బాగుండేది… ప్రకృతి వైద్యం, మెడికల్ మాఫియా, కాస్మొటిక్ సర్జరీ తదితర అంశాలను కలగలిపేశారు… మోహన్ బాబును సరిగ్గా వాడుకోలేదు సరికదా సముద్రఖనినీ అంతే… ఒక్క లక్ష్మి పాత్రనే బలంగా ఎలివేట్ చేయాలని అనుకుంటే కొన్నయినా హై మూమెంట్స్ సినిమాలో ఉండి ఉండాల్సింది, అవి లేకపోవడమే సినిమాకు పేద్ద మైనస్…
పైగా సొంత సినిమా కదా, ఎంచక్కా ఆమే దర్శకత్వం వహిస్తే సరిపోయేది… ఈ దక్ష కథకు ఆమె దక్షత సరిపోదా ఏం..? ప్చ్, లచ్చక్క శ్రమ, ఖర్చు, ప్రయాస పెద్దగా వర్కవుట్ కాలేదు… బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ విత్ ఓన్ డైరెక్షన్.. అండ్ విత్ న్యూజెన్ స్టోరీ..!!
Share this Article